అంతమొందించకుంటే ముప్పే!
చైనాలో మొదలైన కోవిద్-19 (కరోనా) వైరస్ మార్చి13 నాటికి 110 దేశాల్లో 1,32,000 మందికి పైగా సోకి 4,947 మరణాలకు కారణమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ వైరస్ వల్ల మరణాల రేటు వయోవృద్ధుల్లోనే ఎక్కువగా ఉందని చైనా, ఇటలీ దేశాల అనుభవం తెలుపుతోంది.