• facebook
  • whatsapp
  • telegram

సత్తా చాటారు

వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌ పరీక్షలో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి 57,798 మంది ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేశారు. వీరిలో 55,200 మంది పరీక్ష రాయగా 39,039 మంది (70.72%) అర్హత సాధించారు. కిందటేడాది 72.55 మంది అర్హత సాధించారు. ఓపెన్‌ కేటగిరీతోపాటు ఎస్సీ, ఎస్టీ విభాగాల్లోనూ మంచి ర్యాంకులు సాధించారు. . దేశవ్యాప్తంగా తొలి 20 ర్యాంకుల్లో ఐదుగురు అమ్మాయిలు ఉంటే ఇద్దరు తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కావడం విశేషం.
నీట్‌ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఖురేషి అస్రా 16వ ర్యాంకు సాధించారు. విశాఖపట్నానికి చెందిన పి.భానుశివతేజ 40వ ర్యాంకు, కడపకు చెందిన సోదం శ్రీనందన్‌రెడ్డి 42, నెల్లూరు జిల్లావాసులైన జి.కృష్ణవంశీ 62, హర్షిత్‌ చౌదరికి 64వ ర్యాంకులు దక్కించుకున్నారు. విశాఖ నగరానికి చెందిన శ్రీ శ్రేయుకి 78వ ర్యాంకు లభించింది. జాతీయ స్థాయిలో తొలి 50 ర్యాంకుల్లో మూడు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్‌కు రాగా ఇందులో రెండు ర్యాంకులు కడప జిల్లా విద్యార్థులే కైవసం చేసుకున్నారు.

గుండె వైద్యంపై మక్కువ - శ్రీనందన్‌రెడ్డి, జాతీయస్థాయిలో 42వ ర్యాంకు

మా నాన్న రామిరెడ్డి కడప నీటిపారుదల శాఖలో డీఈఈగా, అమ్మ ప్రసూన ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వారిద్దరి ప్రోత్సాహం, సంకల్ప్‌ విద్యాసంస్థ, వైజాగ్‌ నారాయణ జూనియర్‌ కళాశాల అధ్యాపకుల కృషి వల్లనే జాతీయ స్థాయిలో 42వ ర్యాంకు సాధించగలిగా. కార్డియాలజీలో విషయ పరిజ్ఞానం పెంచుకుని మంచి వైద్యసేవలు అందించాలన్నది నా లక్ష్యం.
 
దిల్లీలో ఎంబీబీఎస్‌ చేస్తా -శ్రీ శ్రేయు, 78వ ర్యాంకు

దిల్లీలో ఎంబీబీఎస్‌ చేయాలనే లక్ష్యంతో అత్యుత్తమ ర్యాంకు కోసం ప్రయత్నించా. జాతీయ స్థాయిలో 78వ ర్యాంకు, కేటగిరీ ర్యాంకు 12 వచ్చాయి. పాథాలజీలో పీజీ చేస్తా. నాన్న కె.ఎ.రామారావు విశాఖ ఉక్కు కర్మాగారంలో ఏజీఎంగా చేస్తున్నారు. అమ్మ అరుణరామ్‌ గృహిణి. వారిద్దరి ప్రోత్సాహంతో నేను డేస్కాలర్‌గా ఉంటూనే మంచి ర్యాంకు సాధించగలిగాను. శ్రీచైతన్య కళాశాలలో నమూనా పరీక్షలు నా లోపాలు తెలుసుకుని తప్పులు దిద్దుకోవడానికి బాగా ఉపకరించాయి.

కార్డియాలజీ నిపుణుడిగా పేరు తెచ్చుకుంటా - పి.దినేష్‌ లక్ష్మీకుమార్‌నాయక్‌,

ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు

మాది నెల్లూరు. నాన్న బీసీఎస్‌ నాయక్‌ విద్యుత్తు శాఖలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌. అమ్మ అరుణ. నెల్లూరులో నారాయణ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివాను. చదువుల్లో నాన్నే నాకు స్ఫూర్తి. మంచి కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, కార్డియాలజీలో స్పెషలైజేషన్‌ చేయాలన్నది లక్ష్యం.

సైక్రియాటిస్ట్‌ను అవుతా - శ్రీవర్ష, నీట్‌ ఎస్సీ విభాగంలో 9వ ర్యాంకు

సైక్రియాటిస్ట్‌ను కావడమే నా లక్ష్యం. 100లోపు ర్యాంకు వస్తుందనుకున్నా. 10లోపు రావడం చెప్పలేనంత సంతోషంగా ఉంది. రోజుకు 14 గంటలు కష్టపడ్డాను. నాన్న నాగేశ్వరరావు పోస్ట్‌మాస్టర్‌. అమ్మ నిర్మల గృహిణి. తల్లిదండ్రులతో పాటు శ్రీచైతన్య కళాశాల అధ్యాపకులు, యాజమాన్యం ప్రోత్సహించడం, అందువల్లే మంచి ర్యాంకు వచ్చింది.

అమ్మ కల నెరవేరుస్తున్నా - సుమల్య, ఎస్టీ విభాగంలో 33వ ర్యాంకు

గైనకాలజిస్ట్‌ను కావడమే నా లక్ష్యం. 50 లోపు ర్యాంకు వస్తుందనుకున్నా. అనుకున్నట్లే 33వ ర్యాంకు వచ్చింది. మా అమ్మ శ్యామల డాక్టర్‌ అవుదామనుకున్నా పరిస్థితులు సహకరించలేదు. ప్రస్తుతం ఆమె ఉపాధ్యాయినిగా అయ్యారు. అమ్మ కల నేను నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉంది. దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరాలనుకుంటున్నా.

అధ్యాపకుల తోడ్పాటు - హర్షిత్‌ చౌదరి, 64వ ర్యాంకు, నెల్లూరు

గుండె వైద్యనిపుణులుగా నిరుపేద ప్రజలకు సేవలందించాలనేది నా కోరిక. నాన్న ప్రవీణ్‌కుమార్‌, అమ్మ సునీత ఇద్దరూ వైద్యులే. వారి మాదిరి నేను వైద్యవృత్తిలో స్థిరపడాలనుకున్నాను. నారాయణ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకులు బోధన ఎంతగానో ఉపయోగపడింది. వారి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఏ చిన్న అనుమానం వచ్చినా వారు సందేహాలను నివృత్తి చేసేవారు. వందలోపు ర్యాంకు వస్తుందని అనుకోలేదు. మంచి ర్యాంకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.

సామాజిక మాధ్యమాలు ఒత్తిడిని తగ్గించాయి - అక్షత్‌ కౌశిక్‌, మూడో ర్యాంకర్‌

రెండేళ్లుగా నీట్‌కు సన్నద్ధమవుతున్నా. ఈ సమయంలోనూ సామాజిక మాధ్యమ వేదికలైన స్నాప్‌చాట్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ చురుగ్గా ఉండేవాడిని. నెటిజన్లు ప్రస్తావించే రకరకాల అంశాలు పలువురిని పలు విధాలుగా దారి మళ్లిస్తుంటాయి. అయితే, సామాజిక వేదికలు నా చదువుల ఒత్తిడిని తగ్గించేవి. నా లక్ష్యానికి అవరోధం కలిగించేవి కాదు. ఎయిమ్స్‌లో వైద్య విద్యను అభ్యసించాలన్నది నా ఆకాంక్ష. ఒకవేళ ఆ సంస్థలో ప్రవేశం లభించకుంటే దిల్లీలోని మౌలానా ఆజాద్‌ వైద్యకళాశాలలో చేరుతా.

నిరుపేదలకు వైద్యసేవలందిస్తా - 16వ ర్యాంకు, ప్రొద్దుటూరు

మా స్వగ్రామం ప్రొద్దుటూరు. అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే నాకు మంచి ర్యాంకు దక్కింది. నాన్న జాకీర్‌ ఖురేషి వ్యాపారం చేస్తుంటారు. అమ్మ రుక్సానా గృహిణి. ఆలిండియాలో 16వ ర్యాంకు సాధించినందుకు ఆనందంగా ఉంది. ఇంత మంచి ర్యాంకు వస్తుందని అనుకోలేదు. 100 నుంచి 200లోపు వస్తుందని ఆశించాను. నిరుపేదలకు వైద్యం అందించేందుకు కృషి చేస్తా. -ఆశ్ర ఖురేషి,

నాన్నే నాకు స్ఫూర్తి -జి.కృష్ణవంశీ, 62వ ర్యాంకు, నెల్లూరు

మా నాన్న నారాయణ వైద్యుడు. ఆయనే నాకు స్ఫూర్తి. రోగులకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడే శక్తి ఒక్క వైద్యుడికే ఉంటుంది. నాన్నలా వైద్యుడిని కావాలనే కోరిక ఉండేది. అందుకు ఆయన పూర్తి సహకారం అందించారు. అమ్మ భారతి న్యాయవాది. నాకు ఎంతో తోడ్పాటునందిస్తోంది. అందుకే డాక్టర్‌ అవ్వాలనుకున్నా.. అందుకు అనుగుణంగా చదువుతూ వస్తున్నా. రోజుకు పది గంటలకుపైగా చదివాను.

Posted Date: 02-11-2019

ప్రవేశ పరీక్షలు