• facebook
  • whatsapp
  • telegram

NEET-UG : పరీక్షా కేంద్రాల వారీగా నీట్‌-యూజీ ఫలితాలు

*  వెల్లడించిన ఎన్టీయే
 


దిల్లీ: నీట్‌-యూజీ 2024 ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకల వ్యవహారంపై దుమారం కొనసాగుతూనే ఉంది. మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నగరాలు, పరీక్షా కేంద్రాల వారీగా నీట్‌-యూజీ ఫలితాలను జాతీయ పరీక్షల సంస (ఎన్టీయే) శనివారం విడుదల చేసింది. ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యారుల గుర్తింపు బహిర్గతం కాకుండా జాగ్రత్త పడింది. గత నెల్లో నీట్‌-యూజీ 2024 ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 40కిపైగా పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. ఈ క్రమంలోనే నగరాలు, పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలను శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోగా విడుదల చేయాలని ఎన్టీయేను ఆదేశించింది. ఈ వ్యవహారంపై జులై 22న ధర్మాసనం తదుపరి విచారణ చేపట్టనుంది.  
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.