• facebook
  • whatsapp
  • telegram

ఏ దేశమేగినా..!

ఆర్థిక భారం తగ్గించే ఉపకార వేతనాలు

కుదిరితే యూఎస్‌ లేదంటే యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, చైనా... ఏ దేశమైనా ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో అత్యున్నత ప్రమాణాలు... ఆకర్షణీయమైన ఉద్యోగావకాశాలు! విదేశీ విద్య అందిస్తోన్న మేటి ఫలాలివి. అయితే ట్యూషన్‌ ఫీజు, నివాస, దైనందిన అవసరాలకు ఎంతో వ్యయం. అసలు విదేశాల్లో చదువు అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ప్రతిభ, ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక స్థితి సహకరించక చాలామంది వెనుకడుగేస్తున్నారు. ఇలాంటివారు తమ కల నెరవేర్చుకోవటానికి వివిధ ఉపకార వేతనాలు అండగా నిలుస్తున్నాయి!
విదేశాల్లో లభించే ఉపకార వేతనాల కోసం అంతర్జాతీయ విద్యార్థుల మధ్య చాలా పోటీ ఉంటుంది. అలా అని సందేహాలతో వెనకడుగు వేసేకంటే ప్రయత్నలోపం లేకుండా దరఖాస్తు చేసుకోవటం మంచిది. స్కాలర్‌షిప్పు లభిస్తే విద్యాభ్యాస కాలంలో ఆర్థికంగా ఎంతో వెసులుబాటు ఉంటుందని మర్చిపోకూడదు. ఈ సందర్భంగా విద్యార్థులు కొన్ని ముఖ్యాంశాలు గమనించాలి.
* చివరి తేదీ సమీపించేదాకా తాత్సారం చేయకూడదు. వీలైనంత ముందుగానే దరఖాస్తు చేయటం అన్ని విధాలా మంచిది.
* నిబంధనలు శ్రద్ధగా చదివి, వాటికి అనుగుణంగా అవసరమైన పత్రాలతో, కచ్చితమైన వివరాలతో దరఖాస్తు చేయాలి.
* ఉపకార వేతనాలు అందించే సంస్థలూ, యూనివర్సిటీలకు ఫేస్‌బుక్‌ పేజ్‌ ఉంటే దాన్ని అనుసరించటం మేలు. నియమ నిబంధనల్లో మార్పులు చేస్తే అవి వెబ్‌సైట్లలో వెంటనే కనిపించకపోవచ్చు. కానీ ఫేస్‌బుక్‌ ద్వారా తాజా అంశాలు వెనువెంటనే తెలిసే అవకాశం ఉంటుంది.

Posted Date : 21-08-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

తాజా కథనాలు

మరిన్ని
 
లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

విద్యా ఉద్యోగ సమాచారం