ఈనాడు, అమరావతి: ఫార్మసీ, బీఈడీ విద్యలో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. డిసెంబరు వచ్చినా ఇంతవరకు ఎప్పటి నుంచి ఉంటుందనే దానిపై స్పష్టత లేదు. ఉన్నత విద్యామండలి ప్రకటించిన ఉమ్మడి అకడమిక్ కేలండర్ ప్రకారం మొదటి సెమిస్టర్ జనవరి 28తో ముగుస్తోంది. ఈ కోర్సులకు ఇప్పటి నుంచి ప్రవేశాలు చేపట్టినా అకడమిక్ కేలండర్ను అనుసరించడం కష్టంగా మారుతుంది. విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోవాల్సి వస్తుంది. కొంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారులకు ఫోన్ చేసి, అసలు ఈ ఏడాది ఉంటుందా? అని ప్రశ్నిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈఏపీసెట్ ఫలితాలను జులై 26న విడుదల చేశారు. ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ పూర్తి చేసినా ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్ వారికి నిర్వహించాల్సిన ఫార్మసీ ప్రవేశాల్లో తీవ్ర జాప్యం కొనసాగుతోంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.