ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) భారీ ఖాళీలతో క్లర్క్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 8,773 జూనియర్ అసోసియేట్స్(క్లరికల్ కేడర్) పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 525; అమరావతి సర్కిల్‌లో 50 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్ 17 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు....
పోస్టులు: జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్)
రాష్ట్రాల వారీగా ఖాళీలు:
1. ఉత్తర్ ప్రదేశ్- 1781
2. ఆంధ్రప్రదేశ్- 50
3. మధ్యప్రదేశ్- 288
4. రాజస్థాన్- 940
5. దిల్లీ- 437
6. ఉత్తరాఖండ్- 215
7. ఛత్తీస్‌గఢ్- 212
8. తెలంగాణ- 525
9. అండమాన్ అండ్ నికోబార్ దీవులు- 20
10. హిమాచల్ ప్రదేశ్- 180
11. హరియాణా- 267
12. జమ్ము అండ్ కశ్మీర్- 88
13. ఒడిశా- 72
14. పంజాబ్- 180
15. సిక్కిం- 04
16. తమిళనాడు- 171
17. పుదుచ్చేరి- 04
18. పశ్చిమ్ బెంగాల్- 114
19. కేరళ- 47
20. లక్షద్వీప్- 03
21. మహారాష్ట్ర- 100
22. అసోం- 430
23. అరుణాచల్ ప్రదేశ్- 69
24. మణిపూర్- 26
25. మేఘాలయ- 77
26. మిజోరం- 17
27. నాగాలాండ్- 40
28. త్రిపుర- 26
29. గుజరాత్- 820
30. కర్ణాటక- 450
31. లడఖ్- 50
32. బిహార్- 415
33. ఝార్ఖండ్- 165
మొత్తం పోస్టుల సంఖ్య:8,773 .
హైదరాబాద్ సర్కిల్(తెలంగాణ)లో పోస్టుల సంఖ్య: 525.
అమరావతి సర్కిల్(ఆంధ్రప్రదేశ్)లో పోస్టుల సంఖ్య: 50.
విద్యార్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్/ చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.04.2023 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 02.04.1995 - 01.04.2003 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ(జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
బేసిక్ పే: నెలకు రూ.19,900.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.
ప్రిలిమినరీ పరీక్ష: ఇది 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు.. 30 మార్కులకు; న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు... 35 మార్కులకు; రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు... 35 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం ఒక గంట. నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రధాన పరీక్షకు ఎంపికవుతారు.
మెయిన్ ఎగ్జామ్: మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నల సంఖ్య 190. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు... 50 మార్కులు; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు... 40 మార్కులు; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు... 50 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు... 60 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటల 40 నిమిషాలు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్.
ముఖ్యమైన తేదీలు...
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.11.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.12.2023.
ప్రిలిమినరీ పరీక్ష: జనవరి 2024లో జరుగుతుంది.
మెయిన్ పరీక్ష తేది: ఫిబ్రవరి 2024లో జరుగుతుంది.
=========================================
SBI CLERKS STUDY METERIAL
‣ Reasoning & Computer Aptitude | ‣ Quantitative Aptitude |
‣ General and Banking Awareness | ‣ English Language |
‣ PREVIOUS PAPERS | ‣ MODEL PAPERS |
మరింత సమాచారం... మీ కోసం!
‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!
‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
APSCSCL: ఏపీఎస్సీఎస్సీఎల్, తిరుపతిలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
AIIMS: ఎయిమ్స్ పట్నాలో 90 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
APSCSCL: ఏపీఎస్సీఎస్సీఎల్, పాడేరులో అకౌంటెంట్ పోస్టులు
HM&FW: అనంతపురం జిల్లాలో 24 మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ పోస్టులు
GGH: నెల్లూరు జీజీహెచ్‌లో 33 పారామెడికల్ పోస్టులు
BEL: బెల్లో 52 ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
DWCWE: కృష్ణా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
DWCWE: బాపట్ల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
DWCWE: పల్నాడు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో 31 ఉద్యోగాలు
IPR: ఐపీఆర్‌లో టెక్నికల్ ఆఫీసర్ ఖాళీలు
OHPC: ఓహెచ్పీసీలో కంపెనీ సెక్రెటరీ ఖాళీలు
HSL: వైజాగ్ హిందుస్థాన్ షిప్‌యార్డులో 99 మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులు
CRIS: క్రిస్, న్యూదిల్లీలో 18 అసిస్టెంట్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోస్టులు
NIV: ఎన్ఐవీలో 80 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు
APSCSCL: ఏపీఎస్సీఎస్సీఎల్, విజయనగరంలో అకౌంటెంట్ పోస్టులు
APCTD: తిరుపతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు
CBHFL: సీబీహెచ్ఎఫ్ఎల్లో 60 ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ ఖాళీలు
AIIMS: ఎయిమ్స్ దేవ్‌ఘర్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
APCARL: ఏపీసీఏఆర్‌ఎల్, పులివెందులలో సీఈఓ పోస్టు
APSCSCL: ఏపీ సివిల్ సప్లైస్, రాజమహేంద్రవరంలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు