• facebook
  • whatsapp
  • telegram

Apprentice Mela: 4న ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటిస్‌ మేళా  

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: అక్టోబ‌రు 4వ తేదీన ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో అప్రెంటీస్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్, కన్వీనర్‌ గొంది హరి ధర్మేంద్ర తెలిపారు. మేళాకు ప్రముఖ కంపెనీలు రాంకో సిమెంట్స్, కేసీపీ సిమెంట్స్, అల్ట్రా టెక్‌ సిమెంట్స్, కేసీపీ షుగర్స్, జి.ఎస్‌.ఎలక్ట్రికల్స్, స్విచ్‌ గేర్‌ అండ్‌ ఫ్యాబ్రికేషన్స్, జిల్లాలోని ఇతర ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను అప్రెంటీస్‌లుగా ఎంపిక చేస్తారని చెప్పారు. ఐటీఐ ఉత్తీర్ణులై, అప్రెంటిస్‌ పూర్తి కాని అన్ని ట్రేడుల అభ్యర్థులు మేళాకు తమ ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు 0866-2475575, 8309442698 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ మేటి భవితకు మల్టీ డిసిప్లినరీ కోర్సు

‣ పచ్చదనం పెంపులో వెనకంజ

Posted Date : 25-09-2021