• facebook
  • whatsapp
  • telegram

Job Calendar : జాబ్‌ క్యాలెండర్‌లో అధ్యాపకుల పోస్టులు

* డైట్‌ కళాశాలలు, ఎస్‌సీఈఆర్‌టీలో 110 ఖాళీల భర్తీ
 


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న ఉద్యోగ క్యాలెండర్‌లో పాఠశాల, కళాశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు చేరనున్నాయి. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 110, కళాశాల విద్యాశాఖ పరిధిలో సుమారు 600 అధ్యాపక ఖాళీలను భర్తీ చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని మోడల్‌ స్కూళ్లలో 707 టీచర్‌ పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా.. వాటిపైనా కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే 5 వేలకుపైగా ప్రభుత్వ ఉపాధ్యాయుల ఖాళీలను కూడా భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవలే ప్రకటించినందున అవి కూడా చేర్చవచ్చని భావిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం ప్రకటించే ఉద్యోగ క్యాలెండర్‌లో అధిక సంఖ్యలో పోస్టులు విద్యాశాఖ నుంచే ఉంటాయని తెలుస్తోంది.

ఏడాదిన్నర క్రితమే అనుమతి ఇచ్చినా..

పాఠశాల విద్యాశాఖలో 134 ఖాళీల భర్తీకి 2022 నవంబరులో ఆరిక శాఖ అనుమతి ఇస్తూ జీఓ 165ను జారీ చేసింది. అందులో 110 అధ్యాపక, సీనియర్‌ అధ్యాపక పోస్టులున్నాయి. వాటిలో రాష్ట్రంలో 12 డైట్‌ కళాశాలల్లో 65 అధ్యాపక, మరో 23 సీనియర్‌ అధ్యాపక ఉద్యోగాలున్నాయి. వరంగల్, మహబూబ్‌నగర్, నాగార్జునసాగర్‌లోని మూడు ప్రభుత్వ బీఈడీ కళాశాలలు, హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ ఎడ్యుకేషన్, ఎస్‌సీఈఆర్‌టీలో మరో 22 అధ్యాపక ఖాళీలు కలిపి మొత్తం 110 కొలువులను భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీకి అనుమతి ఇచ్చినా నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేకపోయారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుడిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఈవీ నర్సింహారెడ్డి ఆ పోస్టుల భర్తీ విషయంపై కమిషన్‌ అధికారులతో మాట్లాడారు. 

* వాటిని ఉద్యోగ క్యాలెండర్‌లో ప్రకటించి భర్తీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. డిప్యూటీ ఈఓ ఖాళీలు 24 ఉన్నందున వాటిని కూడా జాబ్‌ క్యాలెండర్‌లో చేర్చనున్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే వాటిని గ్రూపు-1లో చేర్చాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. డిగ్రీ కళాశాలల్లో 544 ఖాళీల భర్తీకి 2022లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో 491 అధ్యాపక, 29 ఫిజికల్‌ డైరెక్టర్లు, 24 లైబ్రేరియన్ల ఉద్యోగాలున్నాయి. వాటికి 2022 డిసెంబరు 31న టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చినా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగిపోయింది. ఆరికశాఖ ఆదేశాలతో ఖాళీల వివరాలను పంపినట్లు కళాశాల విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.