• facebook
  • whatsapp
  • telegram

  Janaki can sing well ....

Vinay: I always find Pavan interfering in others' affairs. (పవన్ ఇతరుల విషయాల్లో కల్పించుకోవడమే నేను తరచూ చూస్తాను).

Sankar: So do I. He doesn't just mind his business but he must butt in matters that don't concern him. (నేనూ అదే చూస్తాను. తన పని తాను చూసుకోకుండా తనకు సంబంధించని విషయాల్లో తలదూరుస్తాడు.)

Vinay: That can be a big nuisance. I don't like such people. (అది చాలా చికాకుగా ఉంటుంది. నాకు అలాంటివాళ్లు ఇష్టం లేదు.)

Sankar: Nor do I. We are one in this respect. I'm not so nosy nor are you. (నాకూ ఇష్టం లేదు- ఈ విషయంలో మనిద్దరం ఒకటే. నేనూ ఇతరుల విషయాలు పట్టించుకోను. నువ్వూ అంతే.)

Vinay: He is a nuisance, all right, but his brother isn't so. He is much better behaved. I find him quite likable. (అతడు చికాకే కానీ అతడి తమ్ముడు అలా కాదు. అతడి ప్రవర్తన బాగా ఉంటుంది. అతడు అభిమానించదగ్గవాడుగా అనిపించాడు.)

Sankar: So do I. In fact he is the nicest guy among our friends. OK, talking to other things, I didn't buy that book we need for the exam.

(నాకూ అలాగే అనిపించాడు. మన స్నేహితుల్లో అతడు అత్యంత మంచివాడు. సరే, ఇతర విషయాలకు వస్తే, పరీక్షకు కావలసిన పుస్తకం నేను కొనలేదు.)

Vinay: I didn't either. How about buying in this evening? I think we can find copies of it in the second hand market. (నేనూ కొనలేదు. ఇవాళ సాయంత్రం కొందామా? పాత పుస్తకాల దుకాణాల్లో దొరుకుతుందనుకుంటా.)

Sankar: We can, of course. (నిజమే.)

గత కొన్ని వారాలుగా మనం మాట్లాడే English కు సహజత్వాన్నిచ్చే, అంటే మనం మాట్లాడే English చాలా సహజంగా వినపడేలా చేసే, short responses (క్లుప్త స్పందనల)ను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈ short responses లో ఎక్కువగా so, neither, nor, either, but లాంటి వాటిని తరచుగా వాడుతుంటాం.

మరికొన్ని short responses ఇప్పుడు చూద్దాం:

1) So do I 2) Nor do I 3) I didn't either 4) We can, of course.

Important: Spoken English లో 'also' వాడకం చాలా తక్కువ. దీని బదులు కింద తెలిపినట్టు మనం, too, as well, so లాంటి చిన్నచిన్న మాటలను వాడతాం.

Karim: I play cricket (నేను cricket ఆడతాను).

Salim: So do I (నేనూ ఆడతాను).

గమనించారు కదా: సలీం, నేను కూడా cricket ఆడతాను అనేందుకు, I also play cricket అని అనడం లేదు, 'so do I' అని అంటున్నాడు. ఇదీ Spoken English లో'also' వదిలేసే విధం. అయితే ఇలాంటి responses ఇచ్చేటప్పుడు Helping (Auxiliary) verbs వాడే విధం బాగా తెలియాలి. అంటే ఈ కిందివి గుర్తుంచుకోవాలి:

I Doing Words - go, come, sing, walk etc. = do go, do come, do sing, do walk etc. (ఇలాంటి forms ను మనం 'not' తో, questions లో వాడతాం). అలాగే, He, she, it తో వాడే II Doing Words - (V1) goes, comes, sings, walks etc. = does go, does come, does sing, does walk, etc. (వీటిని కూడా మనం 'not' తో, questions లో వాడతాం). ఇలాంటివే Past Doing Word (V2) కు కూడా వస్తాయి.

        Went, came, sang, walked = did go, did come, did sing, did walk (వీటినీ మనం 'not' తో question లో వాడతాం.) Short form responses (క్లుప్త స్పందనలు) ఇచ్చేటప్పుడు ఇవే వాడతాం. వీటితోపాటు, shall, will, should, would, can, could, may, might, must, need కూడా వాడుతుంటాం Short form responses లో.

Look at the following.........

a) Pramod: like the mango.

Vinod: So do I (నాకూ ఇష్టమే). (ఇక్కడ I also like the mango అని ఎక్కువగా అంటుంటాం. అది తప్పు కాదు, కానీ spoken form మాత్రం కాదు). Like = do like కదా. అందుకని so do I అని response వస్తుంది. 'నాకూ ఇష్టమే' అని పైవిధంగా చెప్పకుండా, 'అందరికీ ఇష్టమే' అనో, 'ఎవరికి ఇష్టం లేదు'? అనో అనాలనుకుంటే:

Vinod: So does everybody. Who does not? (ప్రతివాళ్లకూ ఇష్టమే. ఎవరికిష్టం ఉండదు?) Everybody = He/ she. అందుకని, 'does'.

Look at the following short responses when you agree with somebody (ఇతరులతో మనం ఏకీభవించినప్పుడు వాడే short responses.)

a) Madhu: Chandan is quite clever unlike his brothers (అతడి brothers లా కాకుండా చందన్ తెలివైనవాడు.)

Santhi: Yes, he is./ So is his cousin Meena. (అవును/ అతడి cousin మీనా కూడా తెలివైందే).

b) Ramana: Our college insists on uniform (మా కళాశాల యూనిఫాం విషయంలో కచ్చితంగా ఉంటుంది.)

Krishna: So does our college, though we protested (మేం వ్యతిరేకించినప్పటికీ, మా college కూడా అంతే.) insists = does insist (our college also అనం).

c) Kalyan: Kiran played well yesterday (నిన్న కిరణ్ బాగా ఆడాడు) (played = did play).

Madhav: So did Prakash. (ప్రకాష్ కూడా బాగా ఆడాడు.) Prakash also రాదు, spoken form లో.

పై సంభాషణల్లో ఎక్కడా 'also' (= కూడా) రాకపోవడం గమనించాల్సిన విషయం.

d) Charan: Janaki can sing well (జానకి బాగా పాడగలదు).

David: So can Chitra (చిత్ర కూడా - Chitra can also, కాకుండా)

e) Wesley: I will buy a house soon (నేను త్వరలో ఇల్లు కొంటాను).

Sasikanth: So will I, if you can help me with some money. (నేనూ కొంటా, నువ్వు నాకు కాస్త డబ్బు సాయం చేస్తే).

ఇలా So మనం 'also' కు బదులు వాడవచ్చు. ఇది Spoken English లో చాలా ముఖ్యం. ఇది బాగా అలవాటు చేసుకుంటే మన English speech will sound natural.

Some more spoken forms in the next lesson.

He did, of course...

b) Farid: స్నేహ బాగా పాడలేదు (Sneha can not sing well) ఇక్కడ helping verb, 'can' కదా? కాబట్టి, response లో కూడా, 'can' వస్తుంది.

Govind: ప్రీతీ అంతే. (ప్రీతి కూడా బాగా పాడలేదు).(Nor can Preethi/ Neither can Preethi/ Preethi can't either).

c) Lavanya: Dilip hasn't seen the movie, but comments on it. (దిలీప్ ఆ సినిమా చూడలేదు, కానీ దాన్ని గురించి వ్యాఖ్యానిస్తాడు.)

Sameera: We haven't seen it either, but we don't comment. (మేమూ చూడలేదు, కానీ వ్యాఖ్యానించం.) (Dilip, 'he' కాబట్టి, hasn't వాడాం. We కి haven't వస్తుంది కదా?)

d) Rajasri: Suseela is not interested. (సుశీలకు ఆసక్తిలేదు) (Suseela she కాబట్టి, verb, is)

Vinaya: Nor are we/ Neither are we/ we aren't either. (మాకూ ఆసక్తి లేదు.)

Response లో,'we' plural కాబట్టి, 'are' వాడాం.

Sharif: I joined this college hoping this would be a good college, but I don't find it so. (ఇదేదో మంచి కళాశాల అని ఆశించి నేనిక్కడ చేరా, కానీ అలా అనిపించడం లేదు.)

Jayanth: Nor do I. I am not very happy the way things are going on in this college. (నాకూ అనిపించడం లేదు. ఇక్కడ జరుగుతున్న తీరు పట్ల నాకంత సంతోషంగా లేదు.)

Sharif: I am not either. Isn't it too late now to think of another college? (నేనూ సంతోషంగా లేను. కానీ ఇంకో కళాశాల గురించి ఆలోచించడానికి ఇప్పుడు బాగా ఆలస్యమైపోయింది కదా?)

Jayanth: So it is certainly. We have to make do with it. Even if it were possible dad wouldn't agree to it. (అది కచ్చితంగా నిజమే. ఇలా సర్దుకుపోవాల్సిందే. ఇంకోచోట చేరడం సాధ్యమైనా, మా నాన్న ఒప్పుకోడు.)

Sharif: My dad wouldn't either, and he has good reason too. In almost all colleges once we pay the fees, they won't be refunded. (మా నాన్నా ఒప్పుకోడు, అయితే ఆయన కారణాలు మంచివే. దాదాపు అన్ని కళాశాలల్లో ఒకసారి చెల్లించిన fees refund ఇవ్వరు.)

Jayanth: So is it with this college too. Dad won't be prepared to forgo such a huge amount I have paid. (ఈ కళాశాలా అంతే. అంత పెద్ద మొత్తంలో కట్టిన సొమ్ము వదులుకునేందుకు ఆయన సిద్ధపడరు.)

Sharif: Neither would my dad be. Who would be, for that matter? (మా నాన్నా ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకుంటారు, ఆ మాటకొస్తే?)

Jayanth: Did you speak to your father about it? (మీ నాన్నగారితో మాట్లాడావా ఈ విషయం?)

Sharif: Yes, I did. What did your father say about it? (ఆ మాట్లాడా. మీ నాన్నగారేమన్నారు?)

Jayanth: He would have none of it. Either I study here or don't study at all. (ఆ మాటేం విననంటున్నారు ఆయన. చదివితే ఇక్కడే లేకుంటే మానేయమన్నారు.)

Sharif: Your dad said that? (అలా అన్నారా మీ నాన్న?!)

Jayanth: He did, of course. (అలాగే అన్నారు.)

Notes: 1. Make do - (చాలా ఉపయోగకరమైన expression) = ఉన్నదాంతో సరిపెట్టుకోవడం.

When we can't get the best, we have to make do with what we have = మనకు అత్యంత మంచిది దొరకనప్పుడు, దొరికిన దాంతో సరిపెట్టుకోవాలి.

2. refund = return (money paid)

3. forgo = be prepared to lose = వదులుకోవడానికి సిద్ధపడటం.

4. for that matter = ఆ మాటకొస్తే

5. Would have none of it = refuse to hear/ accept = అస్సలు వినకపోవడం.

Look at the following from the conversation:

1) Sharif: .... I don't find it so.

Jayanth: Nor do I.

2) My dad wouldn't either. 3) So it is

4) Neither would my dad be

5) He did, of course.

In the past few lessons we have discussed short responses to questions. ఇప్పటివరకు మనం చూసింది:

Positive responses: ఇవి సరిగా ఇవ్వాలంటే do, does, did, all be forms ఉపయోగం బాగా వచ్చి ఉండాలి అని తెలుసుకున్నాం కిందటి lesson లో.

e.g.: a) A: I am at home (నేనింట్లో ఉన్నా)

B: So am I, and so is dad. (నేనూ ఇంట్లోనే ఉన్నా, అలాగే నాన్న కూడా).

b) Pramod: Sudha knows the subject thoroughly. (Sudha కు ఆ విషయం పూర్తిగా తెలుసు.)

Subodh: So does everyone in the class. The teacher has taught the subject so well. (ఆ class లో ప్రతివాళ్లకూ అది తెలుసు. ఆ విషయాన్ని teacher అంత బాగా బోధించారు.)

ఇది బాగా practice చేయాలి మనం. అందుకు do, does, did, shall, should, etc వాడకం తెలియాలి.

ఇంకో ఉదాహరణ

Sarada: If you do that, his parents may get a bad opinion on you. (నువ్వది చేస్తే అతడి తల్లిదండ్రులకు నీ మీద దురభిప్రాయం రావచ్చు.)

Eswar: So may any one who hears about it. (అది విన్న ఎవరికైనా అదే అభిప్రాయం రావచ్చు.)

పైవన్నీ రెండూ ఒకేలా ఉండే positive responses. ఇప్పుడు negative statement కు response చూద్దాం:

Gopal: I do not like such things. (అలాంటివి నాకిష్టం లేదు.)

   దీనికి స్పందనగా, 'నాకూ ఇష్టం లేదు' అనేందుకు, I do not also like it అనంNot తో also వాడటంwrong English. దాని బదులు ఇలా అంటాం.

Kesav: Nor do I,/ Neither do I/ I don't either అంటాం. ఇది Spoken English లో, అంటే correct Spoken English లో సర్వసాధారణం. అలాకాకుండా not తో also వాడటం సరైన English కాదు.

మరికొన్ని ఉదాహరణలు ఈ lesson ప్రారంభంలోని సంభాషణలో ఉన్నాయి చూడండి:

a) Sharif: ....... but I don't find it so./ .... but I do not find it so. (కానీ అది అలా ఉండటం నేను చూడలేదు.)

Jayanth: Nor do I (నేనూ అలా ఉండటం చూడలేదు.)

గమనించండి: I do not (don't) also find it so, అనకపోవడం. ఎందుకని? Not తో also రాదు కాబట్టి. ఇక్కడ, 'nor' బదులు 'Neither' కూడా వాడతాం.

b) Jayanth: Dad won't be prepared to forgo such a huge amount. (నాన్న అంత పెద్ద మొత్తాన్ని వదులుకునేందుకు సిద్ధపడరు.)

Sharif: Neither will my dad be. (మా నాన్న కూడా సిద్ధపడరు) (My dad will also not be - Wrong) Nor/ neither తోపాటు, not either అని కూడా అంటాం - అది కూడా కాదు, లేదు అనే అర్థంతో.

cJayanth: ...... my dad wouldn't agree to it (మా నాన్న అందుకు ఒప్పుకోరు.)

Sharif: My dad wouldn't (would noteither. (మా నాన్నానాన్న కూడా ఒప్పుకోరు).

ఇప్పుడు కిందివాటికి short responses మీరు ప్రయత్నించండి, కింది ఉదాహరణ సాయంతో

a) Anand: నేను ఆ party కి వెళ్లకపోవచ్చు. (I may not attend the party)

Bhargav: నేనూ వెళ్లకపోవచ్చు.(Neither may I/ Nor may I/ I mayn't (I may not) either).

గమనిక: Anand sentence లో Helping verb, 'may' కాబట్టి, response లో కూడా 'may' వాడాం.

I don't think so ....

Sampath: Is there time for one more game? (ఇంకో ఆట ఆడే సమయం ఉందా?)

Prem: I'm afraid not. (లేదనే అనుకుంటున్నా.)

Sampath: Your game is better than mine. Will my practising with you improve my game? (నీ ఆట నా ఆట కంటే మెరుగ్గా ఉంటుంది. నీతో practise చేస్తే నా ఆట మెరుగవుతుందా?)

Prem: I believe so. Well, you can give it a try. (అని నమ్ముతున్నా. ప్రయత్నించి చూడు.)

Sampath: Will it be possible for you to play atleast two sets with me every evening? (రోజూ సాయంత్రం నాతో రెండు sets ఆడటం నీకు సాధ్యమేనా?)

Prem: I don't think so (కాదనుకుంటా).

Sampath: Then what do you suggest (that) we do?

Prem: We can play longer during the weekends, when I have plenty of leisure. It must suit you, if I am not wrong. (వారాంతాల్లో మనం ఎక్కువసేపు ఆడవచ్చు, అప్పుడైతే నాకు విరామ సమయం ఎక్కువగా ఉంటుంది. నేను పొరపడకపోతే, అది నీకు వీలేననుకుంటా.)

Sampath: I hope so. (అలానే ఆశిస్తున్నా.)

Prem: Can't you get your friend Sekhar to join us? He is a good player too and some practice with him will be of help to me, won't it? (మీ స్నేహితుడు శేఖర్‌ను మనతో ఆడేందుకు తీసుకురాకూడదూ? అతడు మంచి ఆటగాడు. అతడితో కొంత practise నాకు సాయపడుతుంది కదా?)

Sampath: I hope not. He isn't a steady player. (నేనలా అనుకోవడం లేదు. అతడు నిలకడ ఆటగాడు కాదు.)

Prem: OK, then. I believe we are going to have a steady practise from the weekend. (సరే అయితే, ఈ వారాంతం నుంచి మనం నిలకడగా practise చేద్దాం అని నమ్ముతున్నాను.)

Sampath: I believe so too.

Look at the following expressions from the conversation above:

1) I'm (I am) afraid not

2) I believe so         3) I don't think so

4) I hope so             5) I hope not

6) I believe so too.

ఈసారి మనం చూడబోయే క్లుప్త స్పందనల్లో ఎక్కువగా వాడే మాటలు: think, believe, hope, afraid, wonder and suppose.

responses మన spoken English కు చాల సహజత్వాన్నీ, సరళత్వాన్నీ ఇస్తాయి.

Look at the following:

1. a) Bharadvaj: Is there enough time for us to finish this work? (ఈ పనిపూర్తి చేసేందుకు చాలినంత సమయం ఉందా?)

Sulekha: I think so. (అనే అనుకుంటున్నా.)

b) Charan: Will he help us in the matter? (అతడు మనకు ఈ విషయంలో సహాయం చేస్తాడా?)

Ekambar: I don't think so (నేనలా అనుకోవడం లేదు.)

c) Gangadhar: Is there time for another cup of tea? (ఇంకో కప్పు టీ తాగే సమయం ఉందా?)

Sudheer: I think so (ఉందనే అనుకుటున్నా.) అదే లేదని అనుకుంటున్నా, అనేందుకు (I don't think so. We must rush అలా..)

2. a) Sunayana: We are going to have holidays from 5th June, aren't we? (మనకు June 5 నుంచి సెలవులు ఉంటాయి కదా?)

Praveena: I believe so ( నా నమ్మకం అదే.)

b) Prakash: He is the same guy who cheated us last time, isn't he? (పోయినసారి మనల్ని మోసం చేసింది వీడే కదా?).

Praveena: I believe so. (అనే నమ్ముతున్నాను.)

3. a) Naresh: Perhaps Jagdish will help us in the matter. (బహుశా మనకి ఈ విషయంలో జగదీష్ సహాయం చేస్తాడేమో).

Ramesh: I hope so (అనే ఆశిస్తున్నా.)

b) Divakar: We will be able to meet him, shan't we? (మనం అతన్ని కలుసుకోగలం కదా?)

Suman: I hope not. (నేనాశించడం లేదు.)

4. a) Damodar: Perhaps he will be behind the bars soon. (త్వరలోనే వాడు కటకటాల వెనుక ఉంటాడనుకుంటా.)

Vinay: I am afraid so (అలానే అనుకుంటున్నా.)

Afraid - మామూలు అర్థం - భయపడటం, కానీ ఇలాంటి చోట I'm afraid వాడకం: అవతలివాళ్లకు ఇష్టం లేని / నిరాశ కలిగించే/ చికాకు కలిగించే విషయం, కాస్త మర్యాదపూర్వకంగా చెప్పేందుకు అంటాం.

b) Anand: Is your father coming?

Bhaskar: I'm afraid not (రారండి.)

c) Chandra: Do you think it will rain? (వర్షం వస్తుందనుకుంటున్నావా?)

Surya: I'm afraid so (అనే అనుకుంటున్నా) (కొంత సందేహంగా/ మర్యాదగా చెప్పడం).

d) Leela: Is there enough money for the bike? (బైక్ కొనేందుకు తగినంత డబ్బు ఉందా?)

Manohar: I hope not (లేదనే నా భావం).

గమనిక: Positive responses అన్నింటికీ చివర 'so' వస్తుంది.

I think / believe / suppose / hope / afraid so.

Negative response: Hope, afraid కు తప్ప మిగతావాటికి కూడా 'so' వస్తుంది.

don't think / believe / suppose so.

Hope, afraid కు మాత్రం negative response తేడాగా ఉంటుంది, ఇలా: I'm afraid not / I hope not.

Do you konw..?   I do

Jaideep: Can you speak English? (నువ్వు English మాట్లాడగలవా?)

Sudhakar: I can, of course. (నేను మాట్లాడగలను. of course = దానికేంటీ?/ ఎందుకు మాట్లాడలేను? అనే ధోరణి తెలిపే స్పందన ఇది).

Jaideep: Who taught you English? (ఎవరు నేర్పారు English నీకు?)

Sudhakar: My grandfather did. I grew up at my grandfather's, as my parents were abroad when I went to school. (మా తాత. నేను మా తాతవాళ్లింట్లో పెరిగాను. నేను చదువుకునేటప్పుడు, మా అమ్మానాన్న విదేశాల్లో ఉండటంతో.)

Jaideep: We are starting tomorrow morning. Can you get up early? (మనం రేప్పొద్దున బయలుదేరుతున్నాం. పొద్దున్నే లేవగలవా?)

Sudhakar: Have I to get up very early? (నేను బాగా తొందరగా లేవాలా?)

Jaideep: I'm afraid you have to. (లేవాలనే అనుకుంటున్నా?)

Sudhakar: I am alone, you know. Who will put me up so early? (నేను ఒంటరిగా ఉన్నా, తెలుసు కదా. ఎవరు నన్ను అంత తొందరగా లేపుతారు?).

Jaideep: I will, don't worry. I'll call you as soon as I get up. (నేను లేపుతాను. దిగులు పడకు. నేను లేవగానే నీకు phone చేస్తాను.)

Short form responses (క్లుప్త స్పందనలు) తెలిపేటప్పుడు 1) auxiliary verb forms గుర్తించడం చాలా కీలకం.

Look at the following:

Puneet: Who wrote the Bharatam? (భారతం ఎవరు రాశారు?)

Sankar: Vyasa did (వ్యాసుడు రాశాడు).

      ఇక్కడ question, 'who wrote ....?' కదా! Wrote = did + write. అంటే ఇక్కడ auxiliary, 'did'. కాబట్టి,'who wrote ....?' అన్న దానికి క్లుప్త స్పందన Vyasa did. అలాగే, who discovered America? అనేదానికి response:

Columbus did.

a) Teacher: Who can answer my question?

Anand: I can, sir.

Teacher: Do you know who wrote this book? (ఈ పుస్తకం రాసిందెవరో తెలుసా?)

Anand: I do sir, it's Sri Chalapathi Rao. (నాకు తెలుసండీ. అది చలపతిరావు).

గమనిక: 1st question లో auxiliary / helping verb 'can'. Response లో కూడా can. అలాగే,2nd question లో helping verb 'do'. అందుకే, responseలో కూడా

b) Aravind: How many of you need these book? (మీలో ఎంతమందికి ఈ పుస్తకం అవసరం?)

Bosu: Atleast four of us do. (కనీసం నలుగురికైనా) ఇక్కడ question లో question words 1) How many (number), need? (అవసరం). కాబట్టి response లో need (1st Doing word) కు సంబంధించిన auxiliary / helping verb - do (remember: need = do need) కాబట్టి, response లో 'do' వస్తుంది. మరో ఉదాహరణ:

Mahit: Do you go there every day? (రోజూ అక్కడికి వెళ్తావా?)

Sanjai: I do, most of the days. (వెళ్తాను, చాలమటుకు - రోజూకాకపోయినా).

c) Sarala: Bindu wants to go to a movie.

Sarada: But I don't want to. They are so boring.

I don't think she meant to

Infinitive అంటే తెలుసు కదా: + 1st Doing Word. e.g.: to go, to come, to see, to do, etc. సమాధానాల్లో/ స్పందనల్లో, ఈ infinitive లోని 'to' మాత్రమే వాడి, 1st doing word ని వదిలేస్తాం. చూడండి.

a) Vijay: Why didn't you go to Golconda when you were in Hyderabad?

హైదరాబాద్‌లో ఉన్నప్పుడు, గోల్కొండ ఎందుకు వెళ్లలేదు?)

Sunayana: I didn't have the time to (వెళ్లే సమయం లేకపోయింది.)

గమనించండి: I didn't have the time to go there అని పూర్తిగా అనే బదులు, 'I didn't have the time to' అని చెప్పి సరిపెట్టొచ్చు.

b) Gangadhar: Why didn't you go with him? (అతడితో నువ్వెందుకు వెళ్లలేదు?)

Narasimham: He didn't ask me to. (అతడు నన్ను అడగలేదు.Short form for: He didn't ask me to go with him).

c) Neeraja: Your friend Sujana was very rude to me (మీ స్నేహితురాలు సుజన నా పట్ల చాలా దురుసుగా ప్రవర్తించింది.)

Sarada: I don't think she meant to. (+ be rude) (అలా కావాలని ప్రవర్తించిందని నేననుకోను.)

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌