• facebook
  • whatsapp
  • telegram

It has started raining.. 

 'There' మామూలు అర్థం - అక్కడ.

'It' మామూలు అర్థం - అది / ఇది.

అయితే There / it ను వాటి మామూలు అర్ధాలతో కాకుండా, sentence ప్రారంభించేందుకు మాత్రమే కొన్ని సందర్భాల్లో వాడతాం. ఇది  తెలుసుకోవడంతోపాటు చివరలో ఇచ్చిన అభ్యాసాన్ని సాధన  చేయడం ద్వారా ఏ మేరకు అర్థం చేసుకున్నారో పరీక్షించుకోండి.

Satish: There is a nice restaurant near the temple. The meals and snacks are really delicious. (ఆ గుడిదగ్గర ఒక మంచి 'రెస్ట్రాంట్' ఉంది. అక్కడ భోజనం, ఫలహారాలు నిజంగా రుచిగా ఉంటాయి).

Pramod: It is funny to hear you talk of a restaurant. Since when have you started eating out? (నువ్వు ఫలహారశాలను గురించి మాట్లాడటం తమాషాగా ఉంది. బయట తినడం ఎప్పటి నుంచి ప్రారంభించావేంటి?)

Satish: Funny or not, I find the food good there. Oh, It's (it has) started raining. Let's find some cover. (తమాషానో కాదో కానీ, అక్కడ ఆహారం మాత్రం బాగుంటుంది. ఓ, వర్షం మొదలైంది. ఎక్కడైనా తడవకుండా ఉండొచ్చేమో చూద్దాం.)

Pramod: There is a tea stall next to the tree. Let's stand there for some time. (చూడూ, ఆ చెట్టుపక్కన tea stall ఉంది. అక్కడికెళ్లి నిలబడదాం).

Satish: There are already a number of people there. I'm (I am) afraid it is difficult to find room there. (ఇప్పటికే చాలామంది జనం ఉన్నారక్కడ. అక్కడ మనకు చోటు దొరుకుతుందా అని సందేహం).

Pramod: The rain is getting heavy. Let's hurry. There is no time to waste. (వర్షం ఎక్కువవుతోంది. పదపద, సమయంలేదు).

Now look at the following expressions:

1) There is a nice restaurant near the temple.

2) It is funny to hear you talk about a restaurant.

3) It has started raining.

4) There is a tea stall next to the tree there.

5) There are already a number of people there.

6) It is difficult to find room there.

7) There is no time to waste.

 పై sentences అన్నీ, 'There' / 'It ' తో కానీ ప్రారంభమవడం గమనించారు కదా? ఇదే There, it కు ఉన్న గమ్మత్తయిన ఉపయోగం English లో.

 ''There' మామూలు అర్థం - అక్కడ.

  'It' మామూలు అర్ధం - అది/ ఇది.

  అయితే పై sentences అన్నింటిలో There/ it ను వాటి మామూలు అర్థాలతో కాకుండా, sentence ప్రారంభించేందుకు మాత్రమే వాడతాం. ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

   చూడండి... 'రెండు పుస్తకాలు ఆ table మీద ఉన్నాయి' అనేందుకు, English లో అనాల్సిన తీరు: Two books are on the table. అయితే, grammatical గా ఇందులో దోషం లేనప్పటికీ, English లో చాలా అరుదుగా వింటాం. దీనికి బదులు, మామూలుగా ఇలా అంటాం.

       There are two books on the table. గమనించే ఉంటారు. ఈ sentence లో 'There' కు ఉండే మామూలు అర్థం ఇక్కడ రాదు. ఇంకా ఇలా కూడా అంటారు.

       There are thirty students there. చివరి 'there' కు మాత్రమే అర్థం ఉంది. మొదటి 'there' ను వాక్యం ప్రారంభించేందుకు మాత్రమే వాడతాం. This is an important aspect of English usage.

        హైదరాబాద్‌లో 30 Engineering Colleges ఉన్నాయి.Thirty Engineering Colleges are in Hyderabad - Very rare.

      The usual and correct form: There are Thirty Engineering colleges in Hyderabad. (there కు మామూలు అర్థం 'అక్కడ అని వాడామనుకుంటే, ఈ sentence కు అర్థం:

     'అక్కడ హైదరాబాద్‌లో 30 కళాశాలలున్నాయి' అనే విపరీతార్థం వస్తుంది. అంటే ఇక్కడ 'there' ను sentence ప్రారంభించేందుకే వాడుతున్నామన్నమాట.
'
There' ను ఇలా వాడితే, అప్పుడు దాన్ని 'Introductory there' అంటాం. అంటే ఏ అర్థం లేకుండా, వాక్యాన్ని ప్రారంభించేందుకు మాత్రమే దాన్ని వాడతాం.

Look at the following too:

a) Prasad: Are there good schools in the town?

(ఇక్కడ మంచి schools ఉన్నాయా?)

Subba Rao: Plenty (చాలానే ఉన్నాయి).

Question లో కూడా 'there' వాడకం గమనించండి. ఇది sentence ను అనేందుకు మాత్రమే వాడతాం.

ఇంకా interesting - ఇది చూడండి.

b) Suman: Are there any good theatres here? (ఇక్కడ మంచి theatres ఉన్నాయా?)

Lasya: Very few (చాలా తక్కువ).

   'there', 'here' (అక్కడ, ఇక్కడ) ఒకేచోట రావడం గమనించండి. ఇదికూడా

Correct: There aren't any good theatres here.(ఇక్కడ మంచి theatres ఏం లేవు).

   పై sentence లో 'there', 'here' ఒకే sentence లో రావడం గమనించారు కదా?

Note: 1) Restaurant = ఫలహారం, భోజనం దొరికే చోటు.

Restaurant కు Hotel కూ తేడా ఉంది. Hotel అంటే, Lodge (బస చేసే సదుపాయం)తో ఉండే భోజన ఫలహారశాల.

Restaurant : భోజన ఫలహారశాల మాత్రమే, Lodge లేకుండా.

ఈ మధ్య restaurant ను 'eatery' అని కూడా అంటున్నారు.

2. Delicious = tasting very good = రుచికరమైన.

3. Funny = తమాషాగా ఉన్న; fun = తమాషా.

4. Cover = ఎండ, వాన నుంచి తలదాచుకునే చోటు; ప్రమాదం నుంచి కూడా.

Exercise

 కింది sentences లో 'there' వాడండి.

1. ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలున్నాయి.

2. ఎందుకంతమంది పోలీసులున్నారిక్కడ?

3. ఇక్కడ ఇరవై మంది విద్యార్థులున్నారు.

4. ఆ ప్రశ్నపత్రంలో 15 ప్రశ్నలున్నాయి.

5. ఆ గ్రంథాలయంలో ఆసక్తికరమైన పుస్తకాలున్నాయా?

ప్రతి sentence లో'there' వచ్చేలా ప్రయత్నించండి.

Answers to the Exercises

1. There are twenty three districts in Andhra Pradesh.

2. Why are there so many police persons here?

3. There are twenty students here.

4. There are fifteen questions in the question paper.

5. Are there interesting books in the library?

It is believed

that he knows a lot 

Ramakrishna: It is generally believed that he is responsible for all the trouble in the company. (కంపెనీలో ఈ సమస్యలన్నింటికీ అతడు కారణమని చాలామంది చేత నమ్మబడుతోంది - మామూలు తెలుగు.. అందరూ నమ్ముతున్నారు)

Gopal: It is hoped that he will soon leave the company and all will be well. (అతడు కంపెనీ వదిలి వెళ్లిపోతున్నాడని, ఆ తర్వాత అన్నీ సవ్యంగా ఉంటాయని, అందరూ ఆశిస్తున్నారు).

Ramakrishna: It is supposed that once he leaves the company, Virat will take control. (అతడు వెళ్లిపోయిన తర్వాత విరాట్ కంపెనీ పగ్గాలు చేపడతాడని అనుకుంటున్నారు).

Gopal: The company will be back on rails. (కంపెనీ మామూలు పరిస్థితికి వస్తుంది).

Look at the following expressions:

1) It is generally believed that he is responsible for all the trouble.

2) It is hoped that he will soon leave the company.

3) It is supposed that once he leaves, Virat will take control.

   You see that the sentences above begin with ‘it' - the introductory ‘it'. The verbs are all in the passive voice.

(‘be' + Past Participle).

¤ It is believed (is + Past Participle of ‘believe'); It is hoped (is + pp) and It is supposed (is + pp) - అంటే ఇవన్నీ Passive voice లో ఉన్నాయన్నమాట.

 It is believed = నమ్ముతున్నారు (ఇక్కడ ‘it' ముకు అర్థం ఉండదు, తెలుసుకదా అది Introductory it).

  ఇప్పుడు ‘it' is believed that he knows a lot - దీని అర్థం అతడికి చాలా తెలుసు అని నమ్మబడుతోంది అంటే, మామూలు తెలుగులో, చాలా మంది నమ్ముతున్నారు అతడికి చాలా తెలుసని. 

¤ అలాగే ‘it is hoped' = ఆశించబడుతోంది = అందరూ ఆశిస్తున్నారు.

¤ It is supposed : అనుకోబడుతోంది = అందరూ అనుకుంటున్నారు.
  ఇలాంటి
expressions English లో సర్వసాధారణం. ముఖ్యంగా ఎవరు అనుకుంటున్నారో, నమ్ముతున్నారో చెప్పడం సాధ్యం కానప్పుడు, ఇలా ‘It + passive voice verb's తో ప్రారంభిస్తాం.

It is said that he is the greatest cricketer = People say that he is the greatest cricketer. (Is said - Passive - చెప్పబడ్తున్నాడు = అందరూ చెబుతున్నారు/ అంటున్నారు).

a) Sagar: It is expected that all staff should be at office by 10. (సిబ్బంది అందరూ ఇక్కడ 10కి ఉండాలని ఆశించబడుతోంది). (అధికారులు ఆశిస్తారు సిబ్బంది ఇక్కడ 10కి ఉండాలని).

b) Kumar: We have been told we can be an hour late once a week. (మేం చెప్పబడ్డాం = మాకు చెప్పారు, వారానికోసారి గంట ఆలస్యం అవచ్చని).

It was believed that she was the greatest dancer of her time (ఆమె గొప్ప నర్తకి అని నమ్మబడేది = అందరు నమ్మేవారు/ అనుకున్నారు ఆమె గొప్ప నర్తకి) = People believed that she was a great dancer.

Exercise

 కిందివాటిని, It + Passive voice లో రాయండి.

1. ఆమెను గొప్పగాయనిగా అందరూ చెప్పుకొనేవాళ్లు.

2. రాముడిని అన్ని కాలాల్లోని రాజుల్లో అతిగొప్ప రాజుగా పరిగణిస్తారు. (పరిగణించడం = consider).

3. ఇంతవరకూ అనుకున్నారు ఆమె అది కనుక్కున్నదని.

4. మూడు తరాల వాళ్లు అంటారు, సచిన్ అంత గొప్ప batsman లేడని.

5. అతడే ఈ హత్య చేశాడని కనుక్కున్నారు.

6. అందరూ నమ్మారు Columbus, India ను కనుక్కున్నాడని, కానీ అతను కనుక్కున్నది, ఇప్పటి West Indies (The American Continent).

Answers to the Exercises

1. It used to be said/ It was said that she was a great singer.

2. It is considered that Sri Rama is the greatest king of all time.

3. It has so far been thought that she has invented it.

4. It is said that no other batsman of the past three generations is as great as Sachin.

5. It was found that he had committed the murder.

6. It was believed that Columbus had discovered India, but what he discovered is the West Indies.

It isn't far off 

  We have seen earlier that 'much' (= a large amount of) and many (a large number of) are used, only with not, in questions and in comparatives. ఇంతకు ముందు మనం చూశాం కదా: much, many లను, ఎక్కువ లేదు అని not తో/ questions లో/ Comparative degree లో మాత్రమే వాడతామని, affirmative sentences లో ఉపయోగించమని. ఇప్పుడు 'దూరం' గురించి చూద్దాం..

Basheer: How far are you going? (ఎందాక వెళ్తున్నావు?- How far అసలర్థం - ఎంత దూరం?)

Chakri: Not very far. But why are you asking? (ఇక్కడికే. ఏం? -Why are you asking? అసలర్థం, ఎందుకడుగుతున్నావు?)

Basheer: If it is somewhere a long way off, I can give you a lift. I am going the same way. (ఎక్కడికైనా చాలాదూరం అయితే, నేను నీకు lift ఇస్తాను. నేను అటువైపే వెళ్తున్నాను.)

Chakri: So good of you. It isn't far off. Just walking distance. I prefer to walk. (Thanks. అదేం అంతదూరం కాదు. నడవగలిగినంత దూరమే.)

Basheer: What happened to your bike? (నీ bike ఏమయ్యింది?)

Chakri: On my way back from a camp, it broke down on the way. It is at the mechanic's.

It's a major trouble. (Camp నుంచి తిరిగి వస్తుండగా అది ఆగిపోయింది. అదిప్పుడు మెకానిక్ దగ్గర ఉంది. అది కొంచెం పెద్ద రిపేరే).

Basheer: When was this? (అదెప్పుడు?)

Chakri: Not so long ago - the day before yesterday. (ఎంతోకాలం అవలేదు. మొన్ననే.)

Basheer: It's an old bike, time you changed it, isn't it? (అది పాత bike. ఎప్పుడో మార్చుండాల్సింది దాన్ని.)

Chakri: It isn't as old as you seem to think. Still I think I had better change it. The day isn't far off when you will see me on a new one (నువ్వు అనుకుంటున్నంత పాతదేం కాదది. అయినా అది మార్చడమే మంచిదనుకుంటున్నా. నువ్వు నన్ను కొత్త bike మీద చూసే రోజు ఎంతో దూరం లేదు.)

Basheer: The sooner you do it the better. You can save on the repairs. (నువ్వది ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. రిపేర్ల మీద పెట్టే డబ్బు ఆదా అవుతుంది.)
                                                                                    ¤   ¤   ¤

Look at the following expressions from the conversation above:

1. Not very far.

2. If it somewhere a long way off....

3. It isn't far off (It is not far off)

4. Not so long ago

5. The day isn't far off.

  Spoken English లో far (దూరమైన = distant)ను 'not' తో లేదా (దూరం కాదు అనే అర్థంతో) question లో మాత్రమే వాడతాం. (far కి comparative- farther, superlative - farthest). అలాగే 'distant' (దూరమైన) అనడానికి బదులు ఎక్కువగా a long way/ a long way off/ a long way away ఉపయోగిస్తారు.  

a) Hemanth: How far is the railway station? Have I to go a long way?

Krishna: Not far off. It's just a kilometer from here, a little farther off from the Post Office there. (దూరమేం కాదు. ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరం. పోస్టాఫీసుకు కొద్దిగా అవతల.)

b) Kolkata is a long way off from Hyderabad (హైదరాబాద్ నుంచి కోల్‌కతాకు చాలా దూరం.)

c) Dinesh: Excuse me. Which bus should I take to Ameerpet crossroads? (అమీర్‌పేట చౌరస్తాకు ఏ బస్ ఎక్కాలి?)

Ganesh: No need to take a bus. It isn't far off. You can walk the distance. Go straight for half a kilometer and you are there. (బస్ అవసరం లేదు. అదంత దూరం కాదు. మీరా దూరం నడవచ్చు. తిన్నగా అరకిలోమీటర్ నడవండి, మీరక్కడ ఉంటారు.)

Important points: far/ far off/ far from - వీటికి అర్థం, దూరమైన అని. అయితే వీటిని not తో (దూరం కాదు అనే అర్థంతో)/ questions లో మాత్రమే ఉపయోగిస్తాం. దూరం అనేందుకు ఎక్కువగా 'a long way off' అని వాడతాం distant కి బదులు. Distant వాడటం తప్పుకాదు.

Whoever told you so? 

Spoken English లో మనం అడగాలనుకున్న, చెప్పాలనుకున్న వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, మిగతా వాటికి తక్కువ ప్రాధాన్యం  ఇవ్వడానికి, sentence లోని కొన్ని మాటలను నొక్కి పలుకుతాం, ఇతర మాటలను మామూలుగా పలుకుతాం. అలా నొక్కి పలకడాన్ని, తక్కువ శక్తితో పలకడాన్ని Intonation అంటారు.

¤ Kumar sells books (కుమార్ పుస్తకాలు అమ్ముతాడు). Suppose you want to give importance to Kumar. Then you say 'Kumar' with greater force than you say the other words.

¤ Kumar sells books (కుమార్ - ఇంకెవరో కాదు - పుస్తకాలు అమ్ముతాడు).

¤ Kumar sells books (కుమార్ పుస్తకాలు అమ్ముతాడు)

¤ Kumar sells books (కుమార్ పుస్తకాలు అమ్ముతాడు - ఇంకేదో చేయడు) అలాగే Questions లో కూడా.

¤ Who will do this? (ఇదెవరు చేస్తారు - మనం తెలుసుకోవాలనుకునేది, ఎవరు? - అందుకని The stress is on 'who').

¤ Who will do this? (ఇదెవరు చేస్తారు?) (ఇక్కడ మనకు ముఖ్యం, ఈ పనిని (ఎవరు చేస్తారు?) అది సరే, నేను చేస్తాను, ఇదెవరు చేస్తారు అని).

       ఇలా కొన్ని విషయాలకు ప్రాముఖ్యం ఇవ్వడానికి కొన్నికొన్ని పదాలను వాడతాం English లో. అవేంటో కింద చూడండి.

Compare: a) Who told you so? (నీకెవరు చెప్పారు అలా?)

b) Whoever told you so? ఎవరది నీకు చెప్పింది? - కోపంతో గానీ, విసుగుతో కానీ, చెప్పిందెవరో తెలుసుకునేందుకు who బదులు, Whoever అంటాం.

ఇది కూడా చూడండి:

a) He does anything badly. (ఏదైనా సరిగా చేయడతడు.)

b) Whatever he does, he does badly అతడేది చేసినా, సరిగా చేయడు - ఇది విసుగుతో/ కోపంతో అనడం.

       ఇలాంటివి మన Spoken English లో భాగమై పోయి వాడుకగా మాట్లాడేయాలి. అప్పుడే మన Spoken English బాగుంటుంది.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌