• facebook
  • twitter
  • whatsapp
  • telegram

తడబడకుండా ప్రసంగం

నలుగురినీ ఉద్దేశించి మాట్లాడాల్సిన సందర్భాలు, వేదికమీద ప్రదర్శనలివ్వాల్సిన కార్యక్రమాలు... ప్రతి విద్యార్థికీ ఎదురయ్యేవే. కానీ చాలా మంది వెనకడుగేస్తుంటారు. కొన్ని చిన్నచిన్న విషయాలపై శ్రద్ధపెడితే ఈ భయాన్ని అధిగమించవచ్చు!

తొలుత బాగా సాధన చేయడం తప్పనిసరి. ఎంత చక్కగా సన్నద్ధం అయితే అంత ఆత్మవిశ్వాసంతో చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా, ఆహ్లాదకరంగా చెప్పగలుగుతాం. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడూ ఇదే సూత్రం పాటించాలి.

‣ ఎక్కడ పొరపాటు చేస్తామో అని భయపడకుండా, అంతా బాగానే జరుగుతుందనే ఆశావహ దృక్పథంతో ఉండాలి.  

‣ మనం బాగా కంగారు పడినప్పుడు తెలియకుండానే బిగుసుకుపోతుంటాం. అది మరింత అసౌకర్యానికి దారితీస్తుంది. ప్రదర్శనకు ఓ పదిహేను నిమిషాల ముందు చిన్నపాటి స్ట్రెచింగ్‌ చేయడం వల్ల శరీరానికీ, మనసుకూ ఉపశమనంగా ఉంటుంది.

‣ వేదిక అంటే భయం ఉన్నవారికి కార్యక్రమం మొదలవుతుందనగా చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు దీర్ఘశ్వాస తీసుకోవడం మంచిది.  

‣ ప్రసంగాల్లో ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నామో,  సన్నద్ధమయ్యామో... దాన్ని బట్టీకొట్టినట్టు అప్పజెప్పకుండా సొంత మాటల్లో చెప్పేందుకు ప్రయత్నించాలి. శ్రోతలతో మాట్లాడుతున్నట్టే ప్రసంగం ఉండటం వల్ల ఎలాంటి తత్తరపాటు లేకుండా ప్రశాంతంగా మాట్లాడగలుగుతాం.

‣ కెఫీన్, షుగర్‌ తీసుకోవడం బాగా తగ్గించాలి. లేదంటే వీటి వల్ల యాంగ్జైటీ పెరిగే అవకాశం ఉంటుంది. 

‣ ‘ఆడియన్స్‌ నాకంటే తెలివైనవారు, ఈ పని నాకంతగా రాదు, నేనెప్పుడూ మంచి ప్రదర్శన కనబరచలేదు...’ ఇలాంటి ఆలోచనలు అస్సలు రానివ్వకూడదు. ‘ఇది నేను కచ్చితంగా చేయగలను’ అనే దృఢచిత్తంతో సిద్ధం కావాలి. 

‣ ఏవైనా చిన్నచిన్న పొరపాట్లు జరిగితే అది శ్రోతలకు చెప్పడం,  క్షమాపణలు అడగడం వంటివి చేయకూడదు. దానివల్ల వారి ఫోకస్‌ దెబ్బతింటుంది. చెప్పే విషయంపైకంటే తప్పులపై శ్రద్ధపెట్టే ప్రమాదం ఉంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మరిచిపోతున్నారా... మంచిదే!

‣ ఐఐటీ సహా ప్రసిద్ధ సంస్థల్లో డిగ్రీ

‣ డీఆర్డీవోలో ఉద్యోగాలు

‣ ఏ ఉద్యోగ పరీక్షకు సిద్ధం కావాలి?

‣ ఏపీఈఏపీ సెట్‌ ప్రవేశాల్లో మార్పులు

‣ కనుమరుగవుతున్న లంకలు

‣ శాస్త్రసాంకేతిక అగ్రశక్తిగా చైనా

Posted Date : 07-09-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌