• facebook
  • whatsapp
  • telegram

TS ICET: ‘ఐసెట్’కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు

ఈనాడు, వరంగల్‌: రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘ఐసెట్-2024’కు ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. గతేడాది 75,520 దరఖాస్తులు రాగా, ఈసారి ఇప్పటివరకు 80,631 వచ్చినట్లు ఐసెట్ కన్వీనర్‌ ఆచార్య శ్రీరామోజు నరసింహాచారి గురువారం తెలిపారు. ఈ నెల 17 వరకు రూ.250 రుసుముతో దరఖాస్తుకు అవకాశం ఉండగా, రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 27 వరకు అవకాశం ఉందని తెలిపారు. దీంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కన్వీనర్‌ పేర్కొన్నారు.

Published Date : 16-05-2024 20:13:50

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం