దేశ వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2024 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష స్కోరు ఉన్నత విద్యతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల ఎంపికకు సైతం ఉపయోగపడుతుంది. ఐఐటీలు, నిట్ వంటి విద్యాసంస్థల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులు చేయడానికి గేట్ స్కోర్ తప్పనిసరి. ఈసారి గేట్‌ను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) నిర్వహించనుంది. గేట్-2024లో ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 24వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లనిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో పరీక్ష జరుగుతుంది. గేట్‌లో సాధించిన స్కోర్‌ను బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి.
వివరాలు...
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2024
అర్హతలు: ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, హ్యూమానిటీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి లేదు.
పరీక్ష విధానం: అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది. 30 సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు 1 లేదా 2 పేపర్లను ఎంపికచేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. 1, 2 మార్కుల ప్రశ్నలుంటాయి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1800(జనరల్ అభ్యర్థులకు), రూ.900(మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు).
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పరీక్షలు జరిగే ప్రాంతాలు...
తెలంగాణలో: హైదరాబాద్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్.
ఏపీలో: చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, కర్నూలు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 30-08-2023.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: 29-09-2023.
అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 13-10-2023.
పరీక్ష తేదీలు: 03-02-2024, 04-02-2024, 10-02-2024, 11-02-2024.
పరీక్ష ఫలితాల విడుదల: 16-03-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఎన్‌ఐఓహెచ్‌లో టెక్నికల్ క్యాడర్ పోస్టులు
‣ సూపర్ కెరియర్.. ‘సైబర్ సెక్యూరిటీ’
సూపర్ కెరియర్.. ‘సైబర్ సెక్యూరిటీ’
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
JNTUA: జేఎన్టీయూ అనంతపురంలో ఎంటెక్/ ఎంఎస్సీ ప్రోగ్రామ్
AP CHFW: ఏపీలో ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫీమేల్) ట్రైనింగ్ కోర్సు
RAYS: ఆర్ఏవైఎస్, నంద్యాలలో పీజీ డిప్లొమా కోర్సు
JNV: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు
JNV: నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు
MANAGE: మేనేజ్, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సు
NITT: నిట్ తిరుచిరాపల్లిలో ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సు
OU UCE: ఓయూ యూసీఈలో ఎంఈ, ఎంటెక్ ప్రోగ్రామ్
OU: ఓయూలో ఎంబీఏ ఈవెనింగ్ ప్రోగ్రామ్
AUDOA: ఏయూ విశాఖపట్నంలో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు
NID: ఎన్ఐడీలో ఎండిజైన్ ప్రోగ్రామ్
NID: ఎన్ఐడీలో బీడిజైన్ ప్రోగ్రామ్
NIPHM: ఎన్ఐపీహెచ్ఎంలో పీజీ డిప్లొమా, డిప్లొమా ప్రోగ్రామ్
SCTIMST: ఎస్సీటీఐఎంఎస్టీ, త్రివేండ్రంలో పీజీ డిప్లొమా, డిప్లొమా, పీడీఎఫ్ ప్రోగ్రామ్
IIFT: ఐఐఎఫ్‌టీ, కోల్‌కతాలో సర్టిఫికేట్ ప్రోగ్రామ్
IIFM: ఐఐఎఫ్ఎం, భోపాల్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాం
IITM: ఐఐటీ మద్రాస్‌లో ఈఎంబీఏ ప్రోగ్రామ్
APOSS: ఏపీ సార్వత్రిక విద్యలో ఇంటర్ ప్రవేశాలు
APOSS: ఏపీ సార్వత్రిక విద్యలో పదో తరగతి ప్రవేశాలు
NII: ఎన్ఐఐ, న్యూదిల్లీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్