• facebook
  • whatsapp
  • telegram

CUET : సీయూఈటీ-యూజీ, నెట్‌ స్కోర్ల నార్మలైజేషన్‌ ఎత్తివేత : యూజీసీ


 

దిల్లీ: కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ -యూజీ, నేషనల్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (నెట్‌) స్కోర్ల నార్మలైజేషన్‌ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్‌ జగదీప్‌ కుమార్‌ తెలిపారు. ఈ రెండు పరీక్షలను ఒక సబ్జెక్టుకు ఒకే షిఫ్టులో నిర్వహిస్తామని, స్కోర్ల నార్మలైజేషనుతో అవసరం ఉండదన్నారు. సాధారణీకరణ విధానం సమంజసంగా లేదని, పరీక్షల్లో తమ పనితీరుపై అది ప్రభావం చూపుతున్నట్లు విద్యార్థుల నుంచి వ్యక్తమవుతున్న ఆందోళనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఒకే పేపరుకు రెండు మూడు రోజులు పరీక్ష నిర్వహించేవారమని, తద్వారా విద్యార్థులకు వీలైనంత వరకు మొదటి ఎంపిక కేంద్రం లభించేదన్నారు. ఈ ఏడాది నుంచి ఓఎంఆర్‌ విధానం అనుసరిస్తున్నందున విద్యాసంస్థల్లో పెద్దసంఖ్యలో కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, దేశవ్యాప్తంగా ఒకేరోజున పరీక్ష నిర్వహణకు ఇది అనుకూలంగా ఉంటుందని జగదీప్‌ కుమార్‌ చెప్పారు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.