Post your question

    Asked By: Hayathi

    Ans:

    ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏడో తరగతి వరకు నాలుగేళ్లు వరుసగా ఏ ప్రాంతంలో చదివితే ఆ స్థానికత పొందుతారు. మీరు ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు హైదరాబాద్‌లో చదివారు కాబట్టి తెలంగాణ స్థానికత కిందకు వస్తారు.

    Asked By: ఎం. ఖ్యాతి

    Ans:

    చార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ) పూర్తి చేసినవారికి  ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో  మెరుగైన ఉద్యోగావకాశాలున్నాయి. నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, గ్యాస్‌ అథారిటీ అఫ్‌ ఇండియా లిమిటెడ్‌ లాంటి ప్రభుత్వ సంస్థలతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో కూడా సీఏగా అవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు రంగంలో ఫైనాన్స్‌ మేనేజర్, అకౌంట్స్, ఆడిట్‌ మేనేజర్‌ లాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి. సీఏ పూర్తి చేసినవారు బ్యాంకింగ్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల్లో ఎంబీఏ చదివిన నిపుణులతో పోటీ పడుతున్నారు. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలుగా, క్రెడిట్‌ అనలిస్టులుగా, ఆడిట్‌ బాధ్యులుగా ప్రభుత్వ రంగ సంస్థలు సీఏలను తీసుకుంటాయి. వీరు సొంతంగానూ ప్రాక్టీస్‌ నిర్వహించుకొనే అవకాశం ఉంది.

    Asked By: Abdul

    Ans:

    ఫ్యామిలీ ఇన్‌కమ్‌ (కుటుంబ ఆదాయం) సాలీన రూ.8 లక్షలకు మించితే వారు క్రీమీలేయర్‌ పరిధిలోకి వస్తారు. మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీకు నాన్‌-క్రీమీలేయర్‌ వర్తించదు.

    Asked By: Deshetty

    Ans:

    అటవీ శాఖలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించాలంటే తప్పనిసరిగా ఏదైనా సైన్స్‌ గ్రూప్‌తో డిగ్రీ లేదా బీటెక్‌ పూర్తయినవారు అర్హులు. మీది సైన్స్‌ గ్రూప్‌ కిందకు రాదు. కాబట్టి మీరు అనర్హులు.

    Asked By: Krishna

    Ans:

    గ్రూప్‌-1 వచ్చే వరకు వేచి చూడకుండా ఎంత త్వరగా ప్రిపరేషన్‌ మొదలు పెడితే అంత మంచిది. ప్రిలిమినరీ పరీక్షకు మౌలికాంశాలను క్షుణ్ణంగా చదివి బిట్లు ప్రాక్టీస్‌ చేస్తే సరిపోతుంది. మెయిన్స్‌ను డిస్క్రిప్టివ్‌ ప్రధానంగా నిర్వహిస్తారు. దీనికి సబ్జెక్టులను విశ్లేషణాత్మకంగా చదవాల్సి ఉంటుంది. రాసే నైపుణ్యం, భాషపై పట్టు అవసరం. ప్రిపరేషన్‌కు తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవాలి. అలాగే ప్రతిరోజూ దినపత్రికను చదివి నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి.

    Asked By: ramesh

    Ans:

    మీరు అకడమిక్‌ ఇయర్స్‌ కాలమ్‌ నింపేటప్పుడు నాలుగో తరగతిలో డ్యాష్‌(-) పెట్టి వదిలేయండి. ఉదాహరణకు మీరు మూడో తరగతి 2012-13లో చదివి ఉంటే నాలుగో తరగతి డ్యాష్‌ పెట్టి అయిదో తరగతి కాలమ్‌లో 2013-14 అని నింపితే సరిపోతుంది. మీరు నేరుగా మూడో తరగతి నుంచి అయిదో తరగతిలోకి వెళ్లారని వారికి అర్థమైపోతుంది.  .