‣ పోటీ పరీక్షల్లో లెక్కల చిట్కాలు
పోటీ పరీక్షల్లో సంఖ్యల వర్గాలకు ప్రాధాన్యం ఎక్కువ. అందుకే గత కొన్ని వారాలుగా సంఖ్యల వర్గాలు కనిపెట్టే వివిధ పద్ధతులను తెలుసుకుంటున్నాం. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు తప్పనిసరిగా 1 నుంచి 25 వరకు ఉన్న సంఖ్యల వర్గాలను గుర్తుంచుకోవాలి. ఇవి తెలిస్తే 125 వరకు ఉన్న సంఖ్యల వర్గాలను చాలా తేలికగా తెలుసుకునే అవకాశం ఉంది. అలా తెలుసుకునే స్పీడ్ మ్యాథ్స్ పద్ధతులను చూద్దాం.
25 నుంచి 50 వరకు..
వీటి మధ్య ఉన్న సంఖ్యల వర్గాలు తెలుసుకోవడానికి ‘50’ని బేస్ నంబర్‌గా తీసుకోవాలి. ఇచ్చిన సంఖ్య బేస్ నంబర్ ‘50’ కంటే ఎంత తక్కువ ఉందో చూసి తక్కువ ఉన్న సంఖ్యను ‘25’ (50/2) లో నుంచి తీసివేస్తే అది జవాబులోని మొదటి భాగం అవుతుంది. తర్వాత ఆ తక్కువ ఉన్న సంఖ్యకు వర్గాన్ని తీసుకుంటే అది జవాబు రెండో భాగం.
ఉదాహరణకు 422
ఇచ్చిన సంఖ్య బేస్ నంబర్ ‘50’ కంటే ‘8’ తక్కువ ఉంది. దీన్ని ‘25’లో నుంచి తీసివేస్తే (25-8)=17 అవుతుంది. ఇది జవాబు మొదటి భాగం అవుతుంది. అలాగే ‘8’ వర్గం 64. ఇది జవాబు రెండో భాగం. అంటే 1764 జవాబు.
422 = 1764
అదేవిధంగా 372కు వర్గం చూద్దాం.
37 సంఖ్య ‘50’ కంటే 13 తక్కువ.
25-13=12
132 = 169
అయితే దీనిలో 3 అంకెలు ఉన్నాయి. కాబట్టి వందల స్థానంలో ఉన్న ‘1’ని 12కు కలపాలి.
12
169
---------
1369
372 = 1369
25 నుంచి 50 వరకు ఉన్న ఏ సంఖ్యకైనా ఇలా తేలికగా వర్గాన్ని తెలుసుకోవచ్చు.
50 నుంచి 75 వరకు..
50-75 మధ్య ఉన్న సంఖ్యల వర్గాలు తెలుసుకోవడానికి కూడా ‘50’ని బేస్ నంబర్‌గా తీసుకోవాలి.
ఇచ్చిన సంఖ్య ‘50’ కంటే ఎంత ఎక్కువ ఉందో చూసి ఎక్కువగా ఉన్న సంఖ్యను ‘25’కు కలిపితే అది జవాబులోని తొలి భాగం అవుతుంది. తర్వాత ఎక్కువ ఉన్న సంఖ్య వర్గాన్ని తీసుకుంటే అది జవాబు రెండో భాగం అవుతుంది.
ఉదాహరణకు 592
ఇచ్చిన సంఖ్య బేస్ నంబర్ ‘50’ కంటే ‘9’ ఎక్కువ ఉంది. దీన్ని ‘25’కు కలిపితే (25+9) = 34 అవుతుంది. ఇది జవాబు తొలి భాగం. అలాగే ‘9’ వర్గం 81. జవాబు రెండో భాగం, అంటే 3481 జవాబు.
592 = 3481
అదేవిధంగా 672
67, 50 కంటే 17 ఎక్కువ.
25+17=42 జవాబు మొదటి భాగం.
172 = 289 దీనిలో మూడు అంకెలు ఉన్నాయి. కాబట్టి వందల స్థానంలో ఉన్న ‘2’ను 42కు కలపాలి
42
289
-------
4489
672 = 4489

*************************************
మరింత సమాచారం ... మీ కోసం!