• facebook
  • whatsapp
  • telegram

1-9 Classes: 20 నుంచి సమ్మెటివ్‌-2 పరీక్షలు

* 9వ తరగతికి 6 పేపర్ల విధానంతో నిర్వ‌హ‌ణ‌కు ఆదేశం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి సమ్మెటివ్‌ పరీక్షలు-2 ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేశ్‌కుమార్‌ మార్చి 31న విడుదల చేశారు. ఏప్రిల్‌ 20, 24, 25 తేదీల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 3, 4, 5 తరగతులకు పర్యావరణ శాస్త్రం పరీక్ష 26వ తేదీన ఉంటుంది. 6, 8వ తరగతుల విద్యార్థులకు 20, 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటాయి. 7, 9వ తరగతి విద్యార్థులకు 20, 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో మధ్యాహ్నాం 1 నుంచి 4 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లే 9వ తరగతికి కూడా 6 పేపర్ల విధానంలో నిర్వహించాలని అధికారుల్ని కమిషనర్‌ ఆదేశించారు.

మోడ‌ల్ పేపర్లు 

‣ ఎనిమిదో తరగతి  మోడ‌ల్ పేపర్లు

‣ తొమ్మిదో త‌ర‌గ‌తి మోడ‌ల్ పేపర్లు

మరింత సమాచారం... మీ కోసం!

‣ పాత ప్రశ్నపత్రాలు... ఎందుకు ముఖ్యం?

‣ భారతీయ కోర్సులకు టాప్‌ ర్యాంకులు

‣ కొయ్యగుజ్జు అడవులతో.. మంచుపొరల ఎడారులతో!

‣ సైబర్‌ సెక్యూరిటీలో ఏ కోర్సులు?ఎలాంటి ఉద్యోగాలు?

‣ మెరుగైన పీజీకి మేలైన మార్గం!

‣ చివరి వరకు స్ఫూర్తిని కొనసాగించాలంటే?

‣ శాంతిభద్రతల సంరక్షణసేనలోకి స్వాగతం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.