బ్రిటిష్ కౌన్సిల్ యూకేలో వివిధ కోర్సులు చేసే భారత విద్యార్థులకు ‘గ్రేట్ బ్రిటన్ క్యాంపెయిన్’లో భాగంగా కొన్ని రకాల స్కాలర్షిప్లను ప్రకటించింది.
ఆర్థిక సమస్యల కారణంగా ఇంజినీరింగ్ చదవలేని విద్యార్థినులకు చేయూతను అందిస్తోంది డీఆర్డీఓ (డిఫెన్స్ ఆర్ అండ్ డి ఆర్గనైజేషన్) స్కాలర్షిప్. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
నియామకాల, శిక్షణల వేదిక ఇంటర్న్శాల బాలికల కోసం వార్షిక స్కాలర్షిప్ను ప్రకటించింది. ‘ఇంటర్న్శాల కెరియర్ స్కాలర్షిప్ (ఐసీఎస్జీ) - 2022’గా వ్యవహరించే ఈ అవార్డు కింద ఏడాదికి రూ.25,000 చెల్లిస్తారు.
మనదేశంలో చదువుకు అయ్యే ఖర్చు తక్కువేం కాదు. ప్రాథమిక దశ నుంచి ఉన్నత విద్య వరకు లక్షల రూపాయలు వెచ్చించాల్సిందే. పిల్లలను చదివించే ఆర్థిక స్థోమత లేక తల్లిదండ్రులు పనులకు పంపిస్తున్నారు.
మైనారిటీ వర్గాలకు చెందిన చాలా మందికి పేదరికమే పెద్ద సమస్య. అందులోనూ ఎక్కువశాతం మైనారిటీ బాలికల చదువులకు ఆర్థిక సమస్యలే అవరోధం. దీంతో ఆసక్తి, ప్రతిభ ఉన్నప్పటికీ అర్ధాంతరంగా చదువులను ఆపేయాల్సి వస్తోంది.
దేశంలోని అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థల్లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) ముఖ్యమైంది. చమురు, సహజవాయువుల విభాగంలో ఓఎన్జీసీ అంతర్జాతీయ గుర్తింపు పొందింది.