• facebook
  • whatsapp
  • telegram

JNTUH: అక్టోబరులో జేఎన్‌టీయూ-హెచ్‌ స్నాతకోత్సవం

ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూ-హెచ్‌ పదో స్నాతకోత్సవం అక్టోబరులో జరగనుంది. ఈ మేరకు వర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2019-20, 2020-21 సంవత్సరానికి బీటెక్, డిప్లొమా కోర్సులు, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు పట్టాల కోసం సెప్టెంబరు 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా ఆన్‌లైన్‌లో సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి దరఖాస్తుకు వర్సిటీ అవకాశం కల్పించింది. బంగారు పతకాలు సాధించిన విద్యార్థుల జాబితాను సెప్టెంబరు 24న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ మంజూర్‌ హుస్సేన్‌ ప్రకటించారు.

Posted Date : 28-08-2021