• facebook
  • whatsapp
  • telegram

ఆర్టికల్స్‌.. నియమ నిబంధనలు

* పోటీ పరీక్షలకు ఇంగ్లిష్‌

పోటీ పరీక్షలకు ఇంగ్లిష్‌ ఉన్నవి మూడు పదాలే కానీ.. వీటిలో ఏ మాట ముందు ఏది ఎక్కడ వాడాలి అనేది చాలా ముఖ్యం. ఇంగ్లిష్‌ భాషలో Articles(కి సంబంధించిన నియమ నిబంధనలూ, నేర్చుకునే మెలకువలూ ఇప్పుడు తెలుసుకుందాం!

'A', 'An', 'The'  అనే ఈ articles రెండు రకాలు. 1. Indefinite article   2. Definite article

Indefinite article: Sentenceలో subject  గురించి నిర్దిష్ట సమాచారం ఇవ్వని article Indefinite article.-

Eg: A, An .

వీటిని ఎక్కడ ఉపయోగించాలో, ఎక్కడ ఉపయోగించకూడదో సులువుగా నేర్చుకుందాం. 

1)  A, An అనేవి singular countable common noun  ముందు ఉపయోగించాలి. 

2) singular countable common

noun  పలికే సందర్భంలో మొట్టమొదటి అక్షరం అ ----- అః వరకు మధ్య ఉన్నట్లయితే ' an',  క-----క్ష మధ్య గల అక్షరాల్లో మొదటి అక్షరం వస్తే 'a' వాడాలని గుర్తుంచుకోండి. 

an American (అమెరికన్‌)

an onion   (ఆనియన్‌)

an igloo   (ఇగ్లూ)

an eagle   (ఈగల్‌)

an Iron box (ఐరన్‌బాక్స్‌)

an owl   (ఔల్‌)

an umbrella  (అంబ్రెల్లా)

an elephant   (ఎలిఫెంట్‌)

a European  (యూ)

a unique girl  (యూ)

a uniform    (యూ)

a one legged girl (వ)

an LLB student (ఎల్‌ఎల్‌బీ స్టూడెంట్‌)

an MLA  (ఎమ్మెల్యే)

an NRI girl (ఎన్‌ఆర్‌ఐ గర్ల్‌)

an RMP doctor (ఆర్‌ఎంపీ డాక్టర్‌)

an X-ray   (ఎక్స్‌రే)

an SI student  (ఎస్సై స్టూడెంట్‌)

H silent (in the beginning)

an hour (అ)

an honour (ఆ)

an heir  (ఏ)

an honest man  (ఆ)

Definite article

Sentenceలో subject గురించి ‘ఫలానా’ అంటూ  నిర్దిష్టంగా సమాచారాన్నిచ్చేది Definite article.

The అనే definite article  కింది వాటిముందు వాడతాం. 

1. Rivers (నదులు): The Godavari

2. Seas (సముద్రాలు): The Red sea

3. Oceans(మహా సముద్రాలు): The Pacific Ocean

4. Ranges of Mountains (పర్వతశ్రేణులు): The Himalayas

5. Canals (కాలువలు): The Panama Canal

6. Historical buildings (చారిత్రక నిర్మాణాలు/కట్టడాలు): The Taj Mahal

7. Unique objects & Planets (విశిష్టమైiనవి/గ్రహాలు): The Sun, The Moon

8. Directions (దిక్కులు): The East, The West

9. Islands (దీవులు): The West Indies

10. Designations (హోదాలు): The P.M.

11. Surnames (వంశంపేర్లు): The Tatas

12. Superlative degree of adjectives : The tallest

13. Holy books: The Ramayana, The Bible

14. News Papers (వార్తాపత్రికలు): The Hindu

15. Magazines: The Outlook

16. Ordinal numbers : The First, The Second

17. Waterfalls (జలపాతాల్లు): The Nayagara

18. Deserts (ఎడారులు): The Sahara desert

19. Musical Instruments(సంగీత వాద్య పరికరాలు): The Flute, The Veena

20. Trophies and cups (ట్రోఫీలు, కప్పులు): The World cup

21. Castes and Community (కులాలు): The Rajputs

22. Abbriviative type of countries: The USA, The UK, The USSR

23. Nationalities (జాతీయత): The Japanese

24.  Wars, Revolutions (యుద్ధాలు, విప్లవాలు): The First World War, The Red Revolutions

25. Armed Forces(సైనిక దళాలు): The Army, The Navy, The Airforce

26. Political parties(రాజకీయ పార్టీలు): The BJP, The CPM

27. Inventions (ఆవిష్కరణలు): The Radio, The Television

28. Organisations : The UNO, The NATO

29. Awards, Rewards & Prizes : The Padmasri, The Nobel Prize

30. Physical positions (భౌతిక స్థలాలు): The Centre, The Top

31. Before the names of languages in the meaning of people (ప్రజలు అనే అర్థంలో language ముందు): The Telugu = తెలుగు ప్రజలు 

32. ప్రజలు అనే అర్థంలో adjectives ముందు: The Poor = పేద ప్రజలు 

33. Comparison అనేది రెండింటి మధ్య ఉన్నప్పుడు comparative degree of adjective వాడి దాని ముందు..: of the two sisters, Lavanya is the taller.

34. In comparisons(పోల్చే సందర్భంలో): Bombay is the Manchester of India (ఇక్కడ Bombay ను Manchester తో పోలుస్తున్నారు). 

Articles వాడకూడని సందర్భాలు 

1. Before proper Nouns

Murali, Hyderabad

2. Before Common Noun

Man is Mortal, Woman is Man's mate.

3. Before Abstract Noun

Love is blind, Knowledge is power.

4. Before Material Noun

Gold is costly, Iron is available

5. Before meal items

Tiffin, Lunch

6. Before Games

Cricket, Tennis

7. Before Languages

English, Telugu

8. Before singular peaks

Eg: Everest peak, Dodabetta Peak

9. Before uncountable Nouns

advice, information

10. Before little, few in the negative meaning.

Little sugar (hardly any = No sugar)

కేవీఆర్‌

డైరెక్టర్, కేవీఆర్‌ ఇంగ్లిష్‌ అకాడమీ

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ మెడికల్‌ డివైజెస్‌ కోర్సులకు డిమాండ్‌

‣ బోధన ఉద్యోగాలకు తొలి మెట్టు.. నెట్‌

‣ ఆయుధాలు చేపట్టి.. ఆంగ్లేయులను అదరగొట్టి!

‣ సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు తుది సన్నద్ధత

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌