• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SSC CGL 2022: ఎస్‌ఎస్‌సీ- కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ ఎగ్జామ్‌-2022

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) తాజాగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌) పరీక్ష-2022కు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైర్-1, టైర్-2 తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

ఖాళీల వివరాలు...

* ఖాళీల సంఖ్య: 20,000

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు:

1. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్

2. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్

3. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్

4. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఐబీ)

5. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఎవోఆర్‌)

6. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఎంవోఈఏ)

7. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎఫ్‌హెచ్‌క్యూ)

8. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఈ&ఐటీ)

9. అసిస్టెంట్

10. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్

11. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్

12. ఇన్‌స్పెక్టర్(సీజీఎస్టీ & సెంట్రల్ ఎక్సైజ్)

13. ఇన్‌స్పెక్టర్(ప్రివెంటివ్ ఆఫీసర్)

14. ఇన్‌స్పెక్టర్(ఎగ్జామినర్)

15. అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్

16. సబ్ ఇన్‌స్పెక్టర్

17. ఇన్‌స్పెక్టర్(పోస్ట్ డిపార్ట్‌మెంట్)

18. అసిస్టెంట్/ సూపరింటెండెంట్

19. అసిస్టెంట్

20. అసిస్టెంట్(ఎన్‌సీఎల్‌ఏటీ)

21. రిసెర్చ్ అసిస్టెంట్

22. డివిజనల్ అకౌంటెంట్

23. సబ్ ఇన్‌స్పెక్టర్

24. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్

25. ఆడిటర్(సీ&ఏజీ)

26. ఆడిటర్

27. ఆడిటర్ (సీజీడీఏ)

28. అకౌంటెంట్

29. అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్

30. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్‌

31. ట్యాక్స్‌ అసిస్టెంట్‌

32. సబ్-ఇన్‌స్పెక్టర్

విద్యార్హతలు: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎస్/ పీజీ డిగ్రీ (కామర్స్/ ఎకనామిక్స్/ బిజినెస్ స్టడీస్)/ ఎంబీఏ (ఫైనాన్స్) అర్హత ఉండాలి.

వయోపరిమితి: 01.01.2022 నాటికి ఖాళీలను అనుసరించి 18-27 ఏళ్లు, 20-30 ఏళ్లు, 18-30 ఏళ్లు, 18-32 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: టైర్‌-1, టైర్‌-2 ఎగ్జామినేషన్‌, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్/ మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో రూ.100ను ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాలి(ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.)

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.09.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 08.10.2022.

ఆఫ్‌లైన్ చలానా జనరేషన్‌కు చివరితేది: 08.10.2022.

ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 09.10.2022.

చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 10.10.2022.

దరఖాస్తుల సవరణ తేదీలు: 12.10.2022 నుంచి 13.10.2022 (23:00) వరకు.

టైర్-1 పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): డిసెంబరు, 2022.

టైర్-2 పరీక్ష తేదీ: ప్రకటించాల్సి ఉంది.

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాల భ‌ర్తీ

‣ ఏఈఈ కొలువుల‌కు ఎలా సిద్ధం కావాలి?

‣ అసిస్టెంట్ కొలువుకు ఏఏఐ ఆహ్వానం

‣ సీఎస్ఈ, ఐటీల్లో ఏది ఎంచుకోవాలి?

‣ స్టడీమెటీరియల్‌.. మాక్‌టెస్టులు.. లైవ్‌క్లాసులు ఉచితం!

‣ ఐఎన్‌సీఓఐఎస్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌లు

Notification Information

Posted Date: 18-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :