* జులై 7 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు
ఈనాడు, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని ఎస్టీ స్డడీ సర్కిల్‌లో రెసిడెన్షియల్ విధానంలో సివిల్ సర్వీసెస్ శిక్షణ కోసం ప్రవేశానికి జూన్ 9 నుంచి జులై 7 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టీనా తెలిపారు. వార్షికాదాయం రూ.3లక్షల్లోపు ఉండి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు సీశాట్-2024 పరీక్ష రాసేందుకు అన్ని అర్హతలు కలిగి ఉండాలన్నారు. ఎస్టీ స్టడీసర్కిల్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేయాలన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.