• facebook
  • whatsapp
  • telegram

JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్ రాస్తున్నారా.. ముఖ్య మార్గదర్శకాలివే..

* మే 26న రెండు షిఫ్టుల్లో పరీక్ష

ఈనాడు ప్రతిభ డెస్క్‌: దేశవ్యాప్తంగా మే 26న రెండు షిఫ్టుల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 పరీక్ష నిర్వహణకు ఎన్‌టీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఏపీలో 26, తెలంగాణలో 13 నగరాలు/ పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కొక్కటి 3 గంటల వ్యవధి ఉంటుంది. అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరు కావాల్సి ఉంటుంది. మొదటి పేపర్‌ ఉదయం 9 నుంచి 12 గంటల మధ్య; రెండో పేపర్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల మధ్య నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మందికిపైగా అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారే ఐఐటీల్లో బీటెక్‌ సీట్లకు పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే అడ్మిట్‌ కార్డులు అందుబాటులో వచ్చాయి. ఈ నేపథ్యంలో పరీక్ష రాసే ముందు అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

పరీక్ష రాసే అభ్యర్థులకు ముఖ్య సూచనలు...

‣ డౌన్‌లోడ్ చేసిన అడ్మిట్ కార్డ్ ప్రింటెడ్ కాపీతో పాటు ఒరిజినల్ ఫొటో తీసుకెళ్లాలి. 

  ఆధార్ కార్డ్, పాఠశాల/ కళాశాల/ విద్యా సంస్థ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడీ, పాస్‌పోర్టు, పాన్ కార్డు తదితరాల్లో ఏదో ఒకటి కచ్చితంగా ఉండాలి. 

  పెన్నులు, పెన్సిళ్లు, పారదర్శకమైన తాగునీటి బాటిల్‌కు అనుమతి ఉంటుంది.

‣ అభ్యర్థులు పాకెట్స్ లేకుండా వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.

దుస్తులపై మెటాలిక్స్ అలంకారాలు ఉంటే అనుమతించరు.

 స్కార్ఫ్‌లు, మఫ్లర్‌లు, స్టోల్స్, షాల్స్, టోపీలు, రంగుల కళ్ళద్దాలు ఇతరాలు ధరించరాదు.

బూట్లు, మందమున్న చెప్పులు అనుమతించరు.

లోహాలతో కూడిన వస్తువులను ధరించకూడదు.

ఆభరణాలు, నగలు లేకుండా చూసుకోవాలి.

ఉంగరాలు, గాజులు వేసుకోకుంటే మంచిది.

మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.


  Admit Card for JEE(Advanced) 2024 Examination  
 


  ♦  Previous papers  


  ♦  Model papers  


  JEE Advanced Study Material

Updated Date : 25-05-2024 14:43:18

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం