ప్రైవేటు బాటలో క్యూబా!
క్యూబా అనగానే మనకు గుర్తుకొచ్చే రూపం... సైనిక దుస్తులు, కొద్దిపాటి గెడ్డం, నోట్లో హవానా చుట్టతో కనిపించే ఫిడెల్ క్యాస్ట్రో! దాదాపు అయిదు దశాబ్దాల పాటు క్యూబాకు తిరుగులేని నాయకుడిగా ఉండి, అమెరికా సామ్రాజ్యవాద విధానాలను ధైర్యంగా ఎదుర్కొని తన దేశానికి విభిన్నమైన వ్యక్తిత్వాన్ని, గుర్తింపును అందించిపెట్టిన మహోన్నత నాయకుడాయన.