• facebook
  • whatsapp
  • telegram

AP EAPCET 2024 Results: ఈఏపీసెట్‌ టాప్‌-10 ర్యాంకర్లు వీరే..

* ఇంజినీరింగ్‌లో 75.51%, అగ్రికల్చర్‌లో 87.11 శాతం ఉత్తీర్ణత

ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 3,62,851 మంది దరఖాస్తు చేయగా.. వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌కు సంబంధించి 2,58,373 మంది, వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు కలిపి 80,766 మంది పరీక్షలు రాశారు. ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. దీని ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. ఇంజినీరింగ్ విభాగంలో మాకినేని జిష్ణుసాయి(97.0022 మార్కులు), ఎం.సాయి యశ్వంత్‌రెడ్డి(96.8358 మార్కులు), పి.సతీష్‌రెడ్డి(96.4285 మార్కులు) మొదటి మూడు ర్యాంకులు; వ్యవసాయ విభాగంలో వై.శ్రీశాంత్‌రెడ్డి(93.4463 మార్కులు), పి.దివ్యతేజ(92.9278 మార్కులు), వి.ముఖేశ్‌చౌదరి (92.7966 మార్కులు) మొదటి మూడు ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో ఉత్తీర్ణత శాతం 75.51% నమోదుకాగా, 1,95,092 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. వ్యవసాయ విభాగంలో 70,352 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించడంతో 87.11 శాతం ఉత్తీర్ణత నమోదైంది
 


  ఇంజినీరింగ్ స్ట్రీమ్‌ టాప్‌-10 ర్యాంకర్ల జాబితా   


  అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌ టాప్‌-10 ర్యాంకర్ల జాబితా  
 

Updated Date : 12-06-2024 9:42:20

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం