• facebook
  • whatsapp
  • telegram

భద్రతామండలి ప్రక్షాళన ఇంకెప్పుడు?

‘ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాను నిలువరించడంలో ఐరాస వైఫల్యమే ఆ సంస్థ ఎలా ఉండకూడదు అనడానికి ఉదాహరణ’- ఐరాస సర్వ ప్రతినిధి సభ అధ్యక్షుడు సాబా కొరొసి ఇటీవల వెల్లడించిన అభిప్రాయమిది. ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరమని గుర్తుచేసిన ఆయన- ఈ దిశగా ఇండియా ప్రయత్నాన్ని శ్లాఘించారు. మండలిని విస్తరించాలన్న డిమాండుకు మద్దతు ప్రకటించారు.

ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ 77వ సెషన్‌ అధ్యక్షుడు సాబా కొరొసి గత నెల 29, 30 తేదీల్లో భారత్‌లో పర్యటించారు. ఐరాస కార్యక్రమాలను భారత్‌ ఆదర్శప్రాయంగా అమలు చేస్తోందంటూ కితాబిచ్చారు. ఐరాస, భద్రతామండలి, అనుబంధ సంస్థల్లో తీసుకురావాల్సిన సంస్కరణలపై విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ఆయన చర్చించారు. ఆవిర్భావ లక్ష్యాలకు దూరంగా సాగుతున్న ఐరాస ప్రస్థానాన్ని గాడిలో పెట్టాలన్న కొరొసి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. భద్రతా మండలిలో అమెరికా, రష్యా, బ్రిటన్‌, చైనా, ఫ్రాన్స్‌ (పీ-5)లు వీటో అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా నిలువరించాలనీ ఆయన వ్యాఖ్యానించారు. వీటోతో తీర్మానాలను అడ్డుకొనే దేశాలు అందుకు గల కారణాలను సర్వప్రతినిధి సభకు వివరించాలంటూ కీలక సవరణను కొరొసి ఇటీవల ప్రతిపాదించారు.

చైనా అడ్డుపుల్ల

పీ-5 దేశాలకు తోడు తాత్కాలిక ప్రాతిపదికన మరో పది దేశాలు భద్రతా మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వాటి పదవీకాలం రెండేళ్లు. ఏటా అయిదు దేశాలు వైదొలగుతూ, మరో అయిదు దేశాలు అందులో చేరుతూ ఉంటాయి. ఐరాసలోని 193 సభ్యదేశాల్లో సుమారు 50 దేశాలకు ఒక్కసారైనా మండలిలో ప్రాతినిధ్యం దక్కలేదు. 2021లో ఎనిమిదోసారి మండలిలో చోటు సంపాదించిన భారత్‌ పదవీకాలం ఇటీవలే ముగిసింది. వాస్తవానికి జనాభా, వైశాల్యం, నాగరిక చరిత్ర, ప్రజాస్వామ్య విలువలు, ఆర్థిక వ్యవస్థ, వైవిధ్య సాంస్కృతిక వారసత్వం, ఐరాస లక్ష్యాల సాధనలో పోషించిన పాత్ర, సైనిక, సాయుధ సంపత్తి తదితరాలన్నీ భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి అర్హమైన అంశాలే. ఐరాస శాంతి పరిరక్షణ దళాలకు ఇండియా సుమారు 17వేల సిబ్బందిని పంపించింది. కరోనా సంక్షోభ సమయంలో వందకుపైగా దేశాలకు మందులు, వ్యాక్సిన్లు, ఔషధ సామగ్రిని ఇండియా అందజేసింది. పొరుగున శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో మునిగినా, అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలనతో ఆహార ధాన్యాల కొరత తలెత్తినా, నేపాల్‌లో భూకంపాలు సంభవించినా, బంగ్లాదేశ్‌లో వరదలు పోటెత్తినా నేనున్నానంటూ ఆపన్నహస్తం అందించిన దృష్టాంతాలు అంతర్జాతీయంగా దిల్లీ ఖ్యాతిని పెంచాయి. తనతో పాటు బ్రెజిల్‌, జర్మనీ, దక్షిణాఫ్రికా(జీ-4)లకు మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండును ఇండియా కొన్నాళ్లుగా లేవనెత్తుతోంది. దానికి అమెరికా, రష్యా, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌లు సానుకూలత వ్యక్తం చేస్తున్నాయి. చైనా మాత్రం వీటోతో అడ్డుపుల్ల వేస్తోంది.

భద్రతా మండలి ప్రస్తుత కూర్పు అసంబద్ధంగా ఉంది. ఆఫ్రికా (ప్రపంచ విస్తీర్ణంలో 20శాతం, జనాభాలో 16.72శాతం), దక్షిణ అమెరికా (విస్తీర్ణం 12శాతం, జనాభా 5.53శాతం)లకు అసలు ప్రాతినిధ్యమే లేదు. ఆసియా నుంచి చైనా ఉన్నా... పొరుగు దేశాలతో కయ్యానికి దిగడం, పేద దేశాలకు అప్పులిచ్చి గుప్పిట పెట్టుకోవడం, నయానో భయానో బెదిరించడం ద్వారా దక్షిణాసియాలో అది ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. ఐరాస అనుబంధ సంస్థల్లో తన అస్మదీయులను నింపడం, విరివిగా విరాళాలివ్వడం ద్వారా వాటిపైనా డ్రాగన్‌ పట్టు సాధించింది. వీటో అధికారాన్ని చైనా తరచూ దుర్వినియోగం చేస్తున్నట్లు మండలి తీర్మానాల చిట్టాయే స్పష్టం చేస్తోంది.

నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి

యుద్ధాల నివారణ, శాంతి పరిరక్షణను భద్రతా మండలిలోని దేశాలు నాడు తమ బాధ్యతగా స్వీకరించాయి. దానికి భిన్నంగా ఆ దేశాలే ఏకపక్షంగా అణచివేత, ఆక్రమణలకు దిగుతున్నాయి. క్రిమియాను 2014లో ఆక్రమించిన రష్యా- పొరుగుదేశం ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగి లుహాన్స్క్‌, దొనెట్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజియా ప్రాంతాలను తనవిగా ప్రకటించుకుంది. వాటిని కాపాడుకునేందుకు యుద్ధక్షేత్రం నుంచి వైదొలగడం లేదు. ఈ సంఘర్షణలో నాటో దేశాలు, చైనా తమ ప్రయోజనాలు వెతుక్కోవడం విషాదకరం. రష్యా తీరును ఖండిస్తూ ఐరాస సర్వప్రతినిధి సభలో, భద్రతా మండలిలో పలుసార్లు ఓటింగ్‌ జరగ్గా, ఇండియా గైర్హాజరైంది. చర్చలు మాత్రమే సమస్యకు పరిష్కారం చూపగలవంటూ ఈ విషయంలో మొదటినుంచీ తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. మానవతాసాయంగా బాధిత దేశానికి మందులు, నిత్యావసరాలు పంపించడంతో పాటు మధ్యవర్తిత్వానికీ చొరవ చూపింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఇండియా మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి. వసుధైవ కుటుంబ భావనతో జీ-20కి సారథ్యం వహిస్తున్న భారత్‌- బహుపాక్షిక, ప్రాంతీయ సమగ్రతల పరిరక్షణలో ప్రపంచదేశాల గొంతుకగా నిలవాలి. తద్వారా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి యోగ్యమైన దేశంగా చాటుకోవాలి.

- బోండ్ల అశోక్‌
 
********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కొత్త బడ్జెట్‌... కోటి ఆశలు!

‣ కేంద్ర బడ్జెట్‌ 2023-24

‣ కేంద్ర సామాజిక, ఆర్థిక సర్వే 2022-23

‣ ఆర్థిక వృద్ధికి చుక్కాని అవుతుందా?

Posted Date: 07-02-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అంతర్జాతీయం

మరిన్ని
 
లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

విద్యా ఉద్యోగ సమాచారం