• facebook
  • whatsapp
  • telegram

Interrogative Pronouns

1) What? (ఏం? ఏది?);

2) Which? (ఏది?/ ఎవరు? - (కొన్నింటిలో/ కొందరిలో);

3) Who? (ఎవరు?);

4) Whose? (ఎవరిది?)

5) Whom ? (ఎవరిని?/ ఎవరికి?)

.... ఇవన్నీ

Interrogative pronouns.

      (ముఖ్యమైన విషయం- Modern English Usageలో Whom వాడుకలో లేదు. దాని బదులు 'who' వాడుతున్నారు.)    

      Interrogate అంటే ప్రశ్నించడం. ఇవన్నీ ప్రశ్నించేందుకు వాడే pronouns కాబట్టి వాటిని Interrogative pronouns అంటారు.

      (కిందటి పాఠాల్లో తెలుసుకున్నదేమిటంటే.. subjectను బట్టి, who/ what తర్వాత singular verb లేదా plural verb రావచ్చు.)

Nishanth: The scenery is beautiful, isn't it? (ఈ దృశ్యం అందంగా ఉంది కదా?)

Angeeras: Very charming, really. It is hot down below, but on top of this hill, it is cool and comfortable. 

          (నిజంగా చాలా ఆకర్షణీయంగా ఉంది. కింద వేడిగా ఉంది, కానీ ఈ కొండమీద మాత్రం చల్లగా, సుఖంగా ఉంది.)

Nishanth: The weather in high places is always cool. 
           (ఎత్తయిన ప్రదేశాల్లో వాతావరణం ఎల్లప్పుడూ చల్లగానే ఉంటుంది.)

     Angeeras: That's why rich people go to hill stations during summer.

    (అందుకనే బాగా డబ్బున్న వాళ్లందరూ వేసవిలో కొండ ప్రాంతాలకు వెళుతుంటారు.)

Nishanth: Last summer I was fortunate enough to go to Ooty. Dad in his busy time took a fortnight off to take us there.

                  What a lovely place indeed!

   (కిందటి వేసవిలో ఊటీకి వెళ్లే అదృష్టం నాకు దక్కింది. నాన్న ఓ పదిహేనురోజులు తీరిక చేసుకుని మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్లారు. ఊటీ ఎంత అందంగా ఉందో?)

Angeeras: What's there in the big bag you are carrying? Isn't it heavy? Why don't you put it on the floor and carry it when you leave?

    (ఏంటా పెద్ద సంచి నువ్వు మోస్తున్నది? అది బరువుగా లేదా? దాన్ని నేలమీద ఉంచి, వెళ్లేటప్పుడు తీసుకు వెళ్లొచ్చుకదా?)

Nishanth: It has some important papers in it. I am afraid I might forget the bag if I leave it on the floor.

     (ఆ బ్యాగ్‌లో ముఖ్యమైన పేపర్లు ఉన్నాయి. కింద ఉంచితే దాన్ని మర్చిపోతానేమోనని భయం.)

Angeeras: Don't worry; you are strong enough to carry it.

      (నువ్వేం బాధపడకు. దాన్ని మోసేందుకు తగినంత బలం ఉన్నవాడివే?)

Nishanth: You are tall but lean. I doubt if you can carry this as easily as I do.

      (నువ్వు పొడుగే కానీ సన్నం. నేను మోస్తున్నంత సులభంగా నువ్వు దీన్ని మోయగలవా అని నా అనుమానం.)

Angeeras: OK. I must be going. Bye. (సరే. నేను వెళ్లాలి వస్తా.)

                                       Look at the following expressions from the conversation above.

1) The weather in high places is cool.

        2) That's why rich people go to hill stations during summer.

        3) Last summer I was fortunate enough to go to Ooty.

        4) Dad in his busy time took a fortnight off.

        5) What a lovely place indeed!

        6) What is the big bag you are carrying?

        7) Isn't it heavy?

        8) It has some important papers in it.

        9) I am afraid .....

        10) You are strong enough to carry it.

        11) You are tall but lean.

     పైన underline చేసిన మాటలను చూడండి. అవన్నీ కూడా ఒక వస్తువు/ ఒకరి గుణాలు, లక్షణాలను తెలిపే మాటలే కదా? చూద్దాం! 

1) High places = ఎత్తయిన ప్రదేశాలు. 

     ఇక్కడ high (ఎత్తయిన) అనేది places (ప్రదేశాల) లక్షణాన్ని/ గుణాన్ని తెలుపుతుంది. 

 అలాగే, The weather in high places (ఎత్తయిన ప్రదేశాల్లో), is cool (చల్లగా). 

      ఇక్కడ కూడా cool (చల్లగా) అనేమాట, weather (వాతావరణం) లక్షణాన్ని/ గుణాన్ని తెలుపుతుంది. 

       ఇలా వస్తువులు/ ప్రదేశాలు/ వ్యక్తుల లాంటి వాటి లక్షణాలను తెలిపే మాటలు ADJECTIVES.

      పై సంభాషణ నుంచే మరికొన్ని Adjectives చూద్దాం:

2) rich = డబ్బున్న/ సంపన్నులైన 

3) fortunate = అదృష్టం ఉన్న/ కలిగిన 

    Fortunate to be here = ఇక్కడ ఉండే అదృష్టం. 

4) busy = తీరిక లేని. 

5) lovely = అందమైన/ సుందరమైన.                 

6) big = పెద్దదైన

7) heavy = బరువైన 

8) important = ముఖ్యమైన 

9) afraid = భయంగల/ భయపడుతున్న. 

10) tall = పొడుగైన/ ఎత్తయిన 

11) lean = సన్నని/ బక్కపలచని

      పైవన్నీ Adjectives. Adjectives కు తెలుగులో అయిన/ అయినటువంటి (tall = పొడుగైన/ పొడుగైనటువంటి); ఉన్న/ ఉన్నటువంటి (Hot = వేడిగా ఉన్న/ ఉన్నటువంటి), గల/ గలిగినటువంటి (Rich = డబ్బుగల/ గలిగినటువంటి) అనే అర్థాలు వస్తాయి. 

        Adjectives ఎప్పుడూ nounsను గురించే చెబుతాయి/ వర్ణిస్తాయి.

       High places - 'High' - adjective, 'places' అనే nounను గురించి చెబుతోంది/ వర్ణిస్తోంది. అలాగే rich people లో rich - adjective, people అనే nounను గురించి చెబుతోంది.

       Noun ఎలాంటిదో తెలియజేసేవన్నీ కూడా Adjectives. చాలాసార్లు మనం '-ing' forms (Walking, singing లాంటివి) కూడా noun ఎలాంటిదో తెలియజేసేందుకు వాడతాం కదా. అప్పుడు అవికూడా adjectives అవుతాయి.

e.g.: a) A walking stick (stick అనే noun ను గురించి చెబుతుంది కాబట్టి, walking కూడా adjective).

        b) Waiting passengers = వేచి ఉన్న ప్రయాణికులు. 

       - ఇక్కడ passengers అనే nounను గురించి చెబుతోంది కాబట్టి 'waiting' adjective.

c) The sinking ship = మునిగిపోతున్న ఓడ

       Ship అనే noun ను వర్ణిస్తోంది కాబట్టి sinking (-ing form) - adjective

d) Running train - కదులుతున్న రైలు - Running (-ing form) - adjective, train - noun.

        '_ing' formను adjective గా వాడినట్లే, past participles ను కూడా adjectives గా వాడతారు. (past participles అంటే తెలుసుకదా- sing అనే verb కు, sung; give అనే verb కు given; go అనే దానికి gone - ఇవి past participles - ఎక్కువగా V3 అని లేదా PP అని అంటుంటారు). Past participles (PP) ని కూడా, '_ing' form లాగే, noun ఎలాంటిదో తెలిపేందుకు వాడతాం. కాబట్టి, Past participles కూడా adjectives.

        చాలా verbs  కు past participles -ed, -d, -t చేర్చి PP ని form చేస్తాం:

       talk - PP - talked; love - PP - loved; smell - PP - smelt).

       PP adjectives

a) Cooked food (వండిన ఆహారం) - Cooked (PP), food ఎలాంటిదో చెబుతుంది కాబట్టి cooked (PP), adjective.

b) Torn clothes (చినిగిన బట్టలు) - Torn (చినిగిన) PP, clothes ఎలాంటివో చెబుతుంది కాబట్టి, 'torn' - adjective. గా ఇలా వాడతాం.
   

c) Damaged car: Damaged (PP), adjective, qualifying the noun car.

d) A painted wall - painted (PP)- adjective and wall noun.

     Adjectives ను రెండు విధాలుగా వాడతారు:

1) Noun ముందు వాడతారు:

    The beautiful building is my uncle's. (అందమైన ఆ మేడ మా బాబాయిది.)

     ఇక్కడ adjective 'beautiful'ను, noun, building ముందు వాడుతున్నాం.

2) Adjectives ను sentence చివర కూడా వాడవచ్చు.

     The building is beautiful - 'beautiful' noun తర్వాత sentence చివరే ఉంది కదా: 

         Noun ముందు వాడలేని adjectives కూడా ఉన్నాయి. ఒక ఉదాహరణ: Afraid. An afraid child అని child (noun) ముందు adjective afraid ను వాడం. ఇలాంటివి మరికొన్ని తర్వాత చూద్దాం. సాధారణంగా ఈ కింది శబ్దాలతో అంతమయ్యే English మాటలన్నీ దాదాపు (అన్నీ కాకపోవచ్చు) Adjectives (ఇలా మాటల చివర చేర్చి ఆ మాటల parts of speech ని మార్చగల శబ్దాలను suffixes (singular, suffix) అంటాం:)

        1. _al : Accidental, medical, personal.....

        2. _ful: Beautiful, wonderful, successful

        3. _ic: Historic, Photographic, basic

        4. _ical: Historical, magical, practical

        5. _ish: foolish, childish, selfish

        6. _less: senseless, useless, homeless

        7. _ly: friendly, costly, daily

        8. _ous: poisonous, dangerous, zealous

        9. _y: cloudy, rainy, funny

        10. _able: Notable, eatable, laughable

        11. _ible: forcible, flexible, sensible

        12. _en: frozen, darken, shorten

                         ఇవేకాక, ఇంకొన్ని Adjective prefixes కూడా ఉన్నాయి. వాటిని తర్వాత తెలుసుకుందాం.

Adjectives అంటే గుణాలు/ లక్షణాలను తెలిపే పదాలు. మనం ఎప్పుడైనా ఎవరిదైనా/ దేనిదైనా లక్షణాలను గురించి మాట్లాడినప్పుడు పోల్చి చూడటం సహజం. ఒకరికంటే, ఇంకొకరు ఏదైనా లక్షణంలో ఎక్కువ/తక్కువ అనో, ఒకదానికంటే ఇంకొకటి మించిందనో తక్కువ అనో అంటుంటాం కదా? అందుకు adjectives నే వాడతాం కదా? ఇలాంటి తరతమ భేదాలను తెలిపేందుకు Degrees of comparison వాడతాం.

Comparison - పోల్చడం; Degree - పోల్చేటప్పుడు ఏ మేర (Degree)కి ఏది ఎంత ఎక్కువ, తక్కువ అని తెలపడం.)

 The elephant is a big animal. ఈ sentence లో 'animal' ను వర్ణించేది big, adjective. ఈ వాక్యంలో మనం ఏనుగును దేనితోనూ పోల్చడం లేదు.

 The elephant is bigger than the lion:

(ఏనుగు సింహం కంటే పెద్దది) - ఇక్కడ ఏనుగును సింహంతో పోలుస్తున్నాం. అంటే ఇక్కడ Comparison ఉంది.

The elephant is the biggest of all the animals 

ఇలా big ను bigger, biggest అనే మాటలుగా కొద్దిగా మార్పు చేస్తాం, పోల్చేందుకు. దీన్నే Degrees of comparison of adjectives అంటాం. మూడు Degrees, మనకు తెలుసు: - ఏనుగు భూమిమీద తిరిగే జంతువులన్నింటిలో పెద్దది. ఇక్కడ కూడా ఏనుగును మిగతా జంతువులన్నింటితో పోలుస్తున్నాం. 

 

Positive Degree

a) ఒకతెగకు చెందిన వాటిలో (మనుషులు/జంతువులు) మరే ఇతర జీవి దీనంత కాదు అంటాం. 

e.g.: No other animal is as big as the elephant. (ఏ ఇతర జంతువూ ఏనుగంత పెద్దది కాదు.) (రెండింటికంటే ఎక్కువ విషయాల పోలిక) 

b) ఒక్కోసారి, రెండింటినీ/ ఇద్దరినీ పోల్చి చెబుతాం: మరోజంతువు/ వ్యక్తి దీనంత (మనం మాట్లాడుతున్నంత) పెద్దదికాదు.

The lion is not so/ as big as the elephant (సింహం ఏనుగంత పెద్దది కాదు - పోలిక రెండింటి మధ్యే- 'ఒకటి ఇంకొకదాన్నంత పెద్దది కాదు అని.)

Comparative

 a) రెండింటిని మాత్రమే పోల్చినప్పుడు:

  The elephant is bigger than the lion (సింహం కంటే ఏనుగు పెద్దది.)

b) రెండింటి కంటే ఎక్కువ వాటిని పోలిస్తే. 

The elephant is bigger than any other animal/ all other animals.

(ఏనుగు ఏ ఇతర జంతువు కంటే/ అన్ని ఇతర జంతువుల కంటే పెద్దది.

Superlative

రెండింటిని మాత్రమే పోల్చినప్పుడు, Superlative degree ఉండదు. రెండింటికంటే ఎక్కువ విషయాలు పోల్చినప్పుడే Superlative ఉంటుంది. 

The elephant is the biggest animal/ the biggest of all animals/ the biggest animal of all.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌