• facebook
  • whatsapp
  • telegram

Application: దోస్త్‌ యాప్‌తో దరఖాస్తు సులభతరం

న్యూస్‌టుడే - కరీంనగర్‌ కలెక్టరేట్‌: డిగ్రీ ప్రవేశాల కోసం ‘డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ’(దోస్త్‌) విధానాన్ని పాటిస్తున్న విషయం విదితమే. దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొదటి విడత ప్రారంభమైంది. మూడు విడతల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. చివరి విడత పూర్తయ్యాక తరగతులు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవటానికి ఈ దఫా ఉన్నత విద్యా శాఖ కొత్తగా మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు నయా పైసా ఖర్చు లేకుండానే చరవాణి ద్వారా సులభతరంగా దరఖాస్తు చేసుకునే అవకాశముంది.

నమోదు ప్రక్రియ ఇలా..

*దోస్త్‌ వెబ్‌సైట్‌  https:///dost.cgg.gov.in  లో నమోదు చేసుకోవచ్చు. లేదా గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి దోస్త్‌ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ తరువాత విద్యార్థి చరవాణి నంబరు నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. దీని ద్వారా యాప్‌ ఓపెన్‌ చేసుకోవచ్చు.

*  విద్యార్థి పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలు నమోదు చేయాలి.

* అనంతరం ముఖ గుర్తింపునకు ఫొటో తీసుకునే వెసులుబాటు సైతం కల్పించారు. విద్యార్థి తన ఫొటోను నావిగేట్‌ చేస్తున్నప్పుడు దోస్త్‌ ఐడీ జనరేట్‌ అవుతుంది.

*  రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి దరఖాస్తు ఫారంలో అడిగిన వివరాలన్నీ నమోదు చేయాల్సి ఉంటుంది.

*  కళాశాలలు, కోర్సులు, ఫీజుల వివరాలను తెలుసుకొని వెబ్‌ ఆప్షన్‌ ప్రారంభమైన రోజు పూరిస్తే సరిపోతుంది. ఈప్రక్రియ ముగిశాక సీట్లు అలాట్‌ అవుతాయి.
 


మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

Published Date : 22-05-2024 12:04:06

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం