• facebook
  • whatsapp
  • telegram

  It is one of the best novels

Prasen: I've just finished reading a novel. Certainly it is one of the best novels I have read.
(ఇప్పుడే ఒక నవల చదవడం పూర్తిచేశాను. నేను చదివిన అత్యుత్తమ నవలల్లో అది ఒకటి అని కచ్చితంగా చెప్పగలను).

Seshagiri: How about lending it to me? I like to read it too.
(నాకొకసారి ఇస్తావా? దాన్ని నేనూ చదువుతాను).
Prasen: I will. But be sure to return it as soon as you can, you are one of the laziest friends I have. You take a long time to finish a book.
(ఇస్తాను. కానీ వీలయినంత త్వరగా తిరిగిచ్చేందుకు ప్రయత్నించు. నాకున్న అతిబద్ధకస్తులైన స్నేహితుల్లో నువ్వొకడివి.) 
Seshagiri: Very few of my friends are as unpleasant as you. None of them are so open as you in faulting others.
(నా స్నేహితుల్లో చాలా కొద్దిమంది మాత్రమే నీ అంత అమర్యాదకరంగా ఉంటారు. ఇతరులను తప్పు పట్టడంలో వాళ్లెవరూ నీలా ఉన్నదున్నట్లు చెప్పరు.)
Prasen: Take my words in the right spirit. Precisely because I am your friend, I am so open with you.
(నా మాటలు సరైన విధంగా తీసుకో. నువ్వు నా మిత్రుడివి కాబట్టే, నీతో అంత బాహాటంగా ఉన్నా.)
Seshagiri:  Hand the book here. I'll start reading it immediately and finish it in a few days.
(ఆ పుస్తకం ఇలా ఇవ్వు. వెంటనే చదవడం ప్రారంభించి కొద్ది రోజుల్లోనే పూర్తి చేస్తా.)
Look at the following sentences from the conversation above
a) It is one of the best novels.
b) You are one of the Laziest friends I have.
c) Very few of my friends are as unpleasant as you are.
We continue in this lesson, the transformation of adjectives from one degree to another.

ఈ పాఠంలో కూడా మనం Degrees of Comparision గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం.
కిందటి
Lesson (Degrees of Comparision - I) లో మనం తెలుసుకున్నది:
Adjective అంటే ఎవరివైనా/ దేనివైనా గుణాలను, వాళ్లు/ అవి ఎలాంటివాళ్లో (ఎలాంటివో) తెలిపేవి. మామూలుగా ఇవి nouns ముందర వస్తాయి.
A tall boy - ఇక్కడ tall (పొడవైన) అనే మాట, boy ను గురించి చెప్తోంది. అంటే boy గుణాన్ని తెలుపుతోంది. కాబట్టి 'tall' Adjective అన్న మాట.
Adjectives కు తెలుగులో అయిన, అయినటువంటి అనే అర్థాలు వస్తాయి. ఇంకా ఫలానా విధంగా ఉన్న, లాంటి అనే అర్థాలు కూడా వస్తాయి. What kind of (ఎలాంటి) అనే ప్రశ్న, noun కు వేసుకుంటే వచ్చే answer adjective.
e.g.: A long story - The word 'long' says something about/ qualifies the noun. To know whether a word is adjective or not, put the question, 'What kind of story?' ఎలాంటి కథా? The answer is, a long story. So 'long' is an adjective. ఎలాంటి కథ? పొడవైన కథ - కాబట్టి 'పొడవైన' అని అర్థం వచ్చే 'long' adjective.
Some more examples of adjectives:
a) short, good, bad, ugly, calm, thick, shine, thin, fat, small, big, large, handsome etc.
b) All words ending in 'ful' are adjectives.
e.g.: beautiful, wonderful, shameful, doubtful etc.
c) All words ending in 'less' are adjectives.
e.g.: pitiless, merciless, tireless, selfless, hopeless etc.
d) All words formed by adding - 'y' to some of the words - usually nouns.

e.g.: fat (కొవ్వు) - Noun:
        fatty = కొవ్వు పదార్థం రకం - Adj;
        bulk - లావు (Noun)
       
bulky - లావుగా ఉన్న - Adj.
       
dirt (noun) మురికి - dirty (మురికిగా ఉన్న).
f) All words ending in 'table'/ '+ able' are adjectives - bearable (unbearable), understandable, tolerable, fashionable, washable, loveable etc. (+able = తగిన)
కిందటి
lesson లో మనం ఈ నమూనాలో ఒక degree నుంచి మరో degree కి మార్చడం చూశాం:
Model - I
Superlative: He is the tallest in the class.
(అందరిలో అతడు పొడవు).

Comparative: He is taller than any other student/ all other students in the class.
Positive: No other student in the class is as tall as he/ so tall as he.

lesson లో మనం కొన్ని ఇతర నమూనాలు చూద్దాం.
Model - II

He is one of the tallest boys in the class.
Model - I
లో
He is the tallest - అతడు అందరిలో పొడవు
Model - II లో
He is one of the tallest అంటున్నాం - అంటే అతడు అత్యంత పొడవైన వాళ్లలో ఒకడు అంటున్నాం.
Model - I, Model - II కూ తేడా ఉంది కదా? కాబట్టి Model - II Comparative, Positive లో కూడా తేడా ఉంటుంది. చూద్దాం.
Superlative: He is one of the tallest boys in the class.
Comparative: He is taller than most other boys in the class.
class.
Positive: Very few boys in the class are as tall as he.
class.

గమనించారు కదా తేడాను?

ఇప్పుడు Model - III చూద్దాం.
Superlative: He is not the tallest boy/ not one of the tallest boys in the class.
(క్లాసులోని పిల్లలందరిలో అతడు పొడవైనవాడు కాదు.)
దీనికి

Comparative: Some boys in the class are taller than he.
(క్లాసులోని కొంతమంది ఇతర పిల్లలు ఇతడి కంటే పొడవు = అందరికంటే ఇతనేం పొడవు కాదు.)/ He is not taller than some other boys in the class.
Positive: Some boys in the class are atleast as tall as he (is).

(క్లాసు‌లో కొంతమంది పిల్లలు కనీసం అతనంత పొడవు).
ఈ మూడు models ను ఒకేసారి చూసి అవగాహన చేసుకునేందుకు ఈ పట్టిక చూడండి.

ఈ పట్టికను ఉపయోగించి బట్టి Degrees of Comparision Practice చేయడం సులభం.
ఇంకొక
model ఉంది. ఇందులో రెండింటిని/ ఇద్దరిని మాత్రమే పోలుస్తాం.
(పైన చెప్పిన
models లో Compare more than 2 persons/objects.)
      Mumbai is larger than Chennai. Here, only two cities are compared. So there is no superlative.
Comparative: Mumbai is larger than Chennai.

(చెన్నై కంటే ముంబై పెద్దది).
దీనికి
Positive degree, చెన్నై ముంబయి కంటే పెద్దది కాదు అని వస్తుంది.
Positive: Chennai is not as/so large as Mumbai.
గమనించండి: model లో Comparative లో 'not' లేదు. Positive లో 'not' వస్తుంది. అదే Comparative లో 'not' వస్తే, Positive లో 'not' రాదు. అంతేకాకుండా ఈ model లో మనం పోల్చే వస్తువులు, విషయాలు, వ్యక్తులు, degree మార్చినప్పుడు ఒక degree లో ముదుండేది, మరో degree లో చివర, ఒక degree లో చివర ఉండేది, ముందుకు మారతాయి. చూడండి.
Comparative: Venkat is taller than Karim.
(ఇందులో Venkat ముందూ, Karim చివరా ఉన్నాయి, 'not' లేదు.)
Positive: Karim is not so/as tall as Venkat.
చూశారు కదా? Positive లోకి మార్చేసరికి, Karim ముందు, Venkat చివరా వచ్చాయి. అంతేకాకుండా, Comparative లో not లేదు Positive లో 'not' ఉంది. ఇది ఒక model. When we compare only two persons/ things.

Look at the other model of comparision between two:
Comparative: Saran is not taller than Mahesh.

(శరణ్ మహేష్ కంటే పొడవు కాదు).
గమనించాల్సిన విషయం:
Comparative లో 'not' అంటే, Positive లో subjects, Saran and Mahesh ముందు వెనక ఉండటమే కాకుండా, not కూడా ఉండదు. దానికి బదులు atleast వస్తుంది.
Positive: Mahesh is atleast as tall as Saran.
(మహేష్ కనీసం శరణ్ అంత పొడుగ్గా ఉంటాడు).

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌