ఐడీబీఐ 600 అసిస్టెంట్ మేనేజర్ల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది. మణిపాల్ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు ద్వారా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది (6 నెలలు తరగతి పాఠాలు, 2 నెలలు ఇంటర్న్‌షిప్, 4 నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్) పాటు పీజీడీబీఎఫ్‌లో శిక్షణ ఇస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఓ) ఉద్యోగం లభిస్తుంది.
ప్రకటన వివరాలు...
* జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఓ): 600 పోస్టులు (యూఆర్- 243, ఎస్సీ- 90, ఎస్టీ- 45, ఈడబ్ల్యూఎస్- 60, ఓబీసీ- 162)
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 31/08/2023 నాటికి 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఇస్తారు.
ఎంపిక ప్రక్రియ: అర్హులైన అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రతిభ కనబర్చిన వారు పర్సనల్ ఇంటర్వ్యూలకు అర్హత సాధిస్తారు. అందులో ప్రతిభ, ధ్రువపత్రాల పరీశీలన, వైద్య పరీక్షల ఆధారంగా తుది ఎంపికలు చేపడతారు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200, ఇతరులు రూ.1000 చెల్లించాలి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
రాత పరీక్ష: పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాగాలు.. లాజికల్ రీజనింగ్, డేటా అనాలసిస్, ఇంటర్‌ప్రిటేషన్ (60 ప్రశ్నలు, 60 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు, 40 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (40 ప్రశ్నలు, 40 మార్కులు), జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్ (60 ప్రశ్నలు, 60 మార్కులు) అంశాల నుంచి మొత్తం 200 ప్రశ్నలు వస్తాయి. సమయం రెండు గంటలు ఉంటుంది. పరీక్షలో రుణాత్మక మార్కులుంటాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు.
శిక్షణ, ఫీజు వివరాలు: ఎంపికైన అభ్యర్థులను ఏడాదిపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సులో చేరుస్తారు. ఆ సమయంలో అభ్యర్థులు కోర్సు ఫీజు కింద రూ.3,00,000 చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు నిర్దేశించిన విధంగా విడతల వారీగా ఫీజు కట్టే వెసులుబాటు ఉంది. అర్హుత గల అభ్యర్థులకు ఐడీబీఐ బ్యాంకు విద్యారుణం సైతం మంజూరు చేస్తుంది. కోర్సులో చేరేటప్పుడు అభ్యర్థులు మూడేళ్లు సర్వీస్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది.
జీతభత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలం (6 నెలలు)లో నెలకు రూ.5000 ఇస్తారు. ఇంటర్న్‌షిప్ (2 నెలలు) సమయంలో నెలకు రూ.15 వేలు చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరినవారికి రూ.6.14 నుంచి రూ.6.50 లక్షల వరకు వార్షిక వేతనం అందుతుంది.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ రిజిస్ట్రేషన్/ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 15-09-2023.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 30.09.2023.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 30.09.2023.
ఆన్లైన్ పరీక్ష తేదీ: 20-10-2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ యువతకు అవశ్యం ‘హరిత నైపుణ్యం’
‣ పఠన నైపుణ్యం పెంపొందించుకుందాం!
‣ రూ.లక్ష జీతంతో నాబార్డులో ఉద్యోగాలు
‣ కోస్ట్‌గార్డ్‌లో 350 కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
IIITDM: ట్రిపుల్ ఐటీడీఎం కర్నూలులో జూనియర్ నెట్వర్క్ ఇంజినీర్ పోస్టులు
CDAC: సీడ్యాక్-తిరువనంతపురంలో 08 ప్రాజెక్టు ఇంజినీర్లు
WAPCOS: వ్యాప్కోస్ లిమిటెడ్-140 కంట్రోల్ ఇంజినీర్ ఖాళీలు
IIPS: ఐఐపీఎస్, ముంబయిలో ప్రాజెక్ట్ పోస్టులు
BEML: బీఈఎంఎల్, బెంగళూరులో 119 గ్రూప్ సి పోస్టులు
NHB: నేషనల్ హౌసింగ్ బ్యాంకులో 43 అసిస్టెంట్/ డిప్యూటీ మేనేజర్ పోస్టులు
NIT: నిట్-దిల్లీలో లైబ్రరీ ట్రెయినీ పోస్టులు
ICMR: ఐసీఎంఆర్-ఎన్ఐఆర్టీ, చెన్నైలో 05 ఖాళీలు
ICMR: ఐసీఎంఆర్-ఎన్ఐఆర్టీలో 73 గ్రూప్ బీ, సీ పోస్టులు
BCPL: బీసీపీఎల్‌లో 04 ఆఫీసర్ పోస్టులు
PJTSAU: జయశంకర్ వర్సిటీలో డీన్, డైరెక్టర్ పోస్టులు
VCRC: వీసీఆర్‌సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు
AIIMS: ఎయిమ్స్-పట్నాలో 20 ఇన్స్ట్రక్టర్ పోస్టులు
ICFRE: ఐసీఎఫ్ఆర్ఈ-హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీలు
PGCIL: పీజీసీఐఎల్‌లో ఇంజినీర్ ట్రైనీ పోస్టులు
Railway: నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 51 స్పోర్ట్స్ పర్సన్ పోస్టులు
Army: ఇండియన్ ఆర్మీలో 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు
Paramedical Jobs: చిత్తూరు జిల్లాలో 54 మెడికల్, పారా మెడికల్ పోస్టులు
NIE: ఎన్ఐఈ, చెన్నైలో 47 టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు
AIIMS: ఎయిమ్స్ రాయ్‌బరేలిలో 40 జూనియర్ రెసిడెంట్ పోస్టులు