• facebook
  • whatsapp
  • telegram

పిల్ల‌ల విదేశీ విద్యా ఖ‌ర్చుల‌కు త‌ల్లిదండ్రులు ఎలా సిద్ధం కావాలి?

విద్యా రుణం తీసుకోవ‌డం చాలా ప్ర‌యోజ‌క‌రం

త‌ల్లిదండ్రులు త‌మ కెరీర్ క‌న్నా కూడా త‌మ పిల్ల‌ల చ‌దువుకు అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నారు. త‌మ పిల్ల‌ల‌కు అత్యుత్త‌మ నాణ్య‌మైన విద్య‌ను అందించాల‌నేది ప్ర‌తి త‌ల్లిదండ్రుల కోరిక‌. స్వ‌దేశంలోనే కాకుండా విదేశాల‌లో కూడా త‌మ పిల్ల‌ల‌ను చ‌దివించ‌డానికి వెనుకాడ‌టం లేదు. అందులోను విదేశాల‌లో అత్యుత్త‌మ కాలేజీల్లో చ‌దివించి త‌మ పిల్ల‌ల‌ను ఉన్న‌త ప్ర‌యోజ‌కుల‌ను చేయాల‌ని త‌ల్లిదండ్రులు ఆశిస్తుంటారు. ఈ విదేశీ విద్య‌కు భారీగానే ఖ‌ర్చ‌వుతుంది. ప్ర‌తి ఏటా విద్యా ద్ర‌వ్యోల్బ‌ణం 10% క‌న్నా ఎక్కువ పెరుగుతుంది. 

అయితే, పొదుపు చేసిన సొమ్మును ఒకేసారి ఖ‌ర్చు చేయ‌డం కంటే కూడా విద్యా రుణం తీసుకోవ‌డం చాలా ప్ర‌యోజ‌క‌రంగా ఉంటుంది. అంత‌ర్జాతీయంగా ఫీజులు, ఇత‌ర ఖ‌ర్చులు పెరుగుతున్న నేప‌థ్యంలో, త‌ల్లిదండ్రుల జీవిత‌కాల పొదుపులు కూడా పిల్ల‌ల విదేశీ విద్య ఖ‌ర్చుల‌కు స‌రిపోవు. అందువ‌ల్ల త‌ల్లిదండ్రులు త‌మ బిడ్డ చిన్న వ‌య‌స్సులో ఉన్న‌పుడు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌ను ప్రారంభించ‌డం చాలా ముఖ్య‌మ‌ని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

దీనికి అయ్యే ఖ‌ర్చుకు మామూలు సాంప్ర‌దాయ‌క పొదుపు ప‌థ‌కాల‌లో పొదుపు చేస్తే విదేశీ విద్య‌కు స‌రిప‌డా మొత్తాలు చేకూరడం చాలా క‌ష్ట‌మైన ప‌నే. అందుచేత వారి ద‌గ్గ‌ర ఉన్న పెట్టుబ‌డుల‌ను వివిధ స్టాక్‌లు, మ్యూచువ‌ల్ ఫండ్‌లు, బాండ్‌లు, విభిన్న‌మైన పోర్ట్‌ఫోలియోల‌లో పెట్టుబ‌డి పెడితే గ‌రిష్ట ఆర్ధిక ప్ర‌యోజ‌నాలుంటాయి. క్ర‌మం త‌ప్ప‌కుండా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పొదుపు చేయ‌డం వ‌ల్ల ఫండ్ వృద్ధి చెంది, భ‌విష్య‌త్తులో ఆర్ధిక భారాన్ని త‌గ్గించుకోవ‌చ్చ‌ని గ‌మ‌నించండి.

ఇంకొక ముఖ్య‌మైన విష‌యం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ పిల్ల‌ల చ‌దువు కోసం ఆదా చేసేందుకు మీ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌పుడు, వీరిని అంత‌ర్జాతీయ పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధం చేయ‌డం చాలా ముఖ్యం. ఆ పరీక్షలలో మంచి ఉత్తీర్ణ‌త‌, గ్రూప్ డిస్‌క‌ష‌న్స్‌, ఆన్‌లైన్‌ ఇంట‌ర్య్యూల‌తో స‌హా వివిధ అర్హ‌త రౌండ్ల ద్వారా విద్యార్ధుల‌కు అనేక స్కాల‌ర్‌షిప్‌లు అందించ‌బ‌డ‌తాయి. వారి అక‌డ‌మిక్ ప‌నితీరు, పాఠ్యేత‌ర కార్య‌క‌లాపాల‌లో కూడా చురుకుగా ఉన్నార‌ని కూడా వారు ప‌రిగ‌ణిస్తారు. ఇటువంటి అంత‌ర్జాతీయ ఎడ్యుకేష‌న్ స్కాల‌ర్‌షిప్‌లు విద్యార్ధి ఆర్ధిక మ‌నుగ‌డ‌కు, విదేశీ విద్య‌కు ఉత్పేర‌కంలాగా ప‌నిచేస్తాయి. ఈ ప‌రీక్ష‌ల‌ను చేధించ‌డానికి విద్యార్ధికి తెలివితేట‌లు ఎంతో అవ‌స‌రం. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన స‌మ‌స్త స‌మాచారం ఇంట‌ర్నెట్‌లో ల‌భిస్తుంది.

అయితే, మ‌న పొదుపుతోనే విదేశీ విద్యా ఖ‌ర్చులు స‌రిపోక‌పోవ‌చ్చు. విద్యా రుణాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డానికి వెనుకాడ‌కూడ‌దు. మొత్తం పొదుపును ఒకేసారి ఖ‌ర్చు చేయ‌డం కంటే బ్యాంకుల నుండి విద్యా రుణం తీసుకోవ‌డం ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. రూ. 7.50 ల‌క్ష‌ల నుండి రూ. 1.50 కోట్ల వ‌ర‌కు విద్యా రుణాన్ని విద్యార్ధులు బ్యాంకుల ద్వారా పొంద‌వ‌చ్చు.

మ‌హిళా విద్యార్ధి ధ‌ర‌ఖాస్తుదారుల‌కు 0.50% వ‌డ్డీలో రాయితీ కూడా ల‌భిస్తుంది. విద్యా రుణాలు మంచి ప్ర‌త్యామ్నాయాలు, విద్యారుణం పొంద‌డం వ‌ల‌న ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం, 1961లోని సెక్ష‌న్ 80(ఈ) కింద మీరు ప‌న్ను మిన‌హాయింపుకు అర్హులు అవుతారు. ఈ రోజుల్లో విద్యా రుణాలు పోటీ వ‌డ్డీ రేట్ల‌కు సుల‌భంగానే అందించ‌బ‌డుతున్నాయి. సాధార‌ణంగా మీ కోర్సును పూర్తి చేసి, ప‌ని చేయ‌డం ప్రారంభించిన త‌ర్వాత రుణ చెల్లింపు ప్రారంభ‌మ‌వుతుంది. ఉద్యోగంలో చేరినా రుణాన్ని తిరిగి చెల్లించ‌డానికి 6 నెల‌లు, ఒక ఏడాది మార‌టోరియం (గ‌డువు) కూడా పొందొచ్చు.
 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-02-2022


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం