• facebook
  • whatsapp
  • telegram

మొద‌ట ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ త‌ర్వాత‌ ఇంజినీరింగ్ 

ఈనాడు, హైదరాబాద్‌: ఈసారి ముందుగా ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు జరగనున్నాయి. జులై 5, 6 తేదీల్లో ఇంటర్‌ బైపీసీ విద్యార్థుల కోసం నిర్వహించే అగ్రికల్చర్‌ విభాగం పరీక్షలు జరుపుతారు. ఆ తర్వాత జులై 7, 8, 9 తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 5 నుంచి 9 వరకు ఎంసెట్‌ నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి గత ఫిబ్ర‌వ‌రిలోనే వెల్లడించింది. అయితే ఏ విభాగం పరీక్షలు ముందుగా జరుపుతారు? దేనికి ఎన్ని రోజులన్నది స్పష్టత ఇవ్వలేదు. ఎంసెట్‌ కమిటీ తొలి సమావేశం ఫిబ్ర‌వ‌రి 06న‌ జరగనున్నందున ఆయా అంశాలపై అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. జులై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఉన్నందున ఆ పరీక్షకు, ఎంసెట్‌కు కొంత వ్యవధి ఉండాలని భావించిన అధికారులు ముందు అగ్రికల్చర్‌ పరీక్షలు జరపాలని నిర్ణయించినట్లు తెలిసింది. జేఈఈ మెయిన్‌లో 90 ప్రశ్నలు ఇచ్చి 75 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలనే మాదిరిగా ఎంసెట్‌లో ప్రత్యేకంగా ఛాయిస్‌ ఉండదు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 100 శాతం, ద్వితీయ ఇంటర్‌లో 70 శాతం సిలబస్‌నే పరిగణనలోకి తీసుకుంటున్నందున ప్రశ్నల సంఖ్య పెంచాల్సిన అవసరం లేదని నిపుణుల కమిటీ తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఎంసెట్‌ పరీక్షలు గత ఏడాది మాదిరిగా ఉదయం 9-12 గంటల వరకు, మధ్యాహ్నం 3-6 గంటల వరకు జరుపుతారు.  ఎంసెట్‌కు దరఖాస్తు చేయాలంటే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం హాల్‌టికెట్‌ సంఖ్య అవసరం. ఈ క్రమంలో మార్చి 20 తర్వాత దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.  

Published Date : 06-03-2021 11:19:51

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం