• facebook
  • whatsapp
  • telegram

City College: సిటీ కళాశాలకు అటానమస్‌ హోదా

ఈనాడు, హైదరాబాద్‌: శత వసంతాల ప్రభుత్వ సిటీ కళాశాల మరో ఘనత సాధించింది. కళాశాలకు అటానమస్‌(స్వయం ప్రతిపత్తి) హోదా కల్పిస్తూ విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2017-18 సంవత్సరం నుంచి 9 ఏళ్లపాటు.. అంటే 2025-26 వరకు హోదా కల్పించింది. ప్రిన్సిపల్‌ బాలభాస్కర్‌ స్వయం ప్రతిపత్తి హోదా కోసం దరఖాస్తు చేసుకోగా.. రెండు నెలల కిందట కమిటీ సభ్యులు వచ్చి పరిశీలన చేశారు. వారి నివేదిక ఆధారంగా యూజీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రత్యేకంగా అటానమస్‌ గ్రాంట్లు రానున్నాయి. కళాశాలను మరింత అభివృద్ధి చేసేందుకు వీలుంటుంది.

వందేళ్ల వేడుకలకు 29న శ్రీకారం

ఈ ఏడాదితో సిటీ కళాశాల వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏడాది పాటు  జరిగే ఉత్సవాలకు సెప్టెంబరు 29వ తేదీన అంకురార్పణ చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ వివరించారు. ప్రతి నెలా రెండు విభాగాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

న్యాక్‌ గుర్తింపు సాధించాలి

ఉస్మానియా యూనివర్సిటీ: ప్రతి కళాశాల న్యాక్‌ గుర్తింపు సాధించాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ అన్నారు. ఓయూ, రాష్ట్ర కమిషనరేట్‌ ఆఫ్‌ కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో న్యాక్‌ ప్రాముఖ్యంపై రాష్ట్రంలోని స్వయంప్రతిపత్తి కళాశాలలకు ఓయూలోని పీజీఆర్‌ఆర్‌సీడీఈ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యఅతిథిగా నవీన్‌ మిత్తల్‌ మాట్లాడారు. ఓయూ వీసీ ప్రొ.రవీందర్, ఐక్యూఏసీ సంచాలకులు ప్రొ.నాగేశ్వర్‌రావు, సంయుక్త సంచాలకులు డా.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ సత్వర ఉపాధికి ఒకేషనల్‌ దారి! 

‣ వర్గాలు.. ఇలా సులువు!

Posted Date : 22-09-2021