• facebook
  • whatsapp
  • telegram

How to use A, An, The

'A'/ 'An' and 'The'లకు English లో చాలా ప్రాముఖ్యం ఉంది. ఇవి వాడాల్సిన చోట వాడకపోయినా వాడకూడని చోట వాడినా అర్థాల్లో చాలా తేడాలు వస్తాయి. కాబట్టి We should learn to use them properly.

1) The book I gave you yesterday = నిన్న నేను నీకిచ్చిన పుస్తకం.

Observe the difference between:

a) A book gives information = పుస్తకం (ఏ పుస్తకమైనా అనే అర్థంతో) సమాచారాన్నిస్తుంది. ఇక్కడ A = any/one = ఏదైనా/ఒక.

b) The book I gave you yesterday = ఇక్కడ, మనం 'ఏదో/ ఏ పుస్తకమో అని కాకుండా ఫలానా పుస్తకం - నేను నీకు ఇచ్చిన పుస్తకం - గురించి మాట్లాడుతున్నాం. అలాంటి అర్థం వచ్చేందుకు, 'The book' అంటాం. 

An egg is on the plate. The egg (on the plate) is for Ramesh. 

 In the first sentence, we are talking about, one egg. So we say an egg. In the second, మనం అంతకు ముందే మాట్లాడిన egg గురించి చెబుతున్నాం కాబట్టి, the egg అంటాం. ఇది 'the' ముఖ్యమైన ఉపయోగం. 

 The pen you presented me is very nice = నువ్వు నాకు బహూకరించిన పెన్ను చాలా బాగుంది.

గమనిక: 'A'/'An' లేదా, 'The' ఏది వాడాలి అని సందేహం ఉంటే, 'ఏ? ('Which'?) అని ప్రశ్న వేసుకుందాం. దానికి 'ఫలానా అని జవాబుంటే, 'the' వాడాలి.  లేకుంటే 'a'/'an' వాడాలి. 

Man is standing there (అక్కడో మనిషి నిలబడి ఉన్నాడు).

Question వేసుకుందాం; Which man is standing there? (ఏ మనిషి నిలుచుని ఉన్నాడు అక్కడ?) - దీనికి సమాధానం లేదు, కాబట్టి ఇక్కడ Man ముందు 'A' నే వాడతాం. A man is standing there

Man with the gun is James Bond. (తుపాకితో ఉన్న మనిషి జేమ్స్ బాండ్)- Question వేయండి: ఏ మనిషి James Bond? (Which man s James Bond?) Answer (Man with the gun) ఉంది కాబట్టి, The man with the gun is Bond.

ఇది అర్థం చేసుకుంటే, 'a'/'an', 'The' ఉపయోగించడం చాలా తేలిక.

Look at some of the other expressions from the conversation above:

a) It shows a beautiful picture of the Himalayas and the Ganga.

b) He bought it in the US

c) Wasn't he in the Netherlands? 

 పై sentence అన్నీ 'the' వాడాల్సిన మరికొన్ని సందర్భాలను తెలుపుతాయి:

1) The Bhagavadgita, a great and holy book. అంటే గొప్ప, పవిత్రమైన గ్రంథాల ముందు 'the' తప్పక వాడాలి.

    The Ramayanam, The Mahabharatam, The Bible, The Khuran etc.,

2) The US - కొన్ని రాష్ట్రాలు కలిపి ఏర్పాటైన దేశాల పేర్లముందు, తప్పకుండా The రావాలి. The US/ USA (The United States of America),

     The UAE (The United Arab Emirates) etc.

          అయితే ఒక సందేహం రావచ్చు: India లో కూడా రాష్ట్రాలున్నాయి కదా? అయినా The India అనం, ఎందుకనే అనుమానం రావచ్చు. ఇక్కడొకటి గమనించాలి- భారతదేశం రాష్ట్రాలు ఏర్పడక ముందే ఉంది. దేశాన్ని రాష్ట్రాలుగా విభజించారు.

         America (The US/USA), the UAE (Gulf countries) విషయంలో రాష్ట్రాలు మొదట ఏర్పడి, అవన్నీ కలిసి దేశమయ్యాయి. అందుకని The USA/ US, The UAE అంటారు.

3) The Netherlands: ద్వీపాల సమూహం పేరు ముందూ, The వాడాలి.

        a) The Andamans (అండమాన్ దీవుల సమూహం), b) The Maldives (మాల్దీవులు) etc. అయితే ఒకే ఒక ద్వీపం పేరు ముందు, 'The' వాడకూడదు.

            The Srilanka (Wrong), because it is only one island - Srilanka (Correct).

4) The Himalayas - Use 'the' before the names of mountain ranges (పర్వత శ్రేణులు - కొన్ని పర్వతాలు కలిసి ఏర్పడేవి). 

                The Vindhyas (వింధ్య పర్వతాలు), 

                The Eastern Ghats (తూర్పు కనుమలు), 

                The Aravalis (ఆరావళి పర్వతాలు) - ఈ పర్వత పంక్తుల పేర్ల ముందు "The" వాడాల్సిందే. అయితే ఒకే ఒక పర్వతం పేరు ముందు 'The' వాడం.

               The Mt. Everest - Wrong, because Everest is the name of just one mountain. So it is wrong to say, the Kanchanganga, The Dhavalgiri, as they are the names of single mountains.

5) .... India is the best.

           'Best' ముందు, 'the' వాడటం గమనించండి.

     తెలుసు కదా, ''best', superlative degree of 'good'. అంటే మనం ఎక్కడ superlative degree వాడినా, దానికి ముందు, 'the' వాడాల్సిందే.

e.g.: a) He is the tallest boy in the class (అందరిలో పొడుగు).

b) AP is the biggest (Superlative degree, So, 'the' before 'biggest') State in South India. 'the' గురించి మరికొన్ని వివరాలు, next lesson లో.

6) Gunavanth is the taller of the two = ఆ ఇద్దరిలో గుణవంతే పొడుగు. Tall కు comparative degree 'taller'. అంటే ఇక్కడ comparative కు ముందు 'the' వాడాం.  ఇక్కడ పోలిక ఇద్దరి మధ్యే (of the two).

ii) Comparative degree "taller" తర్వాత than లేదు. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే, comparative ముందు "the" వాడాలి. 

ఇద్దరి కంటే/రెండిటి కంటే ఎక్కువమంది/ వాటిని పోల్చినప్పుడు, Comparative తర్వాత "than" వచ్చినప్పుడు, ముందు "the" రాదు.

A) Of the two States, AP and TamilNadu (రెండు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో) the former (ముందు చెప్పింది-AP) is the bigger(పెద్దది).

Former కూడా comparative degree నే, Superlative - Foremost Former (Comparative of "fore") తర్వాత లేదా Bigger (Comparative of big) తర్వాత "than" లేకపోవడం గమనించండి. అందుకే వాటి ముందు "the" వాడాం.

Some more examples of "the" before comparative degree not followed by "than".

A) Prabat is the elder of the brothers (అంటే ఇక్కడ brothers ఇద్దరే. Elder తర్వాత "than" లేదు).

B) OF/ Between Ishant and Yuvraj, Ishant is the taller.

7) ఇంకా, కొన్ని రాష్ట్రాలు కలిసి ఏర్పడిన దేశాల పేర్ల ముందు "the"వాడతాం. 

The USA (The United States Of America) -మనం మామూలుగా (అమెరికా/ The States అంటాం. - ఇది కొన్ని రాష్ట్రాలు కలిసి ఏర్పడిన దేశం) The UAE (The United Arab Emirates- మనం మామూలుగా దుబాయ్ అంటాం), ఇంకా The USSR(గతంలో సోవియట్ రష్యా, ఇతర దేశాల సమాఖ్య).

అయితే ఇండియా కూడా కొన్ని రాష్ట్రాల సమూహమే కదా? మరి India ముందు "the" ఎందుకు వాడం? ఎందుకంటే India మొదటి నుంచి ఒకే దేశం, దాన్ని మనం రాష్ట్రాలుగా విభజించుకున్నాం. కాబట్టి The India అనరు.

8) "The" is used before designations and offices, హోదాల (designations) ముందు, Offices (పదవుల) ముందు, the వాడతాం. (Office అంటే కార్యాలయం కూడా ?)

The District Collector, The Mandal Revenue Officer (The MRO) etc., ఇవన్నీ designations. Also The principal, The Vice - Chancellor etc.

The President of India, The Chief Minister, The MLA, The MP etc., ఇవన్నీ పదవులు (Offices).

A) The Governor of AP, Mr. Narasimhan.

B) The Principal of our college, Dr. Sudhakar etc.

అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పదవి/ హోదా ముందు, తర్వాత వ్యక్తి పేరు వస్తే, ఆ పదవి/ హోదా ముందు "The" వస్తుంది. కానీ వ్యక్తి పేరు ముందూ, పదవి/ హోదా తర్వాత వస్తే, వాటి ముందు "The" రాదు.

e.g: a) The Prime Minister of India, Mr. Manmohan Singh = Mr.Manmohan Singh, Prime Minister of India.

 b) The Governor of AP Mr. Narasimhan = Mr. Narasimhan, Governor of AP.  వ్యక్తి పేరు తర్వాత పదవి పేరు  వస్తే, "the" లేకపోవడం గమనించండి.

9) ఇది గమనించండి:

Meena: Prajwal, Have you seen the Taj (తాజ్‌మహల్ చూశావా?)

Prajwal: Unfortunately no, but I have seen the Kutubminar in Delhi. I have visited the Ajantha caves too. (దురదృష్టం, నేను చూడలేదు. అయితే కుతుబ్‌మీనార్, అజంతా గుహలు చూశాను.)    

Meena: The Rashtrapathi Bhvan in Delhi? (ఢిల్లీలో రాష్ట్రపతిభవన్?)

Prajwal: I've seen that too (అదీ చూశాను)

Tajmahal, Kutubminar- ఇవి జ్ఞాపక చిహ్నాలు (Monuments); రాష్ట్రపతి భవన్ - ఇది గొప్ప, ప్రసిద్ధికెక్కిన భవనం - వీటిముందూ "The" రావాలి.

Hundred meters from here, you find the passport office. The rail station is just a kilometre from there. You'd (you had) better take an auto. (ఇక్కడ నుంచి రెండు మూడు వందల మీటర్ల దూరంలో Passport office ఉంది. అక్కడ నుంచి రైల్వేస్టేషన్‌కి కిలోమీటర్ ఉంటుంది. ఆటోలో వెళ్లడం మంచిది.)

రైల్వేస్టేషన్, పాస్‌పోర్ట్ ఆఫీస్ లాంటివి మనకూ మనతో మాట్లాడే వాళ్లకు తెలిసిన ప్రదేశాలు. వాటి ముందు పై సంభాషణలోలా 'The' వాడటం తప్పనిసరి. అలాగే The collectors office, The police station, The post office, The Govt. General Hospital etc.

Prasad: Who is the boy that got the first prize? (మొదటి బహుమతి పొందిన అబ్బాయి ఎవరు?)

Prakash: Look there. He is the third in the row of boys there. (అక్కడ చూడు, ఆ పిల్లల వరసలో మూడోవాడు). చూశారా? First, Second, Third, Tenth, Fifteenth etc - అంటే ఎన్నోది అని చెప్పేవాటి ముందు కూడా 'The' వస్తుంది.

a) Jawaharlal Nehru was the first Prime Minister of India.

b) This is the 15th day of the month.

Sundar: When do you go for a walk worthy? (నువ్వు మామూలుగా walking కు ఎప్పుడు వెళ్తావు?)

Manohar: Mostly in the morning, now and then in the evening.  గమనించారు కదా? Morning, Evening etc., ముందు 'the' వాడతాం.

He goes to school in the morning.

He has returns at four in the evening. He has lunch at one in the afternoon. In the night before going to bed, he takes milk.  (ఇది నెలలో 15వ రోజు).

అయితే ఇదికూడా గమనించండి.

In the night = at night

In the beginning he did not like the school, but as time went on, he liked it more and more. In the end he was sad to leave the school.

చూశాం కదా?

The beginning, the end, the middle.

Look at the following
 

The boy goes to school at 9; his father a doctor goes to hospital and his mother, to market, about the same time.ఇక్కడ School, hospital, market ముందర a/ an లేదా The లేదు కదా?   

ఇవన్నీ కూడా అక్కడ జరిగే పనులను తెలపడానికి ఉపయోగిస్తున్నాం.

a) Students go to school (school ముందు a/an The లేవు).

Parents/ doctors go to hospital. [hospital ముందు The లేదు]

People who want to buy things go to market (market ముందు 'The' లేదు).

a/an లేదా The రాని మరికొన్ని సందర్భాలు 

At home (మాట్లాడుతున్న వాళ్ల ఇంట్లో)

At work - My mother is at work (పనిలో ఉంది)

I called him by mistake (పొరపాటున) 

By chance I met him (అనుకోకుండా)

They took part in the game (పాల్గొన్నారు)

Exercise

Supply 'a/an' or 'The' where necessary. Where they need not be used, mark 'x'.

1) There is .... dog in .... room.

2) She is .... tallest girl in .... class.

3) .... books are kept in libraries.

4) What do you like more? .... English movies or telugu movies.

5) Where is .... boy that has stolen ... book from the library.

6) .... dictionary gives the meanings of .... words.

7) .... city is much bigger place than .... village.

8) There is ....book shop near our home, and .... shop near to it sells stationary but in both .... shops..... prices are very high.

9) .... diamond ring costs more than.... plain ring, but I always prefer.... plain ring, to... diamond ring.

10) .... student returns from .... college at five in ... evening.

11) ... Srilanka is.... Island to.... south of India.

12) We had.... dinner at.... new restaurant last night.

13) She is .... second girl to get ... prize.

14) These are .... girls who wish to join... school.

15) .... Pacific is .... deeper than... Atlantic.

16) If Kolakatha and .... Chennai ... former is bigger than ... latter.

17) .... Elephants live in .... forests.

18) .... cycle is no use in .... rain.

19) ... beauty of ... Kashmir attracts a lot of tourists.

20) Only.... few attended .... exam held on... Thursday last

Answers

1) a, the

2) the, the

3) X

4) X

5) the, the

6) The, X

7) A, a

8) a, the, the, the

9) A, a, a, a

10) The, the, the

11) X, an, the

12) X, the

13) the, the

14) The, the

15) the, X, the

16) X, the, the

17) X, X

18) A, X

19) The, X

20) a, the, X

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌