• facebook
  • whatsapp
  • telegram

Singular  and  Plural Nouns

మరికొన్ని Nouns కు Singular, Plural ఒకే రూపంలో ఉంటాయి. అంటే ఒకే మాటను Singular లోనూ, Plural లోనూ వాడతాం. అవి:

1. Aircraft = విమానం (Singular)/ విమానాలు (Plural)
a) An aircraft (ఒక విమానం - Singular) is launching here tomorrow (ఒక విమానం రేపు ఇక్కడ దిగుతోంది).
b) These aircraft (విమానాలు - Plural) are made in India. (ఈ విమానాలు భారత్‌లో తయారయ్యాయి).

2. Deer = జింక (Singular)/ జింకలు (Plural)
a) A deer (ఒక జింక - Singular) is under the tree. (చెట్టు కింద ఉంది). 
b) Some deer (కొన్ని జింకలు - Plural) are by the lake. (ఆ సరస్సు దగ్గర ఉన్నాయి).
3)
Fish = చేప ((Singular)/ చేపలు (Plural)
a) A fish (ఒక చేప - Singular) is caught in the net. (వలలో చిక్కింది). 
b)
Some fish (కొన్ని చేపలు - Plural) are very tasty. (చాలా రుచిగా ఉంటాయి).
గమనిక:
Science లో రకరకాల చేపలు అనే అర్థంలో 'Fishes' Plural గా వాడతారు.
4)
Means = మార్గం (పద్ధతి, సాధనం) (Singular)/ మార్గాలు (పద్ధతులు, సాధనాలు) (Plural)
a) The means he followed (అతడు అవలంబించిన పద్ధతి/ మార్గం - Singular) is bad (చెడ్డది). 
b) There are many means (చాలా మార్గాలున్నాయి - Plural) of earning money. 
(డబ్బు సంపాదించడానికి).
5)
Offspring = సంతతి (ఒకరు - Singular), సంతతికి చెందినవి/ చెందినవారు - (Plural).
a) The human (మనిషి - Singular) is the offspring of the monkey. (వానర సంతతికి చెందిన ప్రాణి). 
b) The Kowravas (కౌరవులు - Plural) are the offspring of Dhrutarashtra. (ధృతరాష్ట్రుడి సంతతివారు - Plural).
6)
Species = జంతు, వృక్షజాతి (Singular)/ జంతు, వృక్షజాతులు (Plural)
a) This species of fish (ఈ జాతి (Singular) చేపలు) is rare (అరుదు). 
b) Many species of fish (Plural) are found in the sea. (చాలా జాతుల చేపలు సముద్రంలో దొరుకుతాయి).
7)
Series = వరుసక్రమం (Singular)/ వరుసక్రమాలు (Plural)
a) This attack (ఈ దాడి) is the first of a series (ఒక వరస - Singular) of attacks on Indians.
b) He has played four or five test series (నాలుగైదు test matches series - Plural) for India.
8) Sheep = గొర్రె (Singular) / గొర్రెలు (Plural)
a) A sheep (ఒక గొర్రె - Singular) follows its herd (తన మందను అనుసరించి వెళ్తుంది). 
b)
Sheep (గొర్రెలు - Plural) are reared (పెంచుతారు) both for their meat and wool. (వాటి మాంసం, ఉన్ని కోసం).
9)
Swine - అసలు అర్థం - పంది (Singular)/ పందులు (Plural) - అయితే దీన్ని ఎప్పుడూ తిట్టేందుకు/ science పరిభాషలో (ఉదాహరణకు - swineflue) వాడతారు. 
a) He is behaving like a swine = అతడు ఓ పందిలా (Singular) ప్రవర్తిస్తున్నాడు. 
b) These swine need to be sent out = ఈ పందులను (మనుషులను తిడుతూ) బయటికి పంపాలి.
Sailaja: Where is the book I gave you yesterday? (నేను నిన్న నీకిచ్చిన పుస్తకం ఏది?)
Sashi: You mean that new edition of the Bhagavadgita? (నువ్వనేది భగవద్గీత కొత్త సంకలనం గురించా?)
Sailaja: Exactly (సరిగ్గా అదే).
Sashi: Oh, it is on the table there. I like its cover very much, especially the back cover.
It shows a beautiful picture of the Himalayas, and the Ganga
. (అది ఆ table మీద ఉంది. దాని అట్ట బాగా నచ్చింది నాకు, ముఖ్యంగా వెనక అట్ట - అది హిమాలయాలను, గంగను చూపిస్తోంది).

Sailaja: It is my brother's. He bought it in the US. (అది మా అన్నయ్య America లో కొన్నాడు).
Sashi: When did he go there? Wasn't he in the Netherlands (Holland) for some time? (ఆయన అక్కడికెప్పుడు వెళ్లాడు. నెదర్లాండ్స్‌లో ఉండేవారు కదా?)
Sashi: What do you think? I feel that of the two, The US is the better country to live in. The longer you live in India, the sadder you are because of the corruption here. (నీవేమనుకుంటున్నావు? రెండింటిలో అమెరికా మెరుగని నేననుకుంటున్నా. భారత్‌లో ఎంత ఎక్కువ ఉంటే అంత నిరాశగా ఉంటుంది, ఇక్కడి అవినీతి వల్ల).
Sailaja: Perhaps you are right. Even Mr. Singh, PM of India doesn't seem to be much worried about the corruption his government. 
(నువ్వనేది సరైందేనేమో. ప్రధాని సింగ్ కూడా తన ప్రభుత్వం అవినీతి గురించి అంతగా ఆదుర్దా పడుతున్నట్లు అనిపించడంలేదు).
Sashi: Perhaps the average Indian has no hope of a clean India in the near future. (బహుశా సగటు భారతీయుడికి, పరిశుద్ధమైన భారత్‌ను గురించిన ఆశలు ఇప్పుడిప్పుడే లేవేమో).
Sailaja: I'm afraid, no. (లేనట్లేనని నా భయం). 
Look at the following expressions from the conversation above:
      1) The book I gave you yesterday.
      2) The Bhagavadgita.
      3) It's on the table there.
      4) ... picture of the Himalayas and the Ganga.
      5) I bought it in the US.
      6) He used to be in the Netherlands.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌