గ్రామీణ ప్రాంత పేద విద్యార్థినులకు ఆర్థికంగా ఆదుకొని, చదువులో రాణించేలా చూడడానికి విప్రో సంస్థ ‘సంతూర్ ఉపకారవేతనా’లను అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ 2023 ప్రకటన వెలువడింది. ఇంటర్ పూర్తిచేసిన బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం ఉన్న బాలికలను చదువులో ప్రోత్సహించడానికి విప్రో కన్సూమర్ కేర్, విప్రో కేర్స్ కలిసి వీటిని అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాల నుంచి ఏడాదికి 1900 మందికి ఈ ప్రోత్సాహకాలు అందుతున్నాయి.
ప్రోగ్రామ్ వివరాలు...
* సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2023-24
అర్హతలు: పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే చదివుండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పేద బాలికలే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. 2022-23 విద్యాసంవత్సరంలో ఇంటర్ లేదా సమాన స్థాయి కోర్సులు పూర్తిచేసినవారై ఉండాలి. 2023-24లో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల్లో చేరి ఉండాలి. కనీసం మూడేళ్లు, ఆపై వ్యవధితో ఉన్న డిగ్రీ కోర్సుల్లో చేరినవారే ఈ స్కాలర్‌షిప్పు పొందడానికి అర్హులు.
స్కాలర్‌షిప్: ఎంపికైన విద్యార్థినులకు మూడేళ్లు లేదా కోర్సు పూర్తయినంత వరకు ప్రతినెలా రూ.రెండు వేల చొప్పున స్కాలర్‌షిప్ ఇస్తారు. డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమవుతుంది.
దరఖాస్తు: దరఖాస్తు ఫారాన్ని సంస్థ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటవుట్ తీసుకోవాలి. అందులో పూర్తి వివరాలను నింపి పోస్టు ద్వారా పంపాలి. దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: సెప్టెంబర్ 30.
చిరునామా: విప్రో కేర్స్- సంతూర్ స్కాలర్‌షిప్, దొడ్డకన్నెల్లి, సర్జాపూర్ రోడ్డు, బెంగళూరు, కర్ణాటక.
మరింత సమాచారం... మీ కోసం!
ఐఐటీ-ధన్‌బాద్‌లో 71 ప్రొఫెసర్ ఖాళీలు
నిట్-రాయ్‌పుర్‌లో 23 ఫ్యాకల్టీ పోస్టులు
ఇండియన్ నేవీ-46 అసిస్టెంట్ కమాండెంట్ ఖాళీలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
Scholarship: పేద ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం
Scholarship: పేద ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం