• facebook
  • whatsapp
  • telegram

APPSC : త్వరలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ఫలితాలు

* ఏప్రిల్‌ 13 లోగా వెలువడే అవకాశాలు

ఈనాడు-అమరావతి: గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ఫలితాలు ఏప్రిల్‌ 13 లోగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ, ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నోటిఫికేషన్‌ జారీకి, ప్రిలిమ్స్‌ మధ్య ఉన్న తక్కువ సమయం సన్నద్ధతకు సరిపోకపోవడం, ప్రశ్నపత్రం కఠినంగా ఉండడం, ‘భారత సమాజం’ చాప్టర్‌కు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో ఆలస్యంగా రావడం వంటి కారణాలతో ఇబ్బంది పడ్డామని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున ప్రధాన పరీక్ష (మెయిన్స్‌) రాసేందుకు అవకాశం కల్పించాలని ఏపీపీఎస్సీ కార్యాలయానికి అభ్యర్థనలు వస్తున్నాయి. దీనిపై కమిషన్‌ చురుగ్గా పరిశీలన చేస్తోంది. ప్రిలిమ్స్‌ ఫలితాల విడుదలనాటికి దీనిపై అధికారిక నిర్ణయం రావొచ్చని భావిస్తున్నారు. మరోవైపు...ఇటీవల జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ద్వారా కూడా ప్రధాన పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రశ్నపత్రంలో ఆంగ్లం నుంచి తెలుగు అనువాదంలో తప్పులు దొర్లడం, సన్నద్ధతకు తగిన సమయం లేకపోవడం వంటి కారణాల దృష్ట్యా ప్రధాన పరీక్షను ఎక్కువ మంది రాసేందుకు అవకాశాన్ని కల్పించాలని అభ్యర్థిస్తున్నారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ మూడు నెల‌ల్లో గేట్ మొద‌టి ర్యాంకు

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.