• facebook
  • whatsapp
  • telegram

ఆస్ట్రేలియా విద్యకు ఆసరా

మంచి ప్రతిభ ఉండి, ఆర్థిక వనరులు లేని విద్యార్థులకు సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ వేల్స్‌ (యూఎన్‌ఎస్‌డబ్ల్యూ) స్కాలర్‌షిప్‌ అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రత్యేకంగా భారతీయ విద్యార్థులకే అవకాశాన్ని కల్పిస్తున్న ఈ స్కాలర్‌షిప్‌ వివరాలు...
అకడమిక్‌ పరంగా, బోధన, పరిశోధన, ఉద్యోగ సదుపాయాలు మొదలైన అంశాలపరంగా యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ వేల్స్‌ పేరుగాంచింది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం, భవిష్యత్తు డిమాండ్లను ముందుగానే అర్థం చేసుకోగల భారతీయ విద్యార్థులకు యూఎన్‌ఎస్‌డబ్ల్యూ ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ చేంజ్‌ ఇండియా స్కాలర్‌షిప్స్‌’ పేరుతో ఉపకార వేతనాలను అందిస్తోంది. ఆస్ట్రేలియాలో చదవాలనుకునేవారు ఈ విశ్వవిద్యాలయాన్ని పరిశీలించి, దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక ట్యూషన్‌ ఫీజు స్కాలర్‌షిప్‌, 10,000 డాలర్ల వరకు స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. అయితే విద్యార్థులు యూఎన్‌ఎస్‌డబ్ల్యూకు దరఖాస్తు చేసుకుని ఉండాలి. అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాములకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ ఉపకార వేతనాలు అందుబాటులో ఉంటాయి.

* అర్హతలు:  భారతీయుడై, ఇక్కడే నివసిస్తూ ఉండాలి. ఆస్ట్రేలియా శాశ్వత నివాసం పొందినవారు అనర్హులు. యూఎన్‌ఎస్‌డబ్ల్యూ నుంచి డిగ్రీ లేదా పీజీ ప్రోగ్రామ్‌లకు ప్రవేశం పొంది ఉండాలి.
* డిగ్రీ ప్రవేశాలకు.. ఆల్‌ ఇండియా సీనియర్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ అకడమిక్‌ ప్రవేశానికి అవసరమైనదానికంటే ఒక పాయింట్‌ (లేదా) ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ (ఐఎస్‌సీ) అయితే 2 పాయింట్లు (లేదా) జీసీఈ ఎ లెవెల్‌ అయితే ఒక పాయింటు ఎక్కువగా ఉండాలి.
* పీజీ ప్రవేశాలకు.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి యూఎన్‌ఎస్‌డబ్ల్యూ జీపీఏ 70తో సమానమైన గ్రేడ్‌ను పొంది ఉండాలి.
దరఖాస్తుతోపాటు విద్యార్థి తన ఆశయాలను చేరుకోవడానికి ఈ స్కాలర్‌షిప్‌ ఏవిధంగా సాయపడుతుందో వివరిస్తూ వీడియోను జతచేయాల్సి ఉంటుంది.

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, విద్యార్థి పంపిన డిజిటల్‌ వీడియో ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి ఇంటర్వ్యూ నిర్వహించి దానిలోనూ అర్హత సాధించినవారికి స్కాలర్‌షిప్‌ అవకాశం కల్పిస్తారు.
దరఖాస్తు చేసుకోవడానికి: ప్రవేశానికి ఇదివరకే దరఖాస్తు చేసుకున్నవారూ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇతర వివరాలకు: https://www.international.unsw.edu.au/ను సందర్శించవచ్చు.

Posted Date : 21-08-2020


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం