• facebook
  • whatsapp
  • telegram

ప్రాక్టీస్‌ పరీక్షలే కీలకం

* పేరు: భార‌తి

మాది కర్నూలు. నాన్న పద్మాజిరావు, అమ్మ హేమ. ఇంటర్‌ పూర్తయ్యాక....2015-17 విద్యాసంవత్సరంలో డీఎడ్‌ కోర్సు పూర్తి చేశాను. ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ప్రస్తుతం దూరవిద్యలో తృతీయ సంవత్సరం చదువుతున్నా. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)లో పేపర్‌-1 పరీక్షలో పాల్గొని 150 మార్కులకు 141 మార్కులతో ప్రథమస్థానంలో నిలిచా!

సమయాన్ని వృథా చేయకుండా ప్రణాళికతో చదవటం ముఖ్యం. నగరంలోని ప్రతిభ అకాడమి శిక్షణ కేంద్రంలోని నిపుణుల సలహాల కారణంగా పోటీపరీక్షలో వేగంగా ఎలా సమాధానాలు రాయాలో అవగాహన చేసుకున్నా. ఉదయం, సాయంత్రం శిక్షణ పొంది ఇంటి దగ్గర పనులు చేసుకోవడం అలవాటు చేసుకున్నాను. బోధించిన అంశాలను కాసేపు పునశ్చరణ చేసునేదాన్ని. ఈవిధంగా ఆరు నెలలపాటు కష్టపడ్డా. ఆన్‌లైన్‌ పరీక్షల సాధన బాగా ఉపయోగపడింది. మూడు నెలల్లో 130కి పైగా ప్రాక్టీస్‌ పరీక్షల్లో పాల్గొన్నాను. రోజుకు కనీసం 10-11 గంటల పాటు పుస్తకాలతో గడిపితే చాలు, విజయం దానంతటదే వెతుక్కుంటూ వస్తుంది. మా కుటుంబంలో ఉన్నత చదువులు అభ్యసించినవారెవరూ లేక విద్యకు సంబంధించిన సూచనలు, సలహాలు కరువయ్యాయి. ఏవిధంగానైనా సివిల్స్‌లో రాణించి తల్లిదండ్రులకు గుర్తింపు తీసుకురావాలని చిన్నతనంలోనే భావించాను. మొదట ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి ఉండేది కాదు. ఇంటర్‌ పూర్తయ్యాక ఖాళీగా ఉండటం ఎందుకని డీఎడ్‌ కోర్సులో అడుగుపెట్టాక తెలిసింది...ఈ వృత్తి గొప్పతనం. చిన్ననాటి కలలను సాకారం చేసుకోవడానికి శ్రమిస్తాను. ఆ దిశగానే ప్రణాళికలు రూపొందించుకుని ప్రస్తుతం బోధనారంగం వైపు దృష్టి పెట్టా!

Posted Date: 01-11-2019


  • Tags :