కంటోన్మెంట్, న్యూస్‌టుడే: అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు (మ్యూజీషియన్) భర్తీకి భారత వైమానిక దళం అవివాహితులైన పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22 నుంచి జూన్ 5 వరకు నిర్వహించనున్న రిక్య్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు https://agnipathvayu.cdac.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్‌లోని 12 ఎయిర్‌మెన్ సెలెక్షన్ సెంటర్ లేదా 040-27753500 ఫోన్ నంబర్‌ను లేదా co.12ascap@gov.in మెయిల్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.