* బోర్డు అధికారిక ప్రకటన
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను (TS Inter Results 2024) ఈ నెల 24న (బుధవారం) విడుదల చేయనున్నట్లు బోర్డు సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఉదయం 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాలు ఒకేసారి ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేస్తారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 మూల్యాంకనం జరిగింది. ఈ ఫలితాలను https://pratibha.eenadu.net/ తో పాటు https://tsbie.cgg.gov.in వెబ్సైట్లలో చూడవచ్చు.
CLICK HERE FOR TELANGANA INTERMEDIATE – 2024 Results link
What Next After Intermediate?