• facebook
  • whatsapp
  • telegram

Senior, Inferior, Superior, Prior

Rahul: Certainly Sankar is the greatest singer we have, isn't he?

(కచ్చితంగా మనకున్న గాయకుల్లో శంకర్ అత్యంత గొప్పవాడు, కదా?)

Kuber: Of course, his voice is better than that of any other singer.

(నిజమే. ఇతర గాయకుల కంటే అతడి కంఠం మెరుగైంది.)

Rahul: I agree with you there. Further, no other singer's voice is as clear as his.

(ఆ విషయం నేను ఒప్పుకుంటాను. అంతేకాకుండా ఇతర ఏ గాయకుడి కంఠమైనా, అతడి కంఠమంత స్పష్టంగా ఉండదు.)

Kuber:  The only problem, however, is that his interest in music, is not as deep as that of other singers.

(వచ్చిన సమస్యల్లా ఏంటంటే... సంగీతంలో అతడికి ఇతర గాయకులకున్నంత శ్రద్ధ లేదు.)

Rahul: His father was one of the greatest violinists of his time. No doubt he takes after his father.

(అతడి తండ్రి ఆ రోజుల్లో గొప్ప వయెలిన్ విద్వాంసుల్లో ఒకరు. ఆయన పోలిక ఈయనకు వచ్చిందనడంలో సందేహం లేదు.)

Kuber:  Only, he lacks his father's devotion to the art.

(ఒక్కటేంటంటే ఈయనకు అతడి తండ్రికి ఉన్నంత అంకితభావం లేదు)

The elephant is the largest animal in the world.

(ప్రపంచంలోని అన్ని జంతువుల్లో ఏనుగు అత్యంత పెద్దది) - Superlative degree

ఇలాంటి పోలిక ఉన్నప్పుడు, దాన్ని ఎలా Comparative degree, Positive degree లకు మార్చాలో చూద్దాం:

Now look at the following sentences from the conversation above.
Sankar is the greatest singer we have.
(మనకున్న గాయకుల్లో శంకర్ అత్యంత గొప్ప గాయకుడు)- ఇక్కడ great కు ''greatest' superlative degree. Comparative లోకి మార్చాలంటే, మనం greater అని వాడాలి.


Comparative degree: Sankar is greater than any other singer/ all other singers we have. (మనకున్న గాయకులందరి కంటే శంకర్ గొప్ప గాయకుడు)
Positive degree: No other singer we have is as/so great as Sankar.
(మనకున్న ఏ ఇతర గాయకుడూ శంకర్ అంత గొప్పవాడు కాదు.)
Imp: adjective లో ఉన్న syllable సంఖ్య, చివరి మాట ఆధారంగా Adjectives ను Comparative, Superlative degrees లోకి మార్చవచ్చు. (Syllable = ఒక)
ప్రతి మాట (word)లో Syllable/Syllables ఉంటాయి. ఇప్పుడు Syllable అంటే ఏమిటో తెలుసుకుందాం.
Syllable = ఒక Vowel sound (Vowel letter కాదు) ఉండే letter combination.
e.g.: 'big' - /bIg/ - ఈ మాటలో ఒకే syllable ఉంది. ఎందుకంటే ఒక Vowel sound 'ఇ' మాత్రమే ఉంది.
 'Cook'- ఇది కూడా ఒక syllable ఉన్న పదమే- ఒకే Vowel Sound 'ఉ' ఉంది.
 'Decide' - దీనిలో two syllables ఉన్నాయి. 1) De 2) cide
Construction ఈ పదంలో Three Syllables ఉన్నాయి. 1) con, 2) struc 3) tion.
ఒక adjective కు, comparative, superlative ఎలా వస్తాయనేది, వాటిలో ఉన్న syllables సంఖ్యను, చివరి శబ్దాన్ని అనుసరించి ఉంటుంది.
1. చివర 'e' లేకుండా ఒకే syllable ఉండే adjectives కు 'er', 'est'ని చేరిస్తే comparative, superlative degree లు వస్తాయి.
         Positive              Comparative              Superlative
           high                   higher (+er)               highest (+est)
           small                 smaller (+er)              smallest (+est)


 

2. చివర 'e' వచ్చే adjectives కు '+r'ను చేరిస్తే Comparative, '+st' ని చేరిస్తే Superlative వస్తాయి.
         Positive              Comparative              Superlative
           fine                       finer (+r)                 finest (+est)
           brave                   braver (+r)             bravest (+est)
3. హ్రస్వ (short) syllable ఉండి, చివర single consonant శబ్దం వస్తే, ఆ consonant ను రెట్టింపు చేసి దానికి '+er' చేరిస్తే, comparative, '+est' చేరిస్తే superlative degree వస్తాయి.
         Positive              Comparative              Superlative
             big                       bigger (+ger)            biggest (+gest)
             thin                     thinner (+ner)          thinnest (+nest)
4. చివర 'y' వచ్చి దాని ముందు consonant sound వచ్చే adjectivesకు, చివరి y ముందు '+ier' చేరిస్తే comparative, '+iest' చేరిస్తే superlative degree వస్తాయి.
         Positive              Comparative              Superlative
           easy                easier (+ier)            easiest (+ iest)
           holy                holier (+ier)             holiest (+ iest)
5. Three syllables కంటే ఎక్కువ adjectives విషయంలో వాటి ముందు more చేరిస్తే Comparative, most చేరిస్తే Superlative degree వస్తాయి.
         Positive              Comparative              Superlative
         beautiful:           more beautiful             most beautiful
         difficult:             more difficult             most difficult
6. కొన్ని adjectives పైన చెప్పిన పద్ధతుల్లో కాకుండా, ఒక పద్ధతి లేకుండా Comparative, Superlative గా ఏర్పడతాయి.
         Positive              Comparative              Superlative
           bad/ill               worse                     worst
           good                 better                     best
           little                less                         least
           many/much       more                        most
           far               farther                      farthest
7. Superior (గొప్ప), Inferior (తక్కువ రకమైన), Senior (వయసులో/అనుభవంలో పెద్ద), Junior (వయసులో/అనుభవంలో చిన్న), Prior (అంతకు ముందే ఉన్న)- ఈ adjectives అన్నీ Comparative degrees. వీటికి Superlative, Positive degrees లేవు. వీటి తర్వాత 'to' మాత్రమే వస్తుంది, than రాదు.

e.g.: a) Team A is superior to team B
        (A జట్టు, B జట్టు కంటే మెరుగైంది)
        b) Team B is inferior to team A
            (B జట్టు, A జట్టుకంటే తక్కువైంది)
        c) Gandhi was senior to Nehru
            (నెహ్రూ కంటే గాంధీ వయసులో/అనుభవంలో పెద్ద)
        d) Nehru was junior to Gandhi
            (గాంధీ కంటే నెహ్రూ వయసులో/అనుభవంలో చిన్న)
        e) Indian Independence was prior to Gandhi's death
            (గాంధీ మరణం కంటే ముందే భారత్‌కు స్వాతంత్య్రం వచ్చింది)
        మనం మామూలుగా ఒకే రకమైన వస్తువులనూ, మనుషులనూ, జంతువులనూ వివిధ రకాలుగా పోలుస్తుంటాం. మనం పోల్చే విధానం ద్వారా, ఒక degree నుంచి మరో degree లోకి మారుస్తుంటాం. వాటిని చూద్దాం.
Model No 1: వీటిలో ఉన్నవాటిల్లో ఒకటి/ ఉన్నవాళ్లల్లో ఒకరు, అన్నింటిలో/అందరిలో గొప్ప అని చెప్పడం.
Superlative: Everest is the highest mountain in the world. (ప్రపంచంలోని పర్వతాలన్నింటిలో ఎవరెస్టు ఎత్తైంది)
                    - ఇక్కడ అన్నింటిలో ఒకటి అత్యంత గొప్పదైందని.
గమనించండి: Superlative degree ముందు ఎప్పుడూ 'the' వాడాలి.
            Everest is the highest of all mountains in the world/ Everest is the highest mountain of all in the world అంటాం.
            Some more examples of superlative degree.
a) Kolkata is the largest city in India/ the largest city of all in India/ the largest of all cities in India.

b) Kumar is the tallest boy in the class/ Kumar is the tallest of all boys in the class/ Kumar is the tallest boy of all in the class.
c) India is the largest democracy in the world/India is the largest of all democracies in the world/ India is the largest democracy of all in the world.
ఈ model superlative degree లో ఏ ఒక్కటో/ఒక్కరో అన్నింటిలో అత్యంత గొప్పది/పెద్దది అంటాం.

దీనికి comparative చూద్దాం.
1. Kolkata is larger than any other city/ all other cities in India 
(కోల్‌కతా దేశంలోని మిగతా ఏ నగరాని కంటే / అన్ని నగరాల కంటే పెద్దది).
      ఈ model comparative లో మనం గమనించాల్సింది.
Comparative degree + than + any other city/ than + all other cities in India.
     ఇప్పుడు ఈ model కు positive చూద్దాం.
    No other city in India is as large as/ so large as Kolkata.
   (భారత్‌లో ఏ ఇతర నగరం/ఇతర నగరాలు కోల్‌కతా అంత పెద్దవి కాదు/కావు)

Superlative: The + superlative degree of the adjective.
Comparative: Comparative degree + than any other/ all other.
Positive: No other... so/ as + positive + as ... 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌