‣ భారత్‌లో పరిశోధనలకు గ్రహణం
ఆగస్టు-2022 తొమ్మిదో తేదీన జరిగిన రెండు వేర్వేరు సంఘటనలు ప్రపంచంలో శాస్త్రసాంకేతిక పరిశోధనల భావి గతిని కళ్లకు కడుతున్నాయి. ఆ రోజు అమెరికాలో సెమీ కండక్టర్, మైక్రోచిప్‌ల పరిశోధన-ఉత్పత్తికి 5,300 కోట్ల డాలర్ల నిధులిచ్చి ప్రోత్సహించడానికి ఉద్దేశించిన చిప్‌లు, సైన్స్ బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేసి చట్టరూపమిచ్చారు. రాబోయే అయిదేళ్లలో సెమీ కండక్టర్ల రంగంలో అమెరికా ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు 28,000 కోట్ల డాలర్లకు చేరనున్నాయి. 1990లో ప్రపంచ సెమీకండక్టర్ల ఉత్పత్తిలో అమెరికా వాటా 37శాతం; ఇప్పుడది 12శాతమే. నేడు 75శాతం సెమీకండక్టర్లు, మైక్రోచిప్‌లు ఆసియాలోనే తయారవుతున్నాయి. ఈ రంగంలో మళ్ళీ పూర్వ వైభవాన్ని సాధించడానికి ఆగస్టు తొమ్మిదో తేదీన అమెరికా అధ్యక్షుడు కొత్త చట్టం తీసుకొచ్చారు. సరిగ్గా అదే రోజు అత్యుత్తమ శాస్త్ర పరిశోధన పత్రాల ప్రచురణలో ప్రప్రథమంగా తాను అమెరికాను మించిపోయినట్లు చైనా ప్రకటించింది.
సుదీర్ఘ ప్రణాళికలు
తమ పరిశోధనల్లో కొంత భాగానికి ఇతరుల అధ్యయనాలు ఉపకరించాయని పరిశోధకులు ప్రకటించడం ఆనవాయితీ. 2022లో ప్రపంచమంతటా అలాంటి ఉటంకింపులకు పాత్రమైన అత్యుత్తమ పరిశోధక పత్రాల్లో 27.2శాతం చైనా శాస్త్రసాంకేతిక నిపుణులు ప్రచురించినవే. 24.9శాతం ఉటంకింపులతో అమెరికా రెండో స్థానానికి పరిమితమైంది. బ్రిటన్ 5.5 శాతంతో సరిపెట్టుకుందని క్లారివేట్ అనే రిసెర్చ్ ఎనలిటిక్స్ సంస్థ వెల్లడించింది. చైనాలో ఉండి పరిశోధన సాగించిన చైనీయులు 4,07,181 పరిశోధక పత్రాలను ప్రచురించారు. అమెరికాలోని చైనీయులు 2,93,434 పత్రాలను వెలువరించారు. 2015లోనే అత్యుత్తమ పరిశోధన పత్రాల ప్రచురణలో ఐరోపా సమాఖ్య(ఈయూ)ను చైనా మించిపోయింది. 2022లో ప్రపంచంలో 20 మంది అత్యున్నత పరిశోధకుల్లో ఎనమండుగురు చైనీయులేనని ‘నేచర్ ఇండెక్స్’ వెల్లడించింది. శాస్త్రసాంకేతిక రంగాల్లో పరిశోధన-అభివృద్ధి(ఆర్ అండ్ డీ)పై భారీ పెట్టుబడులు పెట్టనిదే ఏ దేశమూ అభివృద్ధి చెందలేదని చరిత్ర చెబుతోంది. ప్రపంచంలో అగ్రశక్తిగా ఎదగాలనుకొంటున్న చైనా గడచిన రెండు దశాబ్దాలుగా ఉన్నత విద్యారంగం ద్వారా ఆర్ అండ్ డీపై ఎక్కువ పెట్టుబడులు పెడుతోంది. 2025 వరకు శాస్త్రసాంకేతిక రంగాల్లో పరిశోధనలపై ఏటా ఏడుశాతం చొప్పున పెట్టుబడులను పెంచుకుంటూ పోతానని 2020లోనే చైనా ప్రకటించింది. కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అగ్రస్థానాన్ని సాధించడం తన లక్ష్యమని ఉద్ఘాటించింది. నిరుడు అమెరికాలో ఆర్ అండ్ డీపై ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పెట్టుబడి 67,900 కోట్ల డాలర్లు. 55,000 కోట్ల డాలర్లతో చైనా రెండో స్థానంలో నిలిచింది. ఇతర దేశాలు తక్షణ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తే చైనా దీర్ఘకాలిక ప్రయోజనాలకు పెద్దపీట వేసి నిధులు ఖర్చుపెడుతోంది. ఈ ప్రణాళికల ద్వారా నిర్దిష్ట ఫలితాలను సాధిస్తోంది. ఉదాహరణకు 2021-25 ప్రణాళికా కాలంలో చైనా నవకల్పనల యంత్రాంగం వేగంగా ఫలితాలను సాధించేలా చూడటానికి ప్రాధాన్యమిచ్చింది. కీలక రంగాలను కొత్త మలుపు తిప్పే ఆవిష్కరణలపై దృష్టిపెట్టింది. సెమీ కండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాలే భవిష్యత్తులో ప్రగతికి చోదక శక్తులని గ్రహించి ఆయా రంగాల్లో పరిశోధనలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ఆ బృహత్తర కృషి ఫలిస్తోంది. 2022 ఏప్రిల్‌లో చైనా క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో అద్భుత విజయం సాధించింది. 2019లో గూగుల్ సాధించినదానికన్నా 10 లక్షల రెట్లు ఎక్కువ శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాసెసర్‌ను చైనా రూపొందించింది.
పాఠాలు నేర్వాల్సిన తరుణం
శాస్త్రసాంకేతిక రంగాల్లో పరిశోధనలు చైనా అగ్ర సైనిక శక్తిగా ఎదగడానికి తోడ్పడతాయి. చైనా విశ్వవిద్యాలయాలు అత్యున్నత స్థాయి పరిశోధనలకు, పేటెంట్ల సాధనకు ప్రోత్సాహమిస్తాయి. అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేలా, కొత్త ప్రమాణాలను సృష్టించేలా తమ పరిశోధకులకు అండదండలిస్తాయి. ప్రతిభావంతుల మధ్య పోటీని ప్రోత్సహించి విజేతలకు నిధులు, వసతులకు లోటు లేకుండా చూస్తాయి. భారత్‌లో జాతీయ ప్రయోజనాలకన్నా సొంత అజెండాలకే ప్రాధాన్యమిచ్చే ధోరణులు పెచ్చరిల్లుతున్నాయి. చైనా విశ్వవిద్యాలయాల్లో సాటిలేని మేటి పరిశోధక పత్రాలు ప్రచురించి, పేటెంట్లు సాధించిన ఆచార్యులు మాత్రమే ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. సాధించిన పేటెంట్ల సంఖ్యను బట్టి చైనాలో విశ్వవిద్యాలయాలకు ర్యాంకులు నిర్ణయిస్తారు. కొన్ని విశ్వవిద్యాలయాలు ఒక పేటెంటును మూడు పరిశోధన పత్రాలకు సమానంగా పరిగణించి పరిశోధకులకు పదోన్నతులు, ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తాయి. దీనికి భిన్నంగా భారతీయ విశ్వవిద్యాలయాలు తమ ఆచార్యులు పరిశోధన పరంగా ఏమీ సాధించకపోయినా, కేవలం సీనియారిటీని బట్టి జీవితకాల ఉద్యోగ భద్రత, జీతభత్యాలు, పదోన్నతులను కట్టబెడతాయి. ఆశ్రిత పక్షపాతం సరేసరి. చైనాలో పరిశోధనలు కాగితాలకే పరిమితం కావు. వాస్తవ రూపం ధరించి ఆచరణలోకి వచ్చి దేశాన్ని ముందుకుతీసుకెళతాయి. అమెరికా కూడా 1950 నుంచి రెండు దశాబ్దాలపాటు ఇలానే చేసింది. భారతదేశం ఈ రెండు దేశాల అనుభవాల నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. భారత్ ఇప్పుడు సెమీకండక్టర్ల రంగంలోకి ప్రవేశిస్తుంటే, చైనా తదుపరి శిఖరాలను అధిరోహించడానికి దూసుకెళుతోంది. శాస్త్రసాంకేతిక ఆవిష్కరణలతో బలీయ సైనిక శక్తిగా అవతరిస్తూ మన సరిహద్దులో కయ్యానికి దిగుతోంది. భారత్ ఇకనైనా సరిపడా నిధులు కేటాయించి- చిత్తశుద్ధితో శాస్త్రసాంకేతిక పరిశోధనలు, అభివృద్ధికోసం తక్షణ చర్యలకు సంసిద్ధం కావాలి.
పెరుగుతున్న పోటీ
ఇటీవలి సంవత్సరాల్లో ప్రపంచమంతటా శాస్త్రసాంకేతిక పరిశోధనలపై ఆసక్తి పెరిగింది. దానికి తగినట్లే పేటెంట్ల దాఖలూ పెరిగింది. అమెరికా గతంలో పరిశోధన-అభివృద్ధి రంగంపై భారీగా పెట్టుబడులు పెట్టి ఇప్పటికీ వాటి ఫలాలను అనుభవిస్తోంది. ప్రపంచంలో అగ్ర రాజ్యంగా రాణిస్తోంది. కానీ, ఇప్పుడు చైనా అనేక రంగాల్లో అమెరికా, ఐరోపాలకు దీటుగా నిలుస్తోంది. మున్ముందు వాటి ఆధిక్యాన్ని సవాలు చేయవచ్చు కూడా. ఇటీవలి వరకు చైనా, అమెరికాల మధ్య శాస్త్రసాంకేతిక రంగాల్లో వెల్లివిరిసిన సహకారం క్రమంగా తరిగిపోతోంది. రెండు దేశాలతో పరిశోధన పరంగా సంబంధం ఉందని ప్రకటిస్తున్న శాస్త్రవేత్తల సంఖ్య 20శాతం వరకు తగ్గిపోయింది. ఇప్పుడు చైనా, అమెరికాల మధ్య సహకారం బదులు పోటీ పెరుగుతోంది. రేపు అవి భిన్న ధ్రువాలుగా సంఘర్షించే అవకాశం ఎక్కువే. దీనివల్ల ప్రపంచానికి మేలు కన్నా కీడే అధికం. మానవాళి శ్రేయస్సుకు తోడ్పడే నవ కల్పనల జోరును ఈ సంఘర్షణ మందగింపజేసే ప్రమాదం ఉంది.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ అసిస్టెంట్ కొలువుకు ఏఏఐ ఆహ్వానం
‣ సీఎస్ఈ, ఐటీల్లో ఏది ఎంచుకోవాలి?
‣ స్టడీమెటీరియల్.. మాక్‌టెస్టులు.. లైవ్‌క్లాసులు ఉచితం!
‣ ఐఎన్‌సీఓఐఎస్‌లో ప్రాజెక్ట్ సైంటిస్ట్‌లు