‣ గోల్డెన్ జాబ్లీ స్కాలర్షిప్ దరఖాస్తులు
ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదువలేకపోతుంటారు చాలామంది పేద విద్యార్థులు. ఇలాంటివారికి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీం-2023 పేరుతో ఉపకారవేతనాన్ని అందిస్తోంది- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ). అర్హులైన విద్యార్థులు జనవరి 14 లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
జనరల్ స్కాలర్షిప్
2022-23 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,50,000 మించకూడదు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/ సంస్థల్లో ఏదైనా డిగ్రీ, మెడిసిన్, ఇంజినీరింగ్, ఇంటిగ్రేటెడ్, డిప్లొమా, వృత్తి విద్య లేదా తత్సమానమైన కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉపకార వేతనం అందుతుంది.
ఎంపికైతే: జనరల్ స్కాలర్షిప్నకు మెడిసిన్ విద్యార్థులకైతే ఏటా రూ.40వేలు ఇస్తారు. మూడు విడతలు (రూ.12,000/ రూ.12,000/ రూ.16,000) చొప్పున అందుతుంది. ఇంజినీరింగ్ విద్యార్థులైతే ఏడాదికి రూ.30 వేలు ఇస్తారు. మూడు విడతల్లో (రూ.9,000/ రూ.9,000/ రూ.12,000) చెల్లిస్తారు. డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, డిప్లొమా, ఒకేషనల్ కోర్సులు చేసేవారికైతే ఆ కోర్సు పూర్తయ్యేవరకు ఏటా రూ.20వేల చొప్పున ఇస్తారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో (రూ.6,000/ రూ.6,000/ రూ.8,000) బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్
పదో తరగతి తర్వాత బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ఇది ఉద్దేశించింది. 2022-23 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,50,000 మించకూడదు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/ సంస్థల్లో ఇంటర్మీడియట్, ఒకేషనల్, డిప్లొమా, ఐటీఐ కోర్సు అభ్యసిస్తున్న బాలికలకు ఉపకారవేతనం అందుతుంది.
ఎంపికైతే: స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థినులకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఇస్తారు. పదో తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్, ఒకేషనల్/ డిప్లొమా కోర్సులను పూర్తి చేసేందుకు ఈ మొత్తాన్ని మూడు విడతల్లో (రూ.4,500/ రూ.4,500/ రూ.6,000) చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కనీస అర్హతగా పేర్కొన్న టెన్త్ లేదా ఇంటర్లో పొందిన మార్కుల మెరిట్, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా అభ్యర్థులను స్కాలర్ షిష్నకు ఎంపిక చేస్తారు. తక్కువ ఆదాయ వర్గాలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14-01-2024.
వెబ్సైట్: https://licindia.in/documents/d/guest/gjf-scholarship-scheme-2023
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!
‣ వండర్ కెరియర్.. విజువల్ అనలిటిక్స్
‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.