• facebook
  • whatsapp
  • telegram

Osmania university: వృత్తి నిపుణులు.. ఉద్యోగులకు ఇంజినీరింగ్‌ కోర్సు

* డిప్లొమాతో ఆపేసి.. ఇంజినీరింగ్‌ డిగ్రీ కోరుకుంటున్న వారికి ప్రత్యేకం
* ఉస్మానియా విశ్వవిద్యాలయం, అనుబంధ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలు

 


ఈనాడు, హైదరాబాద్‌: డిప్లొమా పూర్తిచేసిన వృత్తి నిపుణులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా ఇంజినీరింగ్‌ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. గతేడాది ప్రయోగాత్మకంగా మూడు విభాగాల్లో కోర్సులను ప్రారంభించిన విశ్వవిద్యాలయం అధికారులు ఈ విద్యా సంవత్సరం నుంచి నాలుగు విభాగాల (సివిల్, మెకానికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌) కోర్సులను ప్రవేశపెట్టింది. ఒక్కో కోర్సులో 30 మందికి మాత్రమే ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహించనున్నారు. విశ్వవిద్యాలయం క్యాంపస్‌తో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదువుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రతి విభాగంలో 30 సీట్లు మాత్రమే ఉంటాయి. ఆరు సెమిస్టర్లలో ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తవనుందని అధికారులు తెలిపారు.

* ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేక...

కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితుల కారణంగా డిప్లొమా ఇంజినీరింగ్‌ చదివి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వేలమంది డిప్లొమా ఇంజినీర్లు పనిచేస్తున్నారు. వారిలో చాలామందికి చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నా... పరిస్థితులు అనుకూలించకపోవడంతో ముందుకు వెళ్లలేకపోతున్నారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా బాగున్నా.. కృత్రిమ మేధ, ఆటోక్యాడ్, కంప్యూటర్ల వినియోగంపై వారికి సరైన అవగాహన ఉండడం లేదు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువతతో పోటీపడలేకున్నారు. వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం వారిని ఇంజినీర్లుగా మార్చాలన్న లక్ష్యంతో ‘వర్కింగ్‌ ప్రొఫెషనల్‌ అడ్మిషన్‌ కమిటీ’ని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ సిఫారసులకు అనుగుణంగా ఇంజినీరింగ్‌ కోర్సులను రూపొందించింది. 

పరిమితంగా సీట్లు.. సాయంకాలం బోధన.. 

ప్రవేశ పరీక్ష ద్వారా పరిమితంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌ సహా, వర్సిటీ పరిధిలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సాయంకాలం మాత్రమే బోధన నిర్వహించనున్నారు. ఈ కోర్సును లేటరల్‌ ఎంట్రీగా పరిగణిస్తున్నామని, అఖిలభారత సాంకేతిక విద్యామండలి మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించామని ‘వర్కింగ్‌ ప్రొఫెషనల్‌ అడ్మిషన్‌ కమిటీ’ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కుమార్‌ తెలిపారు. ఆరు సెమిస్టర్ల కోర్సులో సమకాలీన, భవిష్యత్తు పరిణామాలను పరిగణనలోకి తీసుకుని మూల్యాంకనం రూపొందించామని వివరించారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.