• facebook
  • whatsapp
  • telegram

విద్యార్థులూ అందుకోండి స్కాల‌ర్‌షిప్‌లు

ఉన్న‌త విద్య‌, ఆన్‌లైన్ కోర్సులు చేయాల‌నుకునే విద్యార్థుల‌కు వివిధ సంస్థ‌లు స్కాల‌ర్‌షిప్‌లు అందిస్తున్నాయి. కోరుకున్న‌ విద్య‌నభ్య‌సించి భ‌విష్య‌త్తులో వారు ఉన్న‌త స్థానాల‌కు ఎద‌గాల‌న్న ఆకాంక్ష‌తో విద్యార్థుల‌కు ఈ అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నాయి. అందుకు సంబంధించిన వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి వెస్‌సైట్లు మీ కోసం..

‣ టైమ్‌లో గేట్ ఆన్‌లైన్ కోర్సుకు..

ట్రిమ్‌ఫాంట్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేష‌న్‌(టైమ్‌) సంస్థ 2022లో గేట్ ప‌రీక్ష రాయ‌బోయే విద్యార్థుల కోసం స్కాల‌ర్‌షిప్పుల‌ను ప్ర‌క‌టించింది. అందుకోసం మార్చి 14న‌ ఓ టెస్టు నిర్వ‌హించ‌నుంది. గేట్-2022 ప‌రీక్ష రాయాల‌నుకుంటున్న వారు ఇందులో పాల్గొన‌వ‌చ్చు. దీన్ని ఆన్‌లైన్‌లో రెండు స్లాట్లలో నిర్వ‌హించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఎక్క‌డి నుంచైనా ఇది రాయొచ్చు. ఇందులో మ‌ల్టిపుల్ ఛాయిల్ ప్ర‌శ్న‌లిస్తారు. గంట స‌మ‌యం ఉంటుంది. క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంట‌ర్‌ప్రెటేష‌న్‌, వెర్బ‌ల్ ఎబిలిటీ, ఇంజినీరింగ్ సిల‌బ‌స్‌కు సంబంధించిన ప్ర‌శ్న‌ల‌డుగుతారు. ఈ ప‌రీక్ష‌లో ప్ర‌తిభ ఆధారంగా టైమ్‌ అందించే గేట్‌-2022 ఆన్‌లైన్ కోర్సుకు స్కాల‌ర్‌షిప్‌న‌కు ఎంపిక చేస్తారు.

వెబ్‌సైట్‌: https://www.time4education.com/local/articlecms/page.php?id=4584

‣ ప్ల‌క్షా చేయూత‌

ఆర్థికంగా వెనుక‌బ‌డి త‌మ క‌ళాశాల‌లో అండ‌ర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేయాల‌నుకునే విద్యార్థుల‌కు ప్ల‌క్షా విశ్వ‌విద్యాల‌యం భార్తీ ఫౌండేష‌న్ త‌ర‌ఫున‌ స్కాల‌ర్‌షిప్‌లు అందిస్తోంది. యువ‌త త‌మ క‌ల‌ల‌ను సాకారం చేసుకునే దిశ‌గా అడుగులు వేసేందుకు సంస్థ ఈ ప్ర‌య‌త్నం చేస్తోంది. ముఖ్యంగా ఈ స్కాల‌ర్‌షిప్పుల‌ను టెక్నాల‌జీ రంగంలో మ‌హిళ‌ల‌కు ప్రోత్సాహం క‌ల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. సుమారు 20 మంది విద్యార్థుల‌కు పూర్తిస్థాయి స్కాల‌ర్‌షిప్పులు ఇవ్వ‌నున్నట్లు ప్ర‌క‌టించింది. 

వెబ్‌సైట్‌: https://plaksha.org/bharti-scholarship

‣ విదేశీ విద్య‌కు అండ‌గా..

విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాల‌నుకునే  విద్యార్థుల‌కు కేసీ మ‌హేంద్ర ఎడ్యుకేష‌న్ ట్ర‌స్టు అండ‌గా నిలుస్తోంది. ఇందుకు ప్ర‌తిభావంతులైన గ్రాడ్యుయేట్ల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు క‌చ్చితంగా డిగ్రీ ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. అలాగే విదేశాల్లో పేరుపొందిన‌ విద్యాసంస్థ‌ల్లో ప్ర‌వేశం పొంద‌డం లేదా అందుకు ద‌ర‌ఖాస్తు చేసుకుని ఉండాలి. అక‌డ‌మిక్ ప్రోగ్రామ్ ఆగ‌స్టు 2021 నుంచి ఫిబ్ర‌వ‌రి 2022 మధ్య ప్రారంభ‌మ‌య్యేలా చూసుకోవాలి. స్కాల‌ర్‌షిప్‌ల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్ చేసి జులై 2021లో నిర్వ‌హించే ఇంట‌ర్వ్యూల‌కు పిలుస్తారు. ఎంపికైన విద్యార్థుల‌కు రూ.4 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని లోన్‌ స్కాల‌ర్‌షిప్ అందిస్తారు. అలాగే ముగ్గురిని కేసీ మ‌హేంద్ర ఫెల్లోస్ గా ప‌రిగ‌ణిస్తూ ఒక్కొక్క‌రికి రూ.8 ల‌క్ష‌ల వ‌ర‌కు స్కాల‌ర్‌షిప్ ఇస్తారు. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ 31 మార్చి 2021.

వెబ్‌సైట్‌: https://www.kcmet.org/index.aspx

Posted Date: 11-03-2021


 

తాజా కథనాలు

మరిన్ని