• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వాట్సాప్‌... టీచర్‌!

తరగతిలో పాఠాలు చెప్పడమే కాదు, ఆపై ఏ క్షణమైనా సందేహాలు తీర్చే టీచర్లూ చాలామంది కదూ! ఈ టీచరమ్మా అంతే! అయితే ఈమె పాఠాలను తరగతిలో చెప్పదు కానీ... సందేహాలన్నీ మనం అడిగిన భాషలో తీర్చేస్తుంది. ఇంతకీ ఎవరీ టీచర్‌?


   పేరు మలార్‌. సంప్రదాయ కట్టు, నిండైన నగలతో అచ్చమైన భారతీయ మహిళలా ఉంటుంది. అయితే మనిషి కాదండోయ్‌... ఏఐ. ప్రపంచంలోనే తొలి అటానమస్‌ ఏఐ యూనివర్సిటీ ప్రొఫెసర్‌. ఈమెను చెన్నైకి చెందిన ‘హైవ్‌’ అనే సంస్థ రూపొందించింది. తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్‌ కోర్సులకు సంబంధించిన సిలబస్‌ని అంతా బోధించగలదు. విద్యార్థి ప్రశ్న అడగగానే బోలెడు మెటీరియల్‌ని రిఫర్‌ చేసి మరీ సమాచారం అందిస్తుంది.


   పదేళ్ల పిల్లాడు సైతం అర్థం చేసుకునేలా చెప్పడం మలార్‌ ప్రత్యేకత. పైగా స్థానిక భాషల్లో బోధిస్తుంది... అదీ వాట్సాప్‌లో! కంపెనీ నిర్వాహకులు కొందరు విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సేకరించినప్పుడు ‘కొత్త యాప్‌లు వేసుకోవడం వల్ల మెమరీ దండగ. పైగా డేటా ఖర్చు’ అన్నారట. అందుకే వాట్సాప్‌లో సేవలు అందించేలా రూపొందించారు. అయితే రోజుకి 20 ప్రశ్నలకు మాత్రమే ఉచితంగా సమాధానాలు పొందుతారు. అంతకన్నా మించితే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అన్నా యూనివర్సిటీకే! ఇకపై ఇతర వర్సిటీలతోనూ అనుసంధానించే పనిలో ఉన్నారట నిర్వాహకులు. 


మరింత సమాచారం... మీ కోసం!

‣ రాత పరీక్ష లేకుండా కొలువు!

‣ వాలంటరీ వర్క్‌తో ఐటీ ఉద్యోగానికి తోవ!

‣ పొరపాట్లు దిద్దుకుంటే.. పక్కా గెలుపు!

‣ రోజుకో గంట చదివితే... రూ.34లక్షల జీతం!

‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!

Posted Date : 24-07-2024 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం