• facebook
  • whatsapp
  • telegram

AP EAPCET: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు ఎప్పుడంటే?

* ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ

ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్‌ 2024 పరీక్ష ఫలితాలు విడుదలచేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వచ్చే వారం(జూన్‌ మొదటి వారం)లో ఫలితాలు వెల్లడి కానున్నాయని సమాచారం. ఫలితాలతో పాటు కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించే అవకాశముంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో మే 16 నుంచి 23 వరకు ప్రవేశ పరీక్షలు జరిగాయి. ఇప్పటికే ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్‌ షీట్లు విడుదల కాగా అభ్యంతరాలు స్వీకరించిన విషయం తెలిసిందే. పరీక్షలకు మొత్తం 93.47 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. అన్ని విభాగాలకు కలిపి 3,62,851 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,39,139 మంది పరీక్షలు రాశారు. ఇంజినీరింగ్‌కు సంబంధించి 2,74,213 మందికి గాను 2,58,373 (94.22%) మంది హాజరయ్యారు. బైపీసీ స్ట్రీమ్‌కు 88,638 మంది దరఖాస్తు చేయగా.. 80,766 (91.12%) మంది పరీక్ష రాశారు. ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25% వెయిటేజీ ఇవ్వనున్నారు. ఫలితాలను https://pratibha.eenadu.net/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.


 

  ఏపీ, టీఎస్‌ మాక్ కౌన్సెలింగ్స్ - 2024  

  
ఈఏపీసెట్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి   

 

Published Date : 28-05-2024 14:56:24

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం