• facebook
  • whatsapp
  • telegram

TSPSC Group-1: గ్రూప్‌-1 దరఖాస్తు గడువు పొడిగింపు

త్వ‌ర‌లో ఎడిట్‌ ఆప్ష‌న్‌కు అవ‌కాశం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర తొలి గ్రూప్‌-1 దరఖాస్తు గడువును టీఎస్‌పీఎస్సీ మరో నాలుగు రోజులు పొడిగించింది. జూన్‌ 4వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మొత్తం 503 పోస్టులతో కూడిన గ్రూప్‌-1 ఉద్యోగ ప్రకటనకు మే 31న‌ రాత్రి 11 గంటల వరకు 3,48,095 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలుత ప్రకటించిన గడువు ప్రకారం మే 31న‌ చివరి తేదీ కావడంతో నిరుద్యోగులు ఆన్‌లైన్‌ దరఖాస్తులకు పోటెత్తారు. చివరి రెండురోజుల్లోనే 85,505 (24.56 శాతం) అప్లికేషన్లు రాగా, ఒక్క మే 31న‌ 48,093 దాఖలయ్యాయి. కమిషన్‌ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసినా, చివరి గంటలో రద్దీ ఎక్కువైంది. పరీక్షఫీజు చెల్లింపులకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల సమస్యలు వచ్చాయి. కొందరు తొందరపాటులో తప్పుడు పిన్‌ నెంబరు నమోదు చేయడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో కొంత గడువు ఇవ్వాలంటూ అభ్యర్థుల నుంచి కమిషన్‌కు విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో రాత్రి 11.30 గంటల తరువాత గడువును జూన్‌ 4 వరకు పొడిగిస్తున్నట్లు కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్‌ 26న టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1కు నోటిఫికేషన్‌ జారీ చేసిన కమిషన్‌ మే 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది.

 

ఉమ్మడి రాష్ట్రం కంటే అత్యధికం

2011లో గ్రూప్‌-1 కింద 312 పోస్టులు నోటిఫై చేస్తే ఉమ్మడి రాష్ట్రంలో 3,02,912 మంది దరఖాస్తు చేశారు. తాజాగా 2022 నోటిఫికేషన్‌తో వచ్చిన దరఖాస్తులు ఉమ్మడి రాష్ట్ర రికార్డును అధిగమించాయి. పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉండటం, సుదీర్ఘ విరామం తరువాత ప్రకటన రావడమే దీనికి కారణమని తెలుస్తోంది.

 

త్వరలో ‘ఎడిట్‌’ అవకాశం?

గ్రూప్‌-1 దరఖాస్తు సమయంలో తప్పులు దొర్లకుండా రివ్యూ అవకాశం ఇచ్చినప్పటికీ కొందరు అభ్యర్థులు పుట్టిన తేదీ, అర్హతలు, కళాశాల పేరు తదితర విషయాల్లో పొరపాట్లు జరిగాయని గుర్తించారు. దరఖాస్తులో తప్పులు సవరించుకునేందుకు ఎడిట్‌ అవకాశమివ్వాలని కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై కమిషన్‌ సానుకూలంగా స్పందించనున్నట్లు సమాచారం.

 

********************************************************

స్టడీమెటీరియల్
 

1. వర్తమానాంశాలు – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు
2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
3. జనరల్ సైన్స్ – శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత దేశం సాధించిన విజయాలు
4. పర్యావరణ అంశాలు – విపత్తు నిర్వహణ – నివారణ, ఉపశమనం కోసం వ్యూహాలు
5. భార‌తదేశ ఆర్థిక‌, సామాజిక అభివృద్ధి
6. ప్రపంచ భూగోళ శాస్త్రం, భారత భూగోళ శాస్త్రం, తెలంగాణ రాష్ట్ర భూగోళ శాస్త్రం
7. భారత దేశ చరిత్ర, సంస్కృతి – వారసత్వం
8. భారత ‌రాజ్యాంగం, రాజ‌కీయ వ్యవ‌స్థ
9. భారతదేశంలో ప‌రిపాల‌న‌, ప్రభుత్వ విధానాలు
10. తెలంగాణ రాష్ట్ర విధానాలు
11. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
12 .సామాజిక మిన‌హాయింపు/ వెలి ; లింగ, కుల‌, తెగ‌ల‌, వైక‌ల్యం మొద‌లైన హ‌క్కులు, స‌మ్మళిత విధానాలు
13 .లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ ప్రిటేషన్

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

 మూడు బోర్డుల్లో గ్రూపు-1 ఇంటర్వ్యూలు!

పోలీసు ఉద్యోగ పరీక్షలకు ఇదీ సిలబస్‌!

టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌ సిలబస్‌, పరీక్షావిధానం, పోస్టుల వర్గీకరణ

రాజ్యాంగంలో ఏవి ప్రధానం?

నీట్‌లో ఏ సబ్జెక్ట్‌ ఎలా చదవాలి?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.