Post your question

 

    Asked By: ఎస్‌. హర్ష

    Ans:

    విద్యుత్‌ శాఖలో ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కి సన్నద్ధం కావడం కొంత కష్టమే! కానీ, సివిల్స్‌పై మీకున్న ఇష్టం ఈ కష్టాన్ని అధిగమించి లక్ష్యాన్ని అందుకొనేలా చేయవచ్చు. ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కి సిద్ధం అవ్వాలంటే కనీసం మూడు సంవత్సరాలపాటు ప్రణాళికాబద్ధంగా చదవాలి. మీరు వేరే ఊళ్లలో ఉంటే.. ముందుగా హైదరాబాద్‌కి బదిలీపై కానీ, డెప్యుటేషన్‌పై కానీ రండి. మీ ఆఫీస్‌ పని సమయం రోజుకి 7 గంటలుంటే రోజుకు 5 గంటల చొప్పున ప్రిపరేషన్‌కి కేటాయించండి. రెండు సంవత్సరాల పాటు సెలవు దొరికే అవకాశం ఉంటే రోజుకు కనీసం 12 గంటల సమయాన్ని సన్నద్ధతకు కేటాయించి మీ ఆశయాన్ని నెరవేర్చుకోవచ్చు.
    ముందుగా యూపీఎస్‌సీ ప్రకటన పూర్తిగా చదివి మీ వయసు, సామాజిక నేపథ్యాలనుబట్టి ఎన్ని అవకాశాలున్నాయో తెలుసుకోండి. అందుకు తగ్గట్లుగా ప్రణాళికల్ని సిద్దం చేసుకోండి. ప్రిలిమ్స్‌ కోసం అవసరమైన మెటీరియల్‌ని సమకూర్చుకోండి. గతంలో సివిల్స్‌ సాధించినవారినీ, ప్రస్తుతం సివిల్స్‌ రాస్తున్నవారినీ సంప్రదించి వారి అనుభవాలు తెలుసుకోండి. యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న సివిల్స్‌ విజేతల విజయగాథలను చూసి, వారి ప్రిపరేషన్‌ పద్ధతుల గురించి అవగాహన పెంచుకోండి. ఆప్షనల్‌ని ఎంచుకొన్నాక అందుకు సంబంధించిన సిలబస్, పాత ప్రశ్నపత్రాల్ని జాగ్రత్తగా పరిశీలించండి. ప్రామాణిక పుస్తకాలను సేకరించండి. మంచి కోచింగ్‌ సెంటర్‌లో కనీసం ఏడాది శిక్షణ తీసుకొనే ప్రయత్నం చేయండి. అలా కుదరని పక్షంలో ఏదైనా ప్రముఖ శిక్షణ సంస్థ నుంచి ఆన్‌లైన్‌ కోచింగ్‌ తీసుకోండి. వార్తాపత్రికలు, జనరల్‌ స్టడీస్, ఆప్టిట్యూడ్‌లకు సంబంధించిన పుస్తకాలను నిరంతరం చదువుతూ, నోట్సు తయారు చేసుకోండి. ఈ సన్నద్ధత, మెయిన్స్‌ పరీక్షలో వ్యాసాలు రాయడానికి బాగా ఉపకరిస్తుంది. ముందే చెప్పినట్లు- కనీసం రెండు, మూడు సంవత్సరాల పాటు గట్టి పట్టుదలతో కృషి చేస్తే, ఐఏఎస్‌ అవ్వాలనే మీ కలను నిజం చేసుకోవడం సాధ్యం అవుతుంది.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: Sirisinahal

    Ans:

    ఇండియన్‌ సొసైటీ అంటే ఇందులో భారత సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రభుత్వ విధానాలు, పథకాల గురించి తెలుసుకోవాలి. వీటికి¨ ప్రత్యేకంగా పుస్తకాలు ఉండవు. భారత సమాజానికి సంబంధించిన తెలుగు అకాడమీ (తెలుగు/ఇంగ్లిష్‌ మీడియం) పుస్తకాలను సిలబస్‌ ప్రకారం రిఫర్‌ చేయవచ్చు.  ఆధునిక భారతదేశ విధానాలు, పథకాల గురించి ఇండియా ఇయర్‌ బుక్‌ - 2022ను చదవండి. ప్రిపరేషన్‌కి స్టాండర్డ్‌ పుస్తకాలను మాత్రమే ఎంపిక చేసుకోండి.

    Asked By: Raju

    Ans:

    ప్రస్తుతానికి ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులతో సమానంగా ఈడబ్ల్యూఎస్‌ వర్గం వారికి ఎలాంటి గరిష్ఠ వయసు పరిమితి సడలింపు లేదు.

    Asked By: Parmeshwar

    Ans:

    నేటివ్‌ విలేజ్‌ అంటే శాశ్వత నివాస గ్రామం. మీరు చాలా కాలంగా ఎక్కడ అయితే నివసిస్తున్నారో ఆ ప్రాంతాన్ని స్థానిక గ్రామంగా పేర్కొనాలి.

    Asked By: రాకేష్‌

    Ans:

    ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు చదివిన ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఉంటే, ఆ ప్రాంతానికి చెందిన తహశీల్దార్‌ సంతకం చేసిన నివాస ధ్రువీకరణ పత్రం (రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌)ను సమర్పించగలిగితే మీరు తెలంగాణ లోకల్‌ అవుతారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌లో చదివి ఉంటే తెలంగాణ స్థానికత వర్తించదు.

    Asked By: SHAIK

    Ans:

    ఓటీఆర్‌లోని ఎడిట్‌ ఆఫ్షన్‌కి వెళ్లి మీరు ఎన్నిసార్లయినా అవసరమైన సవరణలు చేసుకోవచ్చు. మళ్లీ తప్పులు రాకుండా చూసుకుంటే సమయం వృథా కాదు

    Asked By: Srinivas

    Ans:

    మీరు హైదరాబాద్‌ జిల్లా కిందకు వస్తారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కడ నాలుగు సంత్సరాలు చదివితే అదే లోకల్‌ అవుతుంది. 

    Asked By: గోపాల్‌

    Ans:

    కచ్చితంగా ఉంటుంది. గ్రూప్స్‌కి సంబంధించిన అన్ని పరీక్షలూ రాసుకోవచ్చు. కానీ ప్రభుత్వ నోటిఫికేషన్లు వెలువడే నాటికి మీ డిగ్రీ పూర్తయ్యి చేతిలో సర్టిఫికెట్‌ ఉండాలి. 

    Asked By: ప్రవీణ్‌

    Ans:

    మీరు ఆంధ్రప్రదేశ్‌కి లోకల్‌ అవుతారు. తాజాగా అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం మీకు తెలంగాణ స్థానికత వర్తించదు.